Bigg Boss Telugu 8: షోలోకి లావణ్య బాధితుడు ఎంటర్.. 106 గంటలతో రికార్డు.. ఈ బాషా గురించి నిజాలు తెలిస్తే!
రియాలిటీ ఆధారంగా నడిచే కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలా ఇప్పటికే ఎన్నో షోలు వచ్చాయి. కానీ, అందులో ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల ప్రేమను అందుకున్నది మాత్రం బిగ్ బాస్ షోనే అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు. అంతలా ఇది భారీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అందుకే తెలుగులో వరుసగా సీజన్ల మీద సీజన్లను ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని మొదలు పెట్టేశారు. ఇందులోకి తాజాగా ఓ కాంట్రవర్శీ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ ఎవరతను? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!
ఎన్నో అంచనాలతో వచ్చింది
తెలుగులో బిగ్ బాస్ షోకు భారీ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పటికే ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఎనిమిదో దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రారంభించారు. దీన్ని అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్లు, సెలెబ్రిటీల ఎంట్రీతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో జోష్‌తో సాగుతోంది.

ఎంతో మంది.. వాళ్లే ఎక్కువగా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ఎప్పుడో మొదలైంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీలతో నిర్వహకులు సంప్రదింపులు జరిపారు. ఇందులో ఎక్కువగా ఫేమస్ అయిన సెలెబ్రిటీలనే తీసుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో, సీరియళ్లలో, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారని కంటెస్టెంట్లను చూస్తే అర్థమైంది.
షోలోకి ఎంటరైన శేఖర్ బాషా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇందులోకి ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే మరో పోటీదారుడిగా టాలీవుడ్ నటుడు, ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా వచ్చాడు. అతడికి అక్కినేని నాగార్జున గ్రాండ్ వెల్‌కం చెప్పి ఆహ్వానించాడు. అనంతరం అతడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టేశాడు.
శేఖర్ బాషా ఎవరో తెలుసుగా
శేఖర్ బాషా 2005లో తెలుగు జెమిని మ్యూజిక్ ఛానల్‌లో వీడియో జాకీ (VJ)గా తన కెరీర్ ప్రారంబించాడు. ఆ తర్వాత 3000లకు పైగా లైవ్ షోలు చేశాడు. ముఖ్యంగా 'హాయ్-బుజ్జి' షోతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ తర్వాత ఆర్జేగానూ మారాడు. ఈ క్రమంలోనే 'వెల్కమ్ ఒబామా' అనే సినిమాతో శేఖర్ బాషా నటుడిగానూ పరిచయమై చాలా చిత్రాల్లో కనిపించాడు.
మారథాన్ ఫీట్‌తో రికార్డులు
శేఖర్ బాషా ఆర్జేగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా నాలుగు సార్లు రేడియోలో మారథాన్‌లు నిర్వహించి ఏకైక ఇండియన్ ఆర్జేగా రికార్డు సాధించాడు. అంతేకాదు, 18 అవార్డులు అందుకుని అందరి కంటే ఎక్కువ ఐఆర్ఎఫ్‌లను గెలుచుకున్న ఆర్జేగానూ నిలిచాడు. ఆ తర్వాత కూడా శేఖర్ బాషా దర్శకుడిగానూ మారి ఓ సినిమాను తెరకెక్కించాడు.
లావణ్య కేసుతో సెన్సేషన్‌గా
గతంలోనే శేఖర్ బాష చాలా మందికి సుపరిచితుడు అయ్యాడు. కానీ ఆ తర్వాత అతడు పెద్దగా తెరపై కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే హైలైట్ అయిన 'లావణ్య - రాజ్ తరుణ్' కేసుతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. అలా చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచిన అతడికి బిగ్ బాస్ టీమ్ ఛాన్స్ ఇచ్చింది. అంతేకాదు, మంచి రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.


Click it and Unblock the Notifications











