ఇండస్ట్రీలో మరో కలకలం.. కమిటీ కుర్రాళ్ళు నటుడు అరెస్టు..

గత కొన్నాళ్లగా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువవుతున్నాయి. అందులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, యూట్యూబర్ హర్ష సాయి, మరో నటుడు శ్రీ తేజ్ వంటి సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో యూట్యూబ్ చేరారు. ఇంతకీ ఆ యూట్యూబర్ ఎవరు? అతనిపై నమోదైన కేసు ఏంటి ? వివరాల్లోకెళ్తే..

ఆ యూట్యూబర్ ఎవరో కాదు, కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ నటుడు ప్రసాద్ బెహరా. యూట్యూబ్ లో 'మావిడాకులు', 'పెళ్లివారమండి' వంటి వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఫేమ్ తోనే కమిటీ కుర్రాళ్ళు సినిమాలో నటించే అవకాశం సంపాదించుకున్నాడు. తన అద్భుతమైన నటనతో రాణించే యత్నం చేస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ 'బచ్చలమల్లి' అనే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కూడా నటించారు. ప్రసాద్ బెహరా యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన కామెడీ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశమందుకుంటున్న బెహరాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Tollywood Actor Committee Kurrollu movie fame and Youtuber Prasad Behara arrested by Police on harassment case

అసలేం జరిగిందంటే.. ప్రసాద్ బెహరా తన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటితో అసభ్యకరంగా వ్యవహరించాడు. ఈ సమయంలో ఆ అమ్మాయి గట్టిగా వారించడంతో అందరి ముందు సారీ చెప్పాడు. దీంతో వ్యవహరం అక్కడితో ముగిసిందట. తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్ లో మళ్లీ అతనితో నటించడం మొదలుపెట్టిందట. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో మరోసారి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం, కావాలని తనని టచ్ చేయడం వంటి ప్రయత్నాలు చేశాడని బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలో బాధిత యువతి జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

దీంతో ప్రసాద్ బెహరా పై లైంగిక ఆరోపణల కేసు నమోదయింది. గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని షూటింగ్ సమయంలో పలుమార్లు అసభ్యకరంగా తాకడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ప్రసాద్ బెహరా పై 75(2), 79, 351(2)BNS, సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ప్రసాద్ బెహరాను కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X