46 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన గుప్పెడంత మనసు నటుడు.. కోయిలమ్మ నటితో ఎంగేజ్మెంట్ ..

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమలు, పెళ్లిలు కామన్. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ చాలా విచిత్రంగా ఉంటాయి. సెలబ్రెటీలు ఎవరు.. ఎప్పుడు? పెళ్లి చేసుకుంటారో ? ఎప్పుడూ ఏ జంట తమ బంధాన్ని తెంచుకుంటారో చెప్పడం చాలా కష్టం. కొందమంది తన కెరీర్ మీద ఫోకస్ పెడుతూ.. ఐదు పదుల వయసు దగ్గరకు వచ్చిన పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో, బుల్లితెర నటుడు 46 ఏండ్ల వయస్సులో రెండో పెళ్లికి సిద్దమయ్యారు. తాజాగా మరో బుల్లి తెర హీరోయిన్ ను నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ నటీనటులు ఎవరో? ఓ లూక్కేయండి.

ఆ నటుడు ఎవరో కాదు.. నాటి టాలీవుడ్ హీరో, నేటీ బుల్లితెర నటుడు సాయి కిరణ్.. నువ్వే కావాలి సినిమాతో హీరోగా టాలీవుడ్
అడుగుపెట్టారు సాయి కిరణ్. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టాడు. ప్రేమించు, మనసుంటే చాలు, ఎంత బావుందో వంటి హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత ఈ తరుణంలో జగపతి, షిరిడి సాయి, నక్షత్రం, గోపి గోడమీద పిల్లి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. తను ప్రముఖ సింగర్ పి.సుశీల గారి మనవడు అనే విషయం చాలా మందికి తెలియదు.

Tollywood actor Guppedantha Manasu fame Sai Kiran got engaged with Koilamma serial actress Sravanti

వెండితెరపై సక్సెస్ కాలేకపోయాడు సాయి కిరణ్. దీంతో బుల్లితెరపై అడుగుపెట్టారు. తొలుత కోయిలమ్మ అనే సీరియల్ లో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు సీరియల్ తో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్ర పాత్రలతో బాగా పాపులర్ అయ్యాడు నటుడు సాయి కిరణ్. ఇందులో హీరో రిషి(Rishi)కి తండ్రిగా తన అద్భుత నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిరీయల్ తో బిజీబిజీగా ఉండే.. ఈ నటుడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు.

Tollywood actor Guppedantha Manasu fame Sai Kiran got engaged with Koilamma serial actress Sravanti

తాజాగా.. సాయి కిరణ్ పెళ్లికి సిద్దమయ్యారు. తాజాగా ఎంగే‌జ్‌మెంట్ చేసుకుని అభిమానులకు షాకిచ్చాడు. ఆ అమ్మయి ఎవరో కాదు.
కోయిలమ్మ సీరియల్‌లో నటించిన స్రవంతి(sravanthi)తో సాయికిరణ్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను కూడా నెట్టింట్లో షేర్ చేశారు. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్ షాక్ అవుతున్నారు.
కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఇంత వరకు సాయి కిరణ్ పెళ్లి కాలేదా? అయ్యో ఇన్ని రోజులు సింగిల్ గా ఉన్నాడా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సాయికిరణ్ స్రవంతిలు మూడుల బంధంతో త్వరలో ఒక్కటి కాబోతున్నారన్నమాట.

More from Filmibeat

Read more about: sai kiran guppedantha manasu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X