‘సమ్మర్ లో అది ఎక్కువైంది.. తగ్గించుకోవాలి’.. మంట పెట్టేసిన అనసూయ
తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా కొన్నాళ్ల పాటు ఊపూపింది అనసూయ భరద్వాజ్. బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఏకంగా 10 ఏళ్ల పాటు అలరించింది. ఆ తర్వాత సినిమాలకు ఎంట్రీగా ఇచ్చి నటిగానూ వెండితెరపై మెరుస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తన అభిమానుతో పాటు ఆడియెన్స్ కు మరింతగా ఆకట్టుకుంటోంది. భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఇంట్రెస్టింగ్ సూచనలు చేస్తోంది.
అనసూయ భరద్వాజ్ కెరీయర్..
అనసూయ భరద్వాజ్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ఎంబీఏ చదువుకున్న అనసూయ కొన్నాళ్ల పాటు హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ గానూ ఉద్యోగం చేసింది. అంతే ప్రముఖ ఛానెల్ లో న్యూస్ రీడర్ గానూ వర్ చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్ లో యాంకర్ గా చేరి టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. అలాగే వేదం, పైసా వంటి చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ గానూ వర్క్ చేసింది. ఇక 2012లో ప్రారంభమైన తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గా ఎంపికై తన టాలెంట్ తో టెలివిజన్ రంగంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందింది.

అనసూయ తెలుగు సినిమాలు..
అనసూయ ఓవైపు యాంకర్ గా అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన, విన్నర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, చావు కబురు చల్లగా వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ఆడియెన్స్ అటెన్ష ను డ్రా చేసింది. ఇక క్షణం, రంగస్థలం, పుష్ప : ది రైజ్, రంగమార్తాండ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటిగానూ మెప్పించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి తన నటనకు మంచి ప్రశంసలను అందుకుంది. చివరిగా దర్జా, మైఖేల్, విమానం, పెద్ద కాపు 1, రాజాకార్, పుష్ప2 వంటి చిత్రాలతో అలరించింది.
అనసూయ ఫిట్ నెస్ గోల్..
వెండితెరపై విభిన్న పాత్రల్లో మెరుస్తూనే తన అభిమానుల కోసం సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది అనసూయ భరద్వాజ్. ఈ సందర్భంగా తన లేటెస్ట్ వర్క్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించేలా ఫొటోలనూ పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తను జడ్జీగా వ్యవహరిస్తున్న 'కిర్రాక్ బాయ్ ఖిలాడీ లేడీస్' సీజన్ 2 షోకు సంబంధించిన లేటెస్ట్ అవుట్ ఫిట్ ను రివీల్ చేసింది. స్కిన్ టైట్ వేర్ లో అనసూయ యంగ్ లుక్ తో కట్టి పడేసింది. అలాగే సమ్మర్ లో చాలా టూర్లకు వెళ్లడం వల్ల ఫిష్, పిజ్జా, బర్గర్ లాంటి ఆహార పదార్థాలు బాగా తిన్నామని, ఇక ఆ ఫ్యాట్ మొత్తం తగ్గించాలని కూడా చెప్పుకొచ్చింది. మరోవైపు అనసూయ తరుచూగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ నెటిజన్లకు హెల్త్, ఫిట్ నెస్ పైనా మోటీవేషన్ ను కలిగిస్తూ ఉంటుంది.
నెక్ట్స్ హరి హర వీరమల్లుతో..
అనసూయ భరద్వాజ్ నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రంతో అలరించబోతోంది. ఈ చిత్రంలో 'కొల్లగొట్టినాదిరో' అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ పాట లిరికల్ వీడియో కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇక అనసూయ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ అనసూయ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











