ఫరియా అబ్దుల్లాపై నోరు జారిన సుడిగాలి సుధీర్.. చెంపలు వాయించిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. తన తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఫరియా అబ్దుల్లా నటించిన డెబ్యూ ఫిల్మ్ జాతిరత్నాలు చిత్రం టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. దాంతో క్రేజీ హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై మెరుస్తోంది.
ఫరియా అబ్దుల్లా నటిగా అందరికీ పరిచయమే కానీ ఆమెలో హిడెన్ టాలెంట్స్ చాలానే ఉన్నాయి. ఆమె థియేటర్ ఆర్టిస్ట్. ప్లే డిజైనర్ కూడా. అలాగే ఆమె డ్యాన్స్ లో చాలా టాలెంట్ ను కలిగి ఉంది. ఇక సింగింగ్, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ ఆమె మంచి పట్టు ఉంది. సోషల్ మీడియాలో తరుచుగా తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. పలు డ్యాన్స్ కాంపిటీషన్స్, ఈవెంట్లలో సందడి చేస్తూ కనిపిస్తూ వస్తోంది. ఇక తాజాగా ఫరియా అబ్దుల్లా సుడిగాలి సుధీర్ షోకు హాజరైంది.

బుల్లితెర స్టార్, యాంకర్, నటుడు సుడిగాలి సుధీర్ కు టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోతో సెన్సేషన్ గా మారాడు. ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేశారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం వర్క్ చేస్తూనే మరోవైపు బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో బుల్లతెరపై సందడి చేస్తున్నారు. కాగా తాజాగా సరిగమప లిటిల్ ఛాంపియన్ సింగింగ్ కాంపిటీషన్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, సింగర్ ఎస్పీ శైలజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
కాగా తాజా ఎపిసోడ్ కు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గెస్ట్ గా హాజరైంది. ఈ సందర్బంగా ఫరియాకు సుడిగాలి సుధీర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. కానీ ఫరియా అబ్దుల్లా సుడిగాలి సుధీర్ ను లాగిపెట్టి చెంప మీద కొట్టింది. తన పేరుతో స్వాగతం చెప్పకుండా.. ఐశ్వర్య అంటూ పిలవడంతో ఆమె హార్ట్ అయి సుధీర్ చెంపపై కొట్టింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమెతోనూ సుడిగాలి సుధీర్ పులిహోరా కలిపిన విధానం ఆసక్తికరంగా మారింది.
ఇక సరిగమప లిటిల్ ఛాంప్స్ 4వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఫుల్ ఎపిసోడ్ శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అవుతోంది. ఇప్పటికే 3 ఎపిసోడ్స్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక ఫరియా అబ్దుల్లా నెక్ట్స్ అల్లరి నరేశ్ 61 చిత్రంలో నటిస్తోంది. చివరిగా మత్తు మదలరా 2లో నటించింది. మరోవైపు సుడిగాలి సుధీర్ గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం సుడిగాలి సుధీర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











