బిగ్‌బాస్ వల్లే నా జీవితం ఇలా.. ఆ రోజు నాగార్జునకు ఎదురు చెప్పలేక పోయా..

Actress Hema: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి హేమ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానీ, కమెడియన్‌గానీ ఎటువంటి పాత్రైనా ఆమె తనదైన శైలిలో మెప్పిస్తుంది. పలు చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ నటి, తెరపై ఎంత నేరుగా ఉంటుందో.. నిజజీవితంలో కూడా అలాగే మాట్లాడుతుంది. ఏ విషయాన్నైనా లెక్కచేయకుండా చెప్పేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి హేమ మరోసారి హెడ్లైన్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి కారణం సినిమా కాదు, రాజకీయాలు కాదు.. బిగ్ బాస్. ఈ రియాలిటీపై, నాగార్జనపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

నటి హేమ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె బిగ్ బాస్ అనుభవాల గురించి చాలా స్పష్టంగా, భావోద్వేగంగా మాట్లాడింది. హేమ చెప్పిన ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సమయంలో ఆమె మానసికంగా చాలా ఒత్తిడిలో ఉండేది. "అప్పుడు నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాను. ఎవరితోనూ మాట్లాడకూడదనిపించింది. నా దగ్గర మొబైల్ కూడా ఉండకూడదనుకున్నాను," అని ఆమె చెప్పింది. ఆ సమయంలో తనకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడం ఒక అవకాశం లాగా కనిపించిందట. ''బయటలో జీవితం నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. బయట ఎవరినీ ఎదుర్కోలేను. కనీసం రెండు వారాలైనా పూర్తిగా శాంతిగా ఉండాలి. ఎవరికీ కనపడకుండా, ఏ కాల్స్ లేకుండా ఉండాలనుకుంటున్నాను'' అని ఆమె తాను ఆలోచించిన విధానాన్ని వివరించింది. ఆ సమయం బిగ్ బాస్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.

Tollywood Actress Hema on Bigg Boss Depression Respect for Nagarjuna and the Life-Changing

అయితే.. ఆ సమయంలో ఆమె స్నేహితురాలు సురేఖ బిగ్‌బాస్ వెళ్లొద్దని హెచ్చరించిందట. "బిగ్ బాస్‌లోకి వెళ్లిన వాళ్లంతా చెడ్డ పేరుతో బయటకు వస్తారు. మంచి పేరుతో ఎవరూ బయటకు రావడం లేదు'' అని సురేఖ అడ్డుకోవడానికి ప్రయత్నించినట్టు హేమ తెలిపింది. అయితే హేమ మాత్రం తాను శాంతిగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ, "బిగ్ బాస్ నా కోసం రిలీఫ్ లాంటిదే. బయట ప్రపంచం నుంచి ఓ బ్రేక్ కావాలి'' అని నిర్ణయించుకుందట.

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెకు వచ్చిన పెద్ద మార్పు, తనకు లభించిన గౌరవం. "బిగ్ బాస్‌లోకి వెళ్లేముందు అందరూ నన్ను ఆంటీ అని పిలిచేవారు. కానీ అక్కడ 'హేమక్క, హేమ అక్క' అని పిలిచినప్పుడు నాకు అది పెద్ద బిరుదుగా అనిపించింది'' అని హేమ గుర్తుచేసుకుంది. ఆ సీజన్‌లో రాహుల్, రోహిణి తనకు దగ్గరయ్యారని కూడా వెల్లడించింది. "ఆ ఇద్దరితో ఏర్పడిన బంధం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగింది" అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ తరువాత ఇంట్లోనుండి బయటకు రావడం, మళ్లీ పార్టీల్లో కలవడం, మనుషులతో మాట్లాడటం మొదలయింది.

"బిగ్ బాస్ నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. నేను మళ్లీ జీవించడం ఎలా అనేది నేర్చుకున్నాను'' అంటూ హేమ భావోద్వేగంతో చెప్పింది. హౌస్‌లో ఉన్న సమయంలో హేమ చేసిన ప్రధాన బాధ్యతల్లో ఒకటి ఫుడ్ మేనేజ్‌మెంట్. ఆమె బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ గెస్ట్‌గా హౌస్‌లో ప్రవేశించినప్పుడు జరిగిన సంఘటనను ఆమె ప్రత్యేకంగా వివరించింది. "నన్ను చూసి రాహుల్ నా పాదాలకు దండం పెట్టాడు. 'అక్కా... మీరు ఉన్నంతకాలం ఎవరికి అన్నం గురించి గొడవలే రాలేదు. మీరు అందరికీ తిండి పెట్టారు' అని అన్నాడు.' ఇది తనకు లభించిన అత్యంత పెద్ద గౌరవమని హేమ పేర్కొంది. ఒక తల్లి, చెల్లెలు, ఇల్లాలు ఎలా అందరికీ తినిపించాలో తెలుసుకుంటుందనే తన మాటలను ఆమె ఘాటుగా చెప్పింది. "ఎవరికి ఎంత వడ్డించాలో, ఎంత బియ్యం లో ఎంత మందికి భోజనం చేయించాలో నాకు బాగా తెలుసు'' అని చెప్పింది.

ఇంటర్వ్యూలో హేమ తనకు ఉన్న నాగార్జునపై గౌరవం గురించి చెబుతూ.. "నా డ్రీమ్ బాయ్ నాగార్జున గారు. నా డార్లింగ్, స్వీట్‌హార్ట్. అందుకే ఆయనకు ఎదురు చెప్పలేకపోయాను'అని అంగీకరించింది. తనను హోస్ట్‌గా నాగార్జున ప్రశ్నించినప్పుడు కూడా ఆయన మాటలకు ఎదురు నిలబడలేకపోయానని, కానీ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లు అలా కాదు..నాగార్జున గారితోనే పోటీపడుతూ మాట్లాడిస్తున్నారనీ,తాను నాగార్జున గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తానని ఆమె తెలిపింది. "ఆయనపై నా గౌరవం అంత ఎక్కువ. నేను నాగార్జున గారికి అభిమాని కూడా'' అని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో తన మాటలు అర్థం చేసుకుంటారని భావించినప్పటికీ, ఆ రోజు తన అభిప్రాయం మిస్ ఫైర్ అయ్యిందని హేమ గుర్తుచేసుకుంది.

ఈ విషయాన్ని ఫినాలే రోజు.. మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ ఫినాలేలో మాట్లాడినట్లు హేమ వెల్లడించింది. బిగ్ బాస్‌లో పాల్గొనడం తనకు ఒక రీసెట్ బటన్ వంటిదని, జీవితాన్ని మళ్లీ ప్రారంభించే ధైర్యం ఇచ్చిందని ఆమె స్పష్టంగా చెప్పింది. ప్రారంభంలో వచ్చిన ఒత్తిడులు, ఆందోళనలు ఎట్టకేలకు తీరిపోవడానికి కారణం ఆ రియాలిటీ షోనే అని ఆమె భావోద్వేగంతో వివరించింది. "బిగ్ బాస్ నాకు పేరు కాదు... జీవితాన్ని ఇచ్చింది" అనే ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X