Rave Party హేమ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్టులు..సుద్దపూసనంటూ మారు పేరుతో తప్పుదోవ పట్టించేలా!

బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన సినీనటి హేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు.. దొరికింది తాను కాదు అని కవర్ చేసేందుకు హేమ కిందా మీద పడింది. కానీ బ్లడ్ టెస్టులో అడ్డంగా దొరికిపోయింది. ఇక చేసేదేం లేక సైలెంట్ అయిపోయింది. కానీ ఓ సెలబ్రెటీగా ప్రజలకు చెప్పాల్సిందిపోయి.. డ్రగ్స్ సేవించడమే కాకుండా కట్టుకథలు చెప్పి పోలీసులను , సమాజాన్ని తప్పుదోవ పట్టించడం అన్నింటికన్నా పెద్ద నేరం.

క్రైమ్ స్టోరీని తలపించేలా సాగిన హేమ బాగోతంపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. రేవ్ పార్టీలో హేమ దొరికిందని బెంగళూరు పోలీసులు చెబుతుంటే.. కాకపోతే అక్కడ హేమ అనే పేరు లేకపోవడమే అసలు ట్విస్ట్. హేమ పార్టీకి హాజరైంది, డ్రగ్స్ కూడా తీసుకుంది. కానీ తన పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడింది. అంతాబాగానే కవర్ చేసినా పోలీసుల ముందు ఆటలు సాగవు కదా. తన అసలు పేరు కృష్ణవేణి.. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లోనూ అదే పేరు ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. దీని సాయంతోనే హేమ పార్టీకి హాజరైందట.

tollywood actress hema plays drama at bangalore rave party drug bust

పార్టీకి వెళ్లినా అక్కడి వాళ్లు తనను గుర్తుపట్టరని హేమ భ్రమపడింది. కానీ దాడి జరిగిన తక్షణం బెంగళూరు పోలీసులు, కన్నడ మీడియా ప్రతినిధులు హేమను గుర్తుపట్టారు.. ఆమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా వారికి తెలుసు. వెంటనే వారు కథనాలు ప్రసారం చేయడం.. తెలుగు మీడియాకు కూడా సమాచారం అందడంతో హేమ సదరు పార్టీలో దొరికినట్లుగా వార్తలు ప్రసారమయ్యాయి. విషయం తెలుసుకున్న హేమ.. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు ఎత్తులు వేసింది. ఒకసారి తన పేరు హేమ అని, కాదు కాదు కృష్ణవేణి అని చెప్పిందట.. అడ్రస్ విషయంలోనూ అంతే చేసిందట. హైదరాబాద్‌లో ఉంటానని ఒకసార.. బెంగళూరు లోకల్ అని మరోసారి ఇలా పోలీసులనే కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిందట.

కుటుంబ సభ్యులకు విషయం చెప్పమని పోలీసులు అనుమతిస్తే.. చెట్ల చాటుకు వెళ్లి తాను బెంగళూరు వెళ్లలేదని హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నట్లు కాకమ్మ కథలు చెప్పింది. అయితే హేమ బెంగళూరుకు వెళ్లిందనడానికి, డ్రగ్స్ తీసుకుంది అనడానికి పాజిటివ్ రిపోర్టు ఇలా ఆధారాలు పక్కాగా ఉండటంతో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఈ నెల 18న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌస్‌లో '' సన్‌సెట్ టూ సన్‌రైజ్ విక్టరీ '' పేరుతో బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ నిర్వహించారు.

దీనికి రూ.2 లక్షలు ఎంట్రీ ఫీజు. 200 మందికి పైగా హాజరయ్యారు.. వీరిలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకు చెందిన బుల్లితెర నటులు, క్రికెట్ బుకీలు, మోడల్స్ తదితరులు పాల్గొన్నారు. వారిలో 130 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా.. 86 మందికి పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన వారికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు. ఈ రేవ్ పార్టీని హెబ్బగుడి పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారిస్తున్నారు. రేవ్ పార్టీని నిర్వహించిన నిందితుల్లో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్ కుమార్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ ఏ5గా మొహమ్మద్ అబూ బకర్, ఏ6గా గోపాల్ రెడ్డి, ఏ7 60 మంది యువకులు, ఏ8గా 30 మంది యువతులను చేర్చారు.

tollywood actress hema plays drama at bangalore rave party drug bust

ఇక రేవ్ పార్టీని నిర్వహించిన లంకపల్లి వాసుది పుష్ప రేంజ్ స్టోరీగా చెబుతున్నారు. కూలీకి వెళ్తే కానీ పూట గడవని కుటుంబానికి చెందిన వాసు ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. విజయవాడలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది పేద కుటుంబం తండ్రి చనిపోగా.. తల్లి దోశలు వేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. వాసుకు ఇద్దరు అక్కలు , అన్నయ్య ఉన్నారు. క్రికెట్ బుకీగా మారిన వాసు.. హాకీ , కబడ్డీ సహా అన్ని రకాల క్రీడల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో తన నెట్‌వర్క్ విస్తరించాడు. అతని కోసం పనులు చేసిపెట్టేందుకు ఒక్క విజయవాడలోనే 150 మంది సిబ్బంది ఉన్నారట.

పబ్ వ్యాపారంలోకి దిగిన వాసుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు విజయవాడలోనే నివసిస్తున్నారు. అతను మాత్రం నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే సొంతూరికి వెళ్తుంటాడు. ఎవరైనా అడిగితే ఫారిన్‌లో జాబు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవాడట. వాసుకి రూ.కోట్లు విలువైన నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో విల్లాలు, ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ముంబైలో ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని తన బెట్టింగ్ నెట్‌వర్క్‌ను రన్ చేస్తున్నాడు. ఇక రేవ్ పార్టీ కేసులో పోలీస్ శాఖకు చెందిన సిబ్బందిపైనా వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెబ్బగొడి పీఎస్‌కు చెందిన ముగ్గురిని సస్పెండ్ చేయగా.. మరో ఇద్దరికి మెమోలు జారీ చేశారు. వీరికి రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ వేటు పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X