Suma Kanakala : అట్లుంటది సుమక్కతోని.. దెబ్బకి దండం పెట్టేశాడుగా

తెలుగునాట యాంకర్ అనే పదానికి పర్యాయపదంగా మారారు సుమ కనకాల . చలాకీతనం, మాటలతో బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న సుమ యాంకరింగ్‌లో తనదైన మార్క్ చూపిస్తూ సెలబ్రెటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు, ఈవెంట్స్, షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సుమ ... కుటుంబానికి కూడా అంతే విలువ ఇస్తారు . ఇక సోషల్ మీడియాలోనూ అంతే యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఈ స్టార్ యాంకర్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో స్థిరపడింది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న సుమ.. చిన్న వయసులోనే పలు ప్రదర్శనలు ఇచ్చారు. తొలుత కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ, పవిత్ర ప్రేమ తదితర సినిమాల్లో నటించారు.

Tollywood Anchor suma kanakala Shares her funny workout video

సినిమాలు తనకు సెట్ కావని ముందే గ్రహించిన సుమ.. టెలివిజన్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. తెలుగులోని అన్ని ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్‌లో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన సుమ దాదాపు 25 ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా రాణిస్తున్నారు. ఆడియో లాంచ్‌లు, శత దినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలతో మొదలుపెట్టి నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్‌మీట్‌లు, టీజర్, ట్రైలర్ లాంచ్‌లు ఇలా ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా సుమ ఉండాల్సిందే. వీటికి తోడు ఇంటర్వ్యూలు, టీవీలలో పలు షోలతో ఆమె బిజీ బిజీగా ఉంటున్నారు.

దేవదాస్ కనకాల కుమారుడు, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, మలయాళ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, పండుగలను సుమ తన ఇంట్లో ఫాలో అవుతారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ ఎప్పటికప్పుడు తన షోలు, ప్రోగ్రామ్స్ ఇతర కార్యక్రమాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని మహాబలేశ్వరం సమీపంలో ఉన్న ఓ స్ట్రాబెర్రీ తోటకు వెళ్లి సందడి చేశారు. తాజాగా తన వర్కవుట్ తాలుకా వీడియోను పోస్ట్ చేసి నవ్వులు పూయించారు.

రోప్స్‌తో చేసే వర్కవుట్ చేసిన సుమ.. తన జిమ్ ట్రైనర్‌ను ఓ ఆట ఆడుకున్నారు. తనకు తెలియడం లేదని , ఓసారి చేసి చూపించమంటూ ఆయనతోనే వర్కవుట్స్ చేయించింది. జిమ్ ట్రైనర్ ఫాస్ట్‌గా వర్కవుట్ చేస్తుండగా ఆమె నెంబర్స్ లెక్క పెట్టింది. ట్రైనర్ చేసి చేసి అలిసిపోతూ మేడమ్ జిమ్ మీకా, నాకా అంటూ దండలు పెట్టి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అట్లుంటది సుమక్కతోని అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అన్నట్లు ఆ జిమ్ ట్రైనర్ పేరు అజ్జు అని సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X