Suma Kanakala : యాంకర్ సుమ కక్కుర్తి పనులు.. దారుణంగా నెటిజన్ల కామెంట్స్
తెలుగు నాట యాంకర్ అనే పదానికి పర్యాయ పదంలా మారారు స్టార్ యాంకర్ సుమ కనకాల. కేరళ అమ్మాయే అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ జోష్ నింపుతారు సుమ. టాలీవుడ్‌లో ఏ సినిమా ఈవెంట్ అయినా, ఇంటర్వ్యూ అయినా సుమ లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. యాంకరింగ్‌తోనూ స్టార్ డమ్ సంపాదించిన అతికొద్ది మందిలో సుమ కనకాల కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లాస్సన పాచువెట్టిల్ విమల. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో స్థిరపడింది. స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్, రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు సుమ.

క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న సుమ.. చిన్న వయసులోనే పలు ప్రదర్శనలు ఇచ్చారు. హోస్టింగ్ కంటే ముందు కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ తదితర సినిమాల్లో నటించారు. పవిత్ర ప్రేమలో నటసింహం నందమూరి బాలకృష్ణ చెల్లెలిగా కనిపించి అలరించారు . సినిమాలలో తాను రాణించలేనని ముందే గ్రహించిన సుమ.. బుల్లితెరపై ఫోకస్ పెట్టారు. అయితే అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
దేవదాస్ కనకాల కుమారుడు, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రెటీ అన్నాక పుకార్లు సహజం.. సుమపైనా ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల సుమ వందల కోట్ల ఖర్చుతో కేరళలో విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సుమ .. రేయ్ ఎవర్రా మీరంతా, నేను ఏమైనా అంబానీ ఫ్యామిలీ అనుకున్నావా అంటూ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ ఎప్పటికప్పుడు తన షోలు, ప్రోగ్రామ్స్ ఇతర కార్యక్రమాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. స్టార్స్‌కు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని మహాబలేశ్వరం సమీపంలో ఉన్న ఓ స్ట్రాబెర్రీ తోటకు వెళ్లిన సుమ పంటని చూపించారు. తాను ఇప్పటి వరకు స్ట్రాబెర్రీ ఫామ్‌ని చూడలేదని వాటిని కోసి రుచిచూశారు. కడిగిన తర్వాత తినాలని కానీ మనకి కక్కుర్తి కాబట్టి తుడుచుకుని తినేస్తానని సుమ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సుమపై ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











