యాంకర్ ఝాన్సీ ఇంట్లో విషాదం.. కన్నీరు పెట్టించే విధంగా పోస్ట్!!
కరోనా మహమ్మారి ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా దాని ఆకలి తీరనేలేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణించే వారు మరణిస్తూనే ఉన్నారు. ఎంతో మందిని తీసుకెళ్లిన కరోనా తాజాగా యాంకర్ ఝాన్సీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఝాన్సీ పిన్ని కరోనాతో చనిపోయింది. ఈ మేరకు ఝాన్సీ కన్నీరుమున్నీరైంది. సోషల్ మీడియాలో తన పిన్ని గురించి చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

తొందరగా ముక్తి..
ఆమె ప్రతీ సమస్యను ఎంతో ధైర్యంగా ప్రేమగా ఎదుర్కొన్నారు. నిత్యం నవ్వుతూనే ఉంటూ సంతోషాన్ని పంచుతూ ఉండేవారు. ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడిపి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అలసితి , సొలసితి అని అంతర్యామిని వేడుకొన్నారు... అందుదుకే స్వామి తొందరగా ముక్తి ప్రసాదించారు అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

ఎందరినో అక్కున..
మా చిన్న పిన్న నాకు ఓ స్నేహితురాలిగా ఉండేవారు. ఎంతో సన్నిహితంగా చలాకీగా ఉండేవారు. ప్రేమించడమే ఆమెకు తెలిసిన మంత్రం. భవాని గురించి తెలిసిన వారందరికీ కలిసిన వారందరీ ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఎంతో మందిని అక్కున చేర్చుకున్నారు. ఎవరికైనా ఎలాంటి సాయం చేయడానికైనా సరే నిస్వార్థంగా ముందుకు వచ్చేవారు. అని ఝాన్సీ తెలిపింది.

అదే కారణం..
మా కుటుంబాకి ఆమె బలం...ప్రతీ హగ్గు, కిస్, నవ్వులో నువ్ ఉంటావు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. బోర్ కొట్టించినా సరే ఆమె హ్యూమర్ మాత్రం ఎన్నడూ పక్కకుజరగదు. ఇంతటి క్లిష్టమైన బాధాకరమైన సమయంలోనూ మేం నవ్వుతూ ఉంటున్నామంటే.. దానికి కారణం బబ్బా స్పిరిట్ అని చెప్పుకొచ్చింది.
Recommended Video

ఐ హేట్ కరోనా..
మా పిన్ని నిక్ నేమ్ బబ్బా.. మా పాప రెండేళ్ల వయసు ఉన్నప్పుడు భవాని అని పిలవడం రాక బబ్బా అని పిలిచేది.. అలా ఆమె పేరు బబ్బాగా మారిపోయింది. మేము కూడా బబ్బా అని పిలుస్తాం) ఎవరైతే ఇక్కడకు రాలేకపోతున్నారో.. వారికోసం చెబుతున్నా.. ఆమె అక్టోబర్ 4న కోవిడ్‌తో పోరాడి ఓడిపోయారు. ఐ హేట్ కరోనా అని ఝాన్సీ ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











