బిగ్‌బాస్‌లో ఎంట్రీకి సీనియర్ నటి విశ్వప్రయత్నాలు.. ఆంటీ జోష్ చూసి కంగుతింటున్న..

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎండమాల్ షైన్ ఇండియా నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనావైరస్ కారణంగా ఈ షో ప్రారంభానికి బ్రేకులు పడిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో చేరేందుకు పలువురు నటీనటులు ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. అయితే ఓ హాట్ నటి తన ప్రయత్నాలు వీరలెవల్లో చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ నటి ఎవరంటే..

బిగ్‌బాస్ తెలుగు 4పై క్రేజ్

బిగ్‌బాస్ తెలుగు 4పై క్రేజ్

తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొన్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు అటు ప్రేక్షకుల్లో, ఇటు సినీ తారల్లో అత్యంత క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొన్న నటీ, నటులు, టెలివిజన్, ఇతర సెలబ్రిటీలకు బ్రహ్మండమైన పాపులారిటీ లభించింది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొన్న కొందరు సెలబ్రిటీలు షోలో పాల్గొనేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. అలాగే నిర్వహకులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

చాలా మంది సెలబ్రిటీలు

చాలా మంది సెలబ్రిటీలు

ఇప్పటికే ఓ పలువురు ఓ రేంజ్ నటీనటులు, ఇతర సెలబ్రిటీలు బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు రకరకాలు ప్రయత్నిస్తున్నారు. నిర్వహకులను సంప్రదించి తమ కోరికను బయటపెడుతున్నారు. వీలైతే మమల్ని తీసుకోవాలని సూచిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అయింది. ఈ మేరకు బిగ్‌బాస్ నిర్వహకులతో భేషరతుగా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

విశ్వ ప్రయత్నాలు చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు

విశ్వ ప్రయత్నాలు చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు

ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, రకరకాల వేదికలపై హంగామా చేస్తున్న తల్లి, వదిన, తదితర పాత్రలు పోషించే ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాకుండా తన టాలెంట్‌ను బయటపెడుతూ వీడియోలు కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారట. తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను, తన వీడియోలకు వస్తున్న స్పందనను కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. ఇలా బిగ్‌బాస్‌ను ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది.

సెలబ్రిటీల జాబితా ఇదేనంటూ..

సెలబ్రిటీల జాబితా ఇదేనంటూ..

బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన సెలబ్రిటీల జాబితా ఇదే అంటూ మీ లిస్టు మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇందులో అల్లరి నరేష్, యాంకర్ ఝాన్సీ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, నటుడు నందు, తాగుబోతు రమేష్, సింగర్ మంగ్లీ తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయనేది తాజా సమాచారం. ఇంకా పలువురు సెలబ్రిటీలతో రెమ్యునరేషన్లు, తదితర అంశాలపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
జూలై చివరి వారంలో..

జూలై చివరి వారంలో..

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత బిగ్‌బాస్ సీజన్‌ను ప్రారంభానికి సంబంధించిన పనుల్లో వేగం పుంజుకొన్నట్టు సమాచారం. ఈ షోను జూలై చివరి వారంలో గానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూలై 26వ తేదీన గానీ, ఆగస్టు 2వ తేదీన గానీ ప్రారంభించాలనే ఆలోచనలలో ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X