Josh Ravi: ఎన్ని లక్షలు ఇచ్చినా జబర్దస్త్ షో మాత్రం చేయను.. ఎందుకంటే?

తెలుగు సినీ నటుడు, కమెడియన్ అయిన జోష్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అనేక సినిమాలు చేశారు. అదిరిపోయే క్యారెక్టర్లలో కనిపిస్తూ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముందగా జబర్దస్త్ షో ద్వారా కెరియర్ ప్రారంభించిన ఈయన ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం తాను అస్సలే జబర్దస్త్ షో చేయను అని తేల్చి చెప్పాడు. ఎన్ని లక్షలు ఇచ్చినా వెళ్లనని అన్నాడు. అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కమెడియన్ గా కెరియర్ ప్రారంభించిన జోష్ రవి.. ఆ తర్వాత నటుడిగా కూడా అనేక సినిమాలు చేశారు. ఆయన సినీ రంగంలోకి వచ్చి 15 ఏళ్ల అవుతుండగా.. వందకు పైగా సినిమాలు చేశాడు. అయితే ఇందులో గుర్తు పెట్టుకునేవి క్యారెక్టర్లు చాలా తక్కువే అయినా ఆయన టాలెంట్ ను అంతా గుర్తించారు. ముఖ్యంగా ఈయన గే క్యారెక్టర్లో కనిపించి అందిరనీ మెస్మరైజ్ చేశాడు. పిల్ల జమీందాన్, గుండ జారి గల్లంతయ్యిందే వంటి అనేక సినిమాలు చేసిన ఈయన ఆ తర్వాత మొత్తం అవే పాత్రలు చేయాల్సి వస్తుందని వాటిని లైట్ తీసుకున్నాడు.

Tollywood Comedian Josh Ravi Shocking Comments on Jabardasth Show Check Details

ప్రస్తుతం అన్న రకాల పాత్రలు చేస్తూ.. కెరియర్ లో ముందుకు వెళ్తున్న జోష్ రవి మొదట్లో జబర్దస్త్ షో చేసేవాడు. ఆయన ఇక్కేడ తన కెరియర్ ను ప్రారంభించారు. ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతోనే సినిమాల్లోకి వెళ్లాడు. అయితే తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఈయన తనకు కెరియర్ ఇచ్చిన జబర్దస్త్ షోను చేయనని తేల్చి చెప్పాడు. ముఖ్యంగా అక్కడ ఉండే వాళ్లపై అనేక కామెంట్లు చేశాడు. వాళ్లు డబ్బులు ఎలా సంపాధిస్తారో కూడా వివరించారు.

జబర్దస్త్ షోను కావాలనే తను వదులుకుని వచ్చానని.. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న తాను.. కేవలం సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు. ఎన్ని లక్షలు ఇచ్చినా.. ముఖ్యంగా లక్షా, రెండు లక్షలు ఇలా ఎంత ఇచ్చినా ఇప్పుడు తాను జబర్దస్త్ షో చేయనని వివరించాడు. తనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదని.. కానీ తనకు లైఫ్ ఇచ్చిన ఆ షోకు ఇప్పుడు వచ్చి పిలిచినా గెస్టుగా వెళ్తానని అన్నాడు. అలాగే స్టేజీ ఎక్కి స్కిట్లు చేయమన్నా చేస్తానన్నాడు. కానీ అదే కెరియర్ గా మాత్రం మలుచుకోని క్లారిటీ ఇచ్చాడు.

Tollywood Comedian Josh Ravi Shocking Comments on Jabardasth Show Check Details

అలాగే జబర్దస్త్ షో చేసే వాళ్లంతా అనేక దేశాల్లో తిరుగుతూ.. ఈవెంట్లు చేసుకోవడం వల్ల వాళ్లకు ఎక్కువగా డబ్బు వస్తుందని చెప్పాడు. సక్సెస్ వచ్చిన ఓ ఆర్టిస్ట్ కు అయినా అన్నం పెట్టేది ఈవెంట్లేనని కానీ.. తనకు మాత్రం ఈవెంట్లు చేసే ఇంట్రెస్ట్ లేదన్నాడు. తాను సినిమాలపై మాత్రమే ఫోకస్ చేశానని.. అవే చేసుకుంటూ జీవనం సాగిస్తానని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X