49 ఏళ్ల వయసులోనూ యమా గ్లామర్‌గా తెలుగు యాంకర్.. రెడ్ డ్రెస్‌లో చెర్రీలా!
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరను ఏలేస్తున్న యాంకర్ సుమ కనకాల గురించి తెలుగు సినీ ప్రియులు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన స్పాంటేనియస్ తో ఎవరినీ నొప్పించకుండా.. ఫుల్ కామెడీ చేస్తూ అందరికీ దగ్గరైంది. ఇప్పటికీ యాంకరింగ్ లో మహారాణిలా ఓ వెలుగు వెలుగుతున్న ఈమె తాజాగా అదిరిపోయే ఔట్ ఫిట్ ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. చెర్రీ పండులా ముస్తాబై ఈ ముద్దుగుమ్మ దిగిన ఫొటలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ సుమ కనకాల.. కెరియర్ ప్రారంభంలో సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాతే యాంకరింగ్ స్టార్ట్ చేసింది. ముఖ్యంగా తెలుగులోనూ యాంకర్ గా మారి అతి తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుంది. అలా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ.. అందరికీ దగ్గరైన ఈమె.. పూర్తిగా టీవీలకు పరిమితం అయిపోయింది. ఇటీవలే ఓ సినిమా కూడా చేసినా.. అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక ఫ్యూచర్ అంతా టీవీ షోలే చేయడం.. క్షణం తీరిక లేకుండా పని చేయడం కాస్త తగ్గించాలనుకున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

కేవలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు సుమ అడ్డ అనే షో మాత్రమే చేస్తోంది. అలాగే ఇంట్లోనే కూర్చుని వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ ను బాగా డెవలప్ చేస్తోంది. ఇలా కెరియర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్న ఈమె ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది.

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా అదిరిపోయే డ్రెస్ వేసుకుని అందాలు ఆరబోసింది. రెడ్ కలర్ లాంగ్ డ్రెస్ లో అందంగా ముస్తాబైంది. మెడలో వైట్ పూసల నెక్లెస్ వేసుకుని.. చెవికి రెడ్ కలర్ స్టోన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని స్టైల్ చేసింది. లైట్ గా మేకప్ వేసుకుని చెర్రీ పండులా మెరిసిపోతూ.. గింగిరాలు తిరిగేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











