Bigg Boss 8 Telugu: హౌస్‌లోకి టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్.. నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఇతడికే!
బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని సూపర్ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇండియాలో మొదట హిందీలో మొదలైన ఇది.. తెలుగులోకి మాత్రం ఎనిమిదేళ్ల క్రితమే వచ్చింది. కొత్త కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఈరోజే (సెప్టెంబర్ 1) ఎనిమిదో సీజన్ మొదలైంది. తాజాగా ఇందులోకి టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం పదండి మరి!
గ్రాండ్‌గా మొదలైన 8వ సీజన్
బిగ్ బాస్ షోకు తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వస్తోంది. దీంతో 8వ సీజన్‌పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దీనికి కూడా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తోంది.

అలాంటి కంటెస్టెంట్లకే ఛాన్స్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి చాలా రకాల ప్రచారాలు జరిగాయి. అయితే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా పరిచయం ఉన్న సెలెబ్రిటీలనే తీసుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో, సీరియళ్లలో చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే, సోషల్ మీడియా వాళ్లనూ తెచ్చారు.
షోలోకి ఎంటరైన హీరో ఆదిత్య
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్‌గానే సాగుతోంది. ఇందులోకి ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో ఆదిత్య ఓం వచ్చాడు. అతడికి అక్కినేని నాగార్జున గ్రాండ్ వెల్‌కం చెప్పి ఆహ్వానించాడు. అనంతరం వీళ్లిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు కూడా కనిపించాయి.
హీరో నుంచి డైరెక్టర్‌గా మారి
ఆదిత్య ఓం మోడలింగ్ రంగంలో చేస్తున్న సమయంలోనే 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో 'ధనలక్ష్మి ఐలవ్యూ', 'ప్రేమించుకున్నాం పెళ్లికి రండి', 'పున్నమి నాగు', 'మా అన్నయ్య బంగారం'తో పాటు ఎన్నో సినిమాల్లో నటించాడు. తర్వాత డైరెక్టర్‌గా మారి హిందీలో చాలా చిత్రాలను చేశాడు.
నందమూరి ఫ్యాన్స్ సపోర్టు
ఆదిత్య ఓం హీరోగా, డైరెక్టర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నా.. అతడి ఫస్ట్ సినిమా 'లాహిరి లాహిరి లాహిరిలో'తోనే గుర్తింపును బాగా అందుకున్నాడు. ఆ చిత్రంలో అతడు నందమూరి హరికృష్ణతో కలిసి నటించాడు. దీంతో ఇప్పుడు అతడికి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఉండే చాన్స్ ఉంది. దీనికితోడు ఆట కూడా బాగుంటే ఆదిత్యం ఓం చాలా రోజులు షోలో ఉంటాడని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











