Bigg Boss Telugu 8: మరో ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లు లీక్.. జబర్ధస్త్ నుంచి కన్ఫార్మ్ అయిందే వీళ్లే!

బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ ఈ మధ్య కాలంలో కొన్ని రకాల షోలు వచ్చాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సత్తా చాటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఎన్ని భాషల్లో వస్తున్నా తెలుగులో మాత్రం సంచలనం అయిన ఇది.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు షో నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి. ఆ వివరాలను మీరే చూడండి!

ఇండియాలో సంచలనం
బిగ్ బ్రదర్ అనే షో ఆధారంగా బిగ్ బాస్ షో ఇండియాలో ప్రారంభం అయింది. అలా ఇక్కడ చాలా భాషల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తెలుగులో కూడా పరిచయం అయింది. అయితే, ఎక్కడా కనిపించని విధంగా మన దగ్గర మాత్రం ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. అందుకే దీనికి రికార్డు స్థాయిలో రేటింగ్ లభించింది. ఇలా ఇండియాలో ఇది సెన్సేషన్ అయింది.

Tollywood Hero Jabardasth Pavitra and Potti Naresh Likely Entry To Bigg Boss Telugu 8 Show

8వ సీజన్ వచ్చేస్తుందిగా

ఆరంభం నుంచీ సక్సెస్ అవుతున్నా.. బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అయిపోయింది. దీంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్టుతో తీసుకొచ్చారు. దీంతో ఇది రికార్డు స్థాయిలో స్పందనను అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మరో కొత్త కాన్సెప్టుతో తీసుకు వస్తున్నారు. ఇందులో ఇన్ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అంతులేని వినోదాన్ని పంచుతారట.

ఆరోజు నుంచే.. ప్రోమోస్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరూ ఊహించని కాన్సెప్టుతో తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అలాగే, లోగోతో పాటు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి.

కంటెస్టెంట్ల పేర్లు కూడా

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక అనేది ఎప్పుడో ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చాలా మందిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లోకి ఇంద్రనీల్, నటి సన, బంచిక్ బబ్లూ, తేజస్విని గౌడ, అంజలి పవన్, అనిల్ గీలా, రీతూ చౌదరి, యాంకర్ వింద్యా, గాయత్రి గుప్తాలు ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది.

Tollywood Hero Jabardasth Pavitra and Potti Naresh Likely Entry To Bigg Boss Telugu 8 Show

జబర్ధస్త్ నుంచి ఇద్దరు
భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల గోప్యంగా ఉంచుతున్నప్పటికీ వివరాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది పేర్లు లీకయ్యాయి. ఈ నేపథ్యంలో ఇందులో జబర్ధస్త్ నుంచి ఈసారి ఇద్దరు కంటెస్టెంట్లుగా రాబోతున్నారని తెలిసింది. వాళ్లే పవిత్ర, నరేష్ అని సమాచారం.

ఇంటర్వ్యూలు కూడా

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొనేందుకు నిర్వహకులు ఇప్పటికే పొట్టి నరేష్, పవిత్రతో సంప్రదింపులు జరపగా.. వాళ్లు ఓకే చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు, ఇటీవలే వీళ్లిద్దరి ఫైనల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. అంటే.. ఈ సారి జబర్ధస్త్ షో నుంచి ఈ ఇద్దరు బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టడం కన్ఫార్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X