బిగ్ బాస్‌లోకి చిరంజీవి ఫ్రెండ్.. ఈ సీజన్‌లో మెగా సపోర్ట్ అతడికే!
బుల్లితెరపైకి ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకున్న ఏకైక షో బిగ్ బాస్. కొందరిని ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లకు టాస్కులు ఇచ్చి.. ఆడియెన్స్ ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించే కాన్సెప్టుతో ఇది నడుస్తుంది. ఇందులో జనరంజకమైన కంటెంట్ ఉండడంతో రెస్పాన్స్ బాగా వస్తోంది. అందుకే వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే ఎనిమిదో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే ఓ కంటెస్టెంట్ పేరు లీకైంది. ఆ సంగతులు మీరే చూసేయండి!
రేటింగ్‌తో సంచలనం
బిగ్ బాస్ షో ఇండియాలో ఎప్పుడో మొదలైంది. కానీ, తెలుగులో మాత్రం ఎనిమిదేళ్ల క్రితమే వచ్చింది. ఎన్నో అనుమానాల నడుమ ప్రసారం అయిన ఈ కార్యక్రమానికి ఆడియెన్స్ ఊహించని రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ సక్సెస్ అయింది. అలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను రికార్డు రేటింగ్‌తో పూర్తి చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది.

8వ సీజన్ వచ్చేస్తుంది
బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అయిపోయింది. దీంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. దీంతో ఇది రికార్డు స్పందనను అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మరో కొత్త కాన్సెప్టుతో తీసుకు రావాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను సైతం బిగ్ బాస్ టీమ్ విడుదల చేసేసింది.
ఎప్పుడు వస్తుందంటే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరూ ఊహించని కాన్సెప్టుతో తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ సీజన్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నారని ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారు.
ఈ సారి అన్నీ కొత్తగా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక అనేది ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో పాల్గొనే సెలెబ్రిటీలపై నిర్వహకులు స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కంటే మరింత పేరున్న కంటెస్టెంట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అందులోనూ కాంట్రవర్శీల్లో భాగం అయిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో కొత్త టాస్కులు ఆడించబోతున్నారని టాక్.

షోలోకి చిరు ఫ్రెండ్
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది పేర్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇందులో అప్పటి క్రేజీ హీరో రోహిత్ (జానకీ వెడ్స్ శ్రీరామ్ ఫేం) కూడా పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిర్వహకులతో అతడి డీల్ కూడా సెట్ అయిందట.
మెగా సపోర్ట్ అతడికే
రోహిత్ గతంలో తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. అలాగే, 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' సినిమాలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అతడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే.. మెగా అభిమానులు మొత్తం అతడికే సపోర్ట్ చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రోహిత్‌కు షోలో చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











