Bigg Boss 7 Telugu: హౌస్‌లోకి కాంట్రవర్శీ హీరో.. ఆ పార్టీల ఫుల్ సపోర్టు.. అదే జరిగితే టైటిల్ ఖాయం

తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును అందుకుని సూపర్ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా హిందీలో ఎప్పుడో మొదలైన ఇది.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే వచ్చింది. కొత్త కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఈరోజే (సెప్టెంబర్ 3) ఏడో సీజన్‌ మొదలైంది. తాజాగా ఇందులోకి టాలీవుడ్ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం పదండి!

గ్రాండ్‌గా మొదలైన 7వ సీజన్:తెలుగులో బిగ్ బాస్ షోకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వస్తోంది. దీంతో ఏడో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దీనికి కూడా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతోంది.

Tollywood Hero Sivaji Entered into Bigg Boss Telugu Season 7

అలాంటి కంటెస్టెంట్లకే ఛాన్స్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి చాలా రకాల ప్రచారాలు జరిగాయి. అయితే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా పరిచయం ఉన్న సెలెబ్రిటీలనే తీసుకు వచ్చారు. అందులోనూ ఎక్కువగా కాంట్రవర్శీలతో సంబంధం ఉన్న ప్రముఖులకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఈ సీజన్ ఎంతో ఆసక్తిగా మారింది.

Tollywood Hero Sivaji Entered into Bigg Boss Telugu Season 7

షోలోకి ఎంటరైన హీరో శివాజీ:బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్‌గానే సాగుతోంది. ఇందులోకి ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ వచ్చాడు. అతడికి అక్కినేని నాగార్జున గ్రాండ్ వెల్‌కం చెప్పి ఆహ్వానించాడు. అనంతరం వీళ్లిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు కూడా జరిగాయి.

ఆర్టిస్టు నుంచి హీరోగా మారి:శివాజి ముందుగా 'మాస్టర్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు. ఈ క్రమంలోనే హీరోగానూ మారి చాలా సినిమాల్లో నటించాడు. అందులో 'అమ్మాయి బాగుంది', 'మిస్సమ్మ', 'అదిరిందయ్య చంద్రం', 'మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి' వంటి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.

Tollywood Hero Sivaji Entered into Bigg Boss Telugu Season 7

రాజకీయాల్లోకి.. వాళ్ల సపోర్టు:చాలా కాలం పాటు సినిమాల్లో సత్తా చాటని శివాజి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా 'అమరావతి' సమస్య, 'ఆపరేషన్ గరుడ' వంటి వాటితో ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే తెలుగుదేశం, జనసేన పార్టీలకు మద్దతుగా మాట్లాడాడు. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల కార్యకర్తల మద్దతును కూడగట్టుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడుతున్నాడు.

అదే జరిగితే టైటిల్ ఖాయం:హీరో శివాజికి రాజకీయ పరంగా కొన్ని వర్గాల వాళ్ల నుంచి ఫుల్ సపోర్టు ఉండబోతుంది. దీనికితోడు ప్రతి అంశాన్ని స్టడీ చేయగల మెచ్యూరిటీ కూడా ఉన్న వ్యక్తి కావడంతో ఈ షోలో అతడికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఈ రెండు అంశాల వల్ల హీరో శివాజి బిగ్ బాస్ హౌస్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా వస్తున్నాడు. అంచనాలను నిలబెట్టుకుంటే విజేతగా నిలిచే ఛాన్స్ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X