Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ కృష్ణ భగవాన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈయన తాజాగా పలువురి హీరోలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా హీరో, మాస్ మహారాజా రవితేజ, వైవీఎస్ చౌదరి, హీరో వేణులు.. గోడ దూకి తన ఇంట్లోకి వచ్చే వారని చెప్పుకొచ్చారు. తాను ఓసారి బాత్రూం నుంచి వస్తుండగా.. అలా చూసి ఓ పని చేశారట. దాని గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1988లో మహర్షి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కృష్ణ భగవాన్ ఆ తర్వాత మూడేళ్ల పాటు మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. 1991లో ఏప్రిల్ 1 విడుదల చేసి ఆ తర్వాత 12 ఏళ్లకు మళ్లీ సినిమాలు చేశారు. ముఖ్యంగా ఏడాదికి 6 నుంచి 10, 12 సినిమాల వరకు కూడా చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ నటుడిగా ఎదిగాడు. అయితే తాను కెరియర్ మొదట్లో అందరు హీరోలతో కలిసి రెంట్ కు ఉండేవాడినని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా హీరో రవితేజ, వైవీఎస్ చౌదరి, హీరో వేణు వాళ్లంతా ఒకే ఇంట్లో కలిసి ఉండేవారట. అయితే ఆ ఇంటి యజమానికి కుక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అని అనేక కుక్కలు పెంచేవాడట. దానికి ప్రతీ రోజూ తమను చూపించి ట్రైనింగ్ ఇచ్చే వారని.. ముఖ్యంగా సినిమా వాళ్లు కావడంతో రాత్రిళ్లు ఇంటికి ఆలస్యంగా వచ్చేవారని వివరించారు. అలా వచ్చిన ప్రతీ సారి గేట్లు, గోడలు దూకి ఇంట్లోకి వచ్చే వాళ్లం అని దీంతో ఆ కుక్కలకు తమను చూపించే ట్రైనింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
తానోసారి స్నానం చేసి బాత్రూం నుంచి వస్తుండగా.. చీకట్లో తనను చిన్న కుక్క పిల్ల అనుకుని.. రవితేజ పెద్ద కుక్కను పిలిచాడట. చిన్న కుక్కపిల్ల ఇక్కడ ఉందంటూ సైగ చేశాడని కృష్ణ భగవాన్ వెల్లడించారు. అయితే పక్కనే ఉన్న మరో జడ్డి ఇంద్రజ ఫుల్ గా నవ్వుతుండగా.. ఆమె నవ్వడం ఆపేస్తేనే తాను విషయం చెబుతానంటూ వివరించాడు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే మాత్రం కచ్చితంగా జబర్దస్త్ షో చూడాల్సిందే. తాజాగా విడుదల అయిన ప్రోమోలో కృష్ణ భగవాన్ ఈ కామెంట్లు చేశారు.
అయితే చలాకీ చంటి ఓ కుక్కకు సంబంధించిన స్కిట్ చేయగా.. తన మెమోరీస్ గుర్తుకు రాగా నటుడు కృష్ణ భగవాన్ ఈ స్టోరీ చెప్పుకొచ్చారు. మరి మీరు కూడా ఓసారి ఆ స్టోరీ ఏంటో ఏప్రిల్ 25వ తేదీ రోజు వచ్చే జబర్దస్త్ షోలో చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











