Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి ఎవర్‌గ్రీన్ హ్యాండ్సమ్ హీరో.. 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా!
టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. అసలు ఏమాత్రం పరిచయమే లేని కాన్సెప్టుతో వచ్చిన ఈ షోకు ఆడియెన్స్ ఊహించని రెస్పాన్స్‌ను అందించారు. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులోకి ఓ హ్యాండ్సమ్ హీరో వస్తున్నాడని తెలిసింది. ఆ విశేషాలను మీరే చూసేయండి మరి!
దేశంలోనే టాప్ షోగా
బిగ్ బ్రదర్ అనే షో ఆధారంగా వచ్చిందే బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ఎప్పుడో మొదలైన ఇది.. తెలుగులోకి లేటుగా వచ్చింది. దీనికి ఇక్కడ భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా నిర్వహకులు ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేశారు. వీటికి దేశంలోనే ఏ షోకూ రాని రేటింగ్ వచ్చింది. దీంతో తెలుగు బిగ్ బాస్ దేశంలోనే టాప్ షోగా మారిపోయింది.

8వ సీజన్ కలర్‌ఫుల్
కొత్త కాన్సెప్టుతో వచ్చినా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో బిగ్ బాస్ నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. అయితే, క్రమంగా ఇది ప్రభావాన్ని కోల్పోతోంది. ఈ పరిస్థితుల్లో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తెచ్చారు. దీంతో ఇది బిగ్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మరో కొత్త కాన్సెప్టుతో మరింత కలర్‌ఫుల్‌గా తీసుకు రాబోతున్నారు.
అప్పుడే... లోగోలోనే
బిగ్ బాస్ ఏడో సీజన్ రికార్డు రెస్పాన్స్‌తో ముగిసింది. దీంతో నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను మరింత హై రేంజ్‌లో తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన లోగోను కూడా రిలీజ్ చేశారు. అలాగే, సెట్ వర్క్, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలను కూడా ప్రారంభించారు. మొత్తానికి ఈ సీజన్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నారు.
కంటెస్టెంట్లపై ఫోకస్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియపై నిర్వహకులు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇందుకోసం కాస్త కాంట్రవర్శీ సెలెబ్రిటీల కోసం చూస్తున్నట్లు తెలిసింది. అలాగే, గ్లామరస్ అండ్ బోల్డ్ లేడీలతోనూ చర్చలు జరుపుతున్నారు. ఇలా కొందరిని ఇప్పటికే ఫైనల్ కూడా చేసేశారని టాక్.
షోలోకి అప్పటి హీరో
మరికొద్ది రోజుల్లోనే ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్‌లోకి ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే నిర్వహకులు అతడితో సంప్రదింపులు కూడా జరిపారని, దీనికి ఈ సీనియర్ హీరో ఓకే చెప్పాడని తెలుస్తోంది.

యూత్ హీరోగా క్రేజ్
అబ్బాస్ గతంలో దక్షిణాదిలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అతడి హెయిర్ స్టైల్‌కు పెద్ద ఫ్యాన్ బేసే ఉండేది. అలా వరుసగా సినిమాలు చేస్తూ 2011 తర్వాత తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యాడు. అలాంటి ఈ హీరోను ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ మళ్లీ తీసుకు రాబోతుంది. ఇది అబ్బాస్ రీఎంట్రీతో పాటు బిగ్ బాస్ షోకు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











