Indraja: కృష్ణ భగవాన్ పెద్ద ఆటగాడు.. తొలిసారి ఆయనతో ఎక్స్ పీరియన్స్ షేర్ చేసిన హీరోయిన్!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ హీరోయిన్ ఇంద్రజ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. అలాగే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జడ్జిగా చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సింగర్ మనోపై, సీనియర్ నటుడు కృష్ణ భగవాన్ పై షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా భగవాన్ పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గానే.. ఆయనో పెద్ద ఆటగాడు అంటూ తెలిపింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు బుల్లితెరపై వచ్చే అదిరిపోయే షోలలో జబర్దస్త్ ఒకటి. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ 12 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈషోలో అనేక మంది కమెడియన్లు స్కిట్లు చేస్తుంటారు. జడ్జిలతో పాటు యాంకర్ పై కూడా అనేక పంచులు వేస్తూ అదరగొడుతుంటారు. అయితే ఎప్పటిలాగే ఈసారి ఎపిసోడ్ కూడా అదిరిపోయింది. తాజాగా ఈషోలో నాన్ స్టాప్ నూకరాజు ఈ స్కిట్ చేశాడు.

Tollywood Senior Heroine Indraja Shocking Comments About Krihna Bhagavan Check Details

ఈ క్రమంలోనే ఆయన యాంకర్ గా మారి రా అనే అక్షరం పలకకుండా.. లా అని పలుకుతూ అలరించాడు. ముఖ్యంగా జడ్జిలు అయిన ఇంద్రజ, కృష్ణ భగవాన్ ల మధ్యకు వెళ్లి మరీ కుర్చీ వేసుకుని కూర్చుంటూ రచ్చ చేశాడు. వారిద్దరినీ ప్రశ్నలు అడుగుతూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నేరుగా స్టేజీ మీదకు రాకుండా... జడ్జిల మధ్య కూర్చుని.. మీరు ముందు మాత్రమే కాదు వెనక కూడా చూడాలంటూ చెప్పాడు. అలా అక్కడ కూర్చుని షాక్ ఇచ్చిన నూకరాజు.. ఈరోజు నుంచి జబర్దస్త్ కు ముగ్గురు జడ్జిలు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదంతా విన్న కృష్ణ భగవాన్ వెంటనే తాను వెళ్లిపోతానంటూ లేచాడు. ఆగండి ఆగండి అంటూ మళ్లీ ఆయనను కూర్చోబెట్టి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని ఫిక్స్ అయ్యానంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత మీకంటే ముందు అంటే ఈ సీట్లో నాగబాబు, మనో గారు, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా మీకు ఏమనిపిస్తుందని అడుగుతాడు. అదంతా విన్న కృష్ణ భగవాన్.. ఈ సీట్ నాకే సరిపోలేదు.. వారికెలా సరిపోయిందని అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు.

Tollywood Senior Heroine Indraja Shocking Comments About Krihna Bhagavan Check Details

ఆ తర్వాత ఇంద్రజ వద్దకు వెళ్లి ఈ సీట్లో గతంలో మీతో పాటు కూర్చున్న మనోగారిపై, ఇప్పుడు పక్కనే ఉన్న్ జడ్జిగారిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా... వెంటనే ఇంద్రజ సింగర్ మనో గారు పాటడాడు అని అలాగే కృష్ణ భగవాన్ పెద్ద ఆటగాడని చెప్పింది. దీంతో అంతా షాక్ అయ్యారు. ఓవైపు నవ్వుతూనే మరోవైపు ముక్కున వేలేస్కున్నారు. ముఖ్యంగా ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X