చిత్ర పరిశ్రమలో కలకలం.. యాంకర్ సుమ అరెస్ట్.. అసలు ఏం జరిగిందంటే?

యాంకర్ సుమ.. తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని పేరు. బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సినిమా ఆడియెన్స్ ను కూడా తన యాంకరింగ్ తో కట్టిపడేస్తుంది సుమ. ఇంకా చెప్పాలంటే నేటి యంగ్ యాంకర్ లకు సుమ ఒక డిక్షనరీలా మారిందనే చెప్పవచ్చు.

ఇక సుమ కనకాల ఈవెంట్స్ లలో మైక్ పట్టుకుంటే అంతే. ఆమె మాటల ప్రవాహం, పంచ్ ల తూటాలకు నవ్వులు కురవాల్సిందే. షోలు మాత్రమే కాకుండా వెండితెరపై కూడా మెరిసిన ఈ స్టార్ యాంకర్ తాజాగా అరెస్ట్ అయ్యారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 Suma Kanakala

పాపులారిటీ: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇంకొందరు యాంకర్ అంటే ఇలా ఉండాలి, యాంకరింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఎవరు పొందలేని విశేషమైన గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. యాంకరింగ్ లో ఆమెకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.

రోస్టే చేస్తూ.. : చాలా కాలంగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకున్న ఈ షోతో తెగ ఫేమస్ అయిపోయారు సుమ కనకాల. కామెడీ ప్రధానంగా సాగే ఈ షోలో అతిథులుగా సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు,కమెడియన్లు ఆహ్వానించి రోస్ట్ చేస్తారు సుమ, ఈ షో వేదికగా ఆమె వేసిన ప్రశ్నలకు ధీటుగా నిలబడటం అంతా ఈజీ కాదు.

 Suma Kanakala

సుమ అడ్డాతో : ఎందుకంటే సుమ కనకాల తనదైన కామెడీ పంచ్ లతో హీరో హీరోయిన్లు ఎవరనేదేమి చూడకుండా ఎంటర్టైన్ చేస్తుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇటీవలే క్యాష్ పోగ్రామ్ పూర్తి కాగా ఇప్పుడు సుమ అడ్డా అంటూ మరో షోతో అదరగొడుతున్నారు యాంకర్ సుమ.

బాక్సాఫీస్ వద్ద : ఇక సుమ అడ్డాలో యాంకరింగ్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది సుమ. యూట్యూబ్ లో తన పేరు మీద ఛానెల్ కూడా లాంఛ్ చేసి అందులో అన్ని రకాల ఎంటర్టైన్ మెంట్స్ ఇస్తూ మరింత ఫన్ చేస్తోంది. ఇలా యూట్యూబ్, బుల్లితెరపై అలరించిన సుమ జయమ్మ పంచాయితీ మూవీతో వెండితెరపై కూడా అలరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

Suma Kanakala

హాట్ టాపిక్ గా : ఇక ఇటీవల తాను సినిమాల్లో నటించడం పెద్దగా కలిసిరావడం లేదని, వాటికి రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు యాంకర్ సుమ. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ సుమ అరెస్ట్ అయినట్లు వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఆమె అరెస్ట్ అయి వాహనంలో వెళ్తున్నట్లుగా ఉండే పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ సుమ అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడిలానే.. :

అయితే అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం కస్టడీ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ను చైతూ జోరుగా చేస్తున్నాడు. ఇటీవలే డైరెక్టర్ వెంకట్ ప్రభును జైల్లో వేసి విచారించినట్లు ఓ వీడియో వదిలి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లుగా చూపిస్తున్నారు నెట్టింట్లో మరో టాక్ నడుస్తోంది. ఇక వివిధ రకాలుగా ప్రమోషన్స్ నిర్వహించడం తెలుగు పరిశ్రమలో కామన్ అని తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X