Bigg Boss Telugu 7: కెప్టెన్సీ టాస్క్‌తో మారిపోయిన టాప్ 5 లిస్ట్.. ఎవరెవరు రేస్‌లో ఉన్నారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకూ అద్భుతమైన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న ఈషోలో విన్నర్, టాప్ 5 లిస్టు తరచుగా మారుతోంది. గత సీజన్లలో ఫ్యామిలీ వీక్ వచ్చే సరికే విన్నర్ ఎవరో తెలిసిపోయేది. కానీ ఈ సీజన్ మాత్రం అంతా ఉల్టాపుల్టాగా సాగుతోంది. ఫ్యామిలీ వీక్ ముందు వరకూ విన్నర్ అనుకున్న వ్యక్తి ప్రస్తుతం రన్నరప్ గా నిలిచే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అయితే ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ తర్వాత టాప్ 5 లిస్టు తారుమారు అయింది. అసలు ఈ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీజన్ ప్రారంభం అయ్యేముందు విన్నర్ గా అమర్ దీప్ నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ తో జరిగిన గొడవో కనీసం టాప్ 5లో కూడా ఉండని రెండో వారమే తేలిపోయింది. ఇక అప్పటి నుంచి శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత విన్నర్ గా శివాజి నిలుస్తాడని.. ఆయన కాకపోతే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుస్తాడని భావించారు. ఈక్రమంలోనే పది వారాలు ఆట సాగింది. కానీ పదో వారంలో ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత నుంచి లెక్కలన్నీ మారిపోయాయి.

నాలుగో స్థానంలో బిగ్ బాస్ ప్రియాంక జైన్ ఉండగా.. ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రిన్స్ యావర్ ఐదో స్థానానికి పరిమితం కాబోతున్నట్లు అర్థం అవుతోంది. కానీ బిగ్ బాస్ మరో దత్తపుత్రిక శోభాశెట్టి కోసం ఆయన ఏమైనా ప్లాన్ చేసి ఐదో స్థానాన్ని ఆమెకు అంట గడతాడ లేక... ఓటింగ్ ఎక్కువగా ఉన్న యావర్ నే బరిలో నిలుపుతాడా అనేది తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే మరో రెండు వారాలు గేమ్ ఉండగా.. ఈ లెక్కలు కూడా తారుమారు అవుతాయా లేక ఇదే కొనసాగుతుందా అనేది చూడాలి.

రెండో వారం నుంచి విన్నర్ గా శివాజి నిలుస్తారని అంతా భావించగా.. అమర్ దీప్ ఆట ఆడడం ప్రారంభించాడు. ముఖ్యంగా కెప్టెన్సీ కోసం అమర్ దీప్ పడ్డ కష్టం చూసిన ప్రతీ ఒక్కరికీ పాపం అనిపించింది. కంటెండర్ అయినప్పటికీ హౌస్ మేట్స్ సహకారం లేకపోవడంతో ప్రతీసారి ఓడిపోయాడు. 11వ వారంలో అయితే పిచ్చి పట్టిన వాడిగా గేమ్ ఆడి ఓడిపోయాడు. ఇక అప్పటి నుంచి అమర్ దీప్ ఓటింగ్ గ్రాప్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఈవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ తో అయితే ఓటింగ్ లో మూడో స్థానంలో ఉన్న అమర్ దీప్ రెండో స్థానానికి చేరిపోయాడు.

ముఖ్యంగా శివాజిని అంతగా అమర్ దీప్ బతిమాలుకున్నా.. కెప్టెన్సీ ఇవ్వకపోవడం అమర్ దీప్ చాలా ప్లస్ అయింది. ఆయన బాధను చూపిన ప్రతీ ఒక్కరూ ఓటు వేసి మరీ సమాధానం చెప్పారు. ఓటింగ్ లో రెండో స్థానంలో ఉన్న శివాజి ఈ ఘనటతో మూడో స్థానానికి పడిపోయాడు. ఇదంతా చూస్తుంటేనే శివాజి గ్రాఫ్ తగ్గుతోందని అర్థం అవుతోంది. అయితే ఈ సీజన్ విన్నర్ గా అమర్ దీప్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉండగా.. రన్నరప్ గా శివాజి నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

నాలుగో స్థానంలో బిగ్ బాస్ ప్రియాంక జైన్ ఉండగా.. ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రిన్స్ యావర్ ఐదో స్థానానికి పరిమితం కాబోతున్నట్లు అర్థం అవుతోంది. కానీ బిగ్ బాస్ మరో దత్తపుత్రిక శోభాశెట్టి కోసం ఆయన ఏమైనా ప్లాన్ చేసి ఐదో స్థానాన్ని ఆమెకు అంట గడతాడ లేక... ఓటింగ్ ఎక్కువగా ఉన్న యావర్ నే బరిలో నిలుపుతాడా అనేది తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే మరో రెండు వారాలు గేమ్ ఉండగా.. ఈ లెక్కలు కూడా తారుమారు అవుతాయా లేక ఇదే కొనసాగుతుందా అనేది చూడాలి.

Click it and Unblock the Notifications