Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి టాప్ 7 కంటెస్టెంట్స్... పక్క ఫ్రూఫ్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు రంజుగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుని... 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మరో మూడో వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నది 8 మంది కంటెస్టెంట్స్... మరి గ్రాండ్ ఫినాలేకి 7 మంది కంటెస్టెంట్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ సారి సీజన్ 7 కాబట్టి 7 మంది కంటెస్టెంట్స్ వెళ్లనున్నారు. అసలు ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రెస్ట్ గా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక 13వ వారంలోకి ఎంటర్ అయింది. ఇక మరో మూడు వారాల్లో ఈ షో ముగియనుంది. హౌస్ లో తొలివిడుత 14 మంది, వైల్డ్ ఎంట్రీస్ 5 మంది మొత్తం కలిపి... 19 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఒకరు రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. హౌస్ నుంచి 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్, అర్జున్, గౌతమ్, శోభా శెట్టి ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. ఈ వారం నామినేషన్స్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప అందరూ నామినేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ టు ఫినాలే టాస్కులు కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గ్రాంఢ్ ఫినాలే డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ ఫినాలేకి మరో మూడు వారాలు ఉంది. ఈ ఫినాలేకి టాప్ 7 కంటెస్టెంట్స్ వెళ్లనున్నారని తెలుస్తోంది. దానికి పక్క ఫ్రూఫ్ ఏంటంటే.. గత వారం ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్ యూజ్ చేయలేదు. 14వ వారంలో యూజ్ చేస్తాను అంటూ ప్రశాంత్ చెప్పుకువచ్చాడు.

ఈ లెక్కన చూసుకుంటే... హౌస్ లో 8 మంది ఉన్నారు. 13వ వారంలో ఒకరు.. 14వ వారంలో ఒకరు ఎలిమినేట్ అయితే... 15వ వారంలో టాప్ 6 ఉంటారు. అయితే టాప్ 6 కంటెస్టెంట్స్ తో ఫినాలే ఉండదు.. ఉంటే టాప్ 5 లేదా... టాప్ 7 ఉంటుంది. అయితే 14వ వారంలో ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. దానికి కారణం ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడుతాడు కాబట్టి... ఆ రోజున ఎవరైన ఎలిమినేట్ అయితే సేవ్ అయిపోతారు.
అలా ఈ సీజన్ 7 కాబట్టి.. టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలేకి వెళ్లనున్నారు. ఇక ఉన్నది 8 మంది కంటెస్టెంట్స్... మరి టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ పక్కా ఉంటారు. ఎలాగూ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉండాలి కాబట్టి ప్రియాంక, శోభాను కూడా ఉంచే అవకాశం ఉంది. ఇక అర్జున్, గౌతమ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నరని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











