Bigg Boss Nominations: 11వ వారం షాకింగ్ నామినేషన్స్.. టాప్ ప్లేయర్లకు షాక్.. ఓటు పడినా అతడు సేఫ్
తెలుగు బుల్లితెరపైకి ఏ ముహూర్తాన వచ్చిందో తెలియదు కానీ.. ఎవరూ ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అందుకే ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా నిర్వహకులు ప్లాన్లు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో ఎవరి ఊహకూ అందని ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ అన్నీ షాకింగ్‌గానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 11వ వారం నామినేషన్స్ లిస్ట్ లీకైంది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!
ట్విస్టులు, టర్న్‌లతో సీజన్:బిగ్ బాస్ తెలుగులో ప్రసారం అయిన ప్రతిసారీ కొత్త కంటెంట్ ఇవ్వడానికే నిర్వహకులు ప్రయత్నించారు. కానీ, ఇవి కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కాలేదు. అయితే, ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టాగా నడుపుతుండడంతో ఇది సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ముఖ్యంగా ఇందులో ట్విస్టులు, టర్న్‌లు ఉండడంతో ప్రేక్షకులకు మజా వస్తోంది. తద్వారా ఎక్కువ రేటింగ్ కూడా లభిస్తోంది.

ఫస్ట్ వాళ్లు... ఇప్పుడు వీళ్లు:ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది, ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురు, ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్, తొమ్మిదో వారంలో తేజ, పదో వారం భోలేలు వెళ్లిపోయారు.
బాటిల్ పెట్టి.. తలపై కొట్టి:ఏడో సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు నామినేషన్స్ టాస్కులను కొత్త కాన్సెప్టులతో తీసుకు వస్తున్నారు. అయితే, 11వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను 'బాటిల్ పెట్టి.. తలపై కొట్టే' పాత టాస్కును తీసుకు వచ్చారు. దీని ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ బాటిల్‌ను వాళ్ల తలపై కొట్టాల్సి ఉంటుంది. అందుకు తగిన కారణాలను కూడా చెప్పాలి.
ఫుల్ ఫైరింగ్ నామినేషన్స్:నామినేషన్స్ టాస్క్ అంటేనే బిగ్ బాస్ షో మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇది జరిగే సమయంలో కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో గొడవలు కనిపిస్తాయి. ముఖ్యంగా పదకొండో వారం నామినేషన్స్‌లో రతికా రోజ్ - శోభా శెట్టి, ప్రశాంత్ - అర్జున్ సహా పలువురు గొడవలు పెట్టుకున్నారని తెలిసింది. దీంతో ఈ నామినేషన్స్ కూడా రెండు రోజులు చూపించే ఛాన్స్ ఉందని టాక్.

ఏకంగా ఎనిమిది నామినేట్:ఏడో సీజన్‌లోని పదకొండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే కంప్లీట్ అయింది. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో ప్రిన్స్, ప్రియాంక, అమర్‌దీప్, అంబటి అర్జున్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, అశ్విని, రతికా రోజ్‌లు ఉన్నారని సమాచారం.
అతడికి ఓటు పడినా సేఫ్:పదకొండో వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో శివాజి కెప్టెన్ కావడంతో అతడికి ఓట్లు వేయకూడదు. అయితే, పల్లవి ప్రశాంత్‌ను కూడా ఒకరు నామినేట్ చేశారు. కానీ, ఒక్క ఓటును పరిగణలోకి తీసుకోని బిగ్ బాస్.. అతడు నామినేట్ అయినట్లు ప్రకటించలేదని తెలిసింది. మొత్తానికి ఈ వారం టాప్ ప్లేయర్లు నామినేషన్స్‌లో ఉండడంతో ఓటింగ్ ఆసక్తికరంగా మారనుంది.


Click it and Unblock the Notifications











