Bigg Boss 8 Voting : గుద్దిపడేస్తోన్న ఆ ఇద్దరి ఫ్యాన్స్ .. తారుమారైన ర్యాంక్‌లు , దారుణంగా యష్మి ఓటింగ్
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ఏడో వారంలోకి ప్రవేశించింది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ + రాయల్ క్లాన్ సభ్యులు కలిపి మొత్తం 15 మంది ప్రస్తుతం హౌస్‌లో మిగిలారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల రాకతో బీబీ హౌస్‌లో ఎంటర్‌టైన్మెంట్ పెరిగింది. జోకులు, పంచ్‌లతో అవినాష్, రోహిణిలు ఇంటి సభ్యుల్లో జోష్ తీసుకొస్తున్నారు. అయితే నామినేషన్స్ సందర్భంగా ఇంట్లో కాస్త సీరియస్ వాతావరణం కనిపించింది. మరి ఈ వారం ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూస్తే:
ఈ వారం నామినేషన్స్‌కు ప్రతి ఒక్కరూ అర్హులేనని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఎవరు నామినేట్ అయ్యేది హరితేజ, ప్రేరణ చేతుల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే మెగా చీఫ్ అయిన కారణంగా మెహబూబ్‌ను ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు . సోమవారం నాటి ఎపిసోడ్‌లో రోహిణి.. గౌతమ్‌ని, నిఖిల్.. టేస్టీ తేజాని, యష్మీ.. టేస్టీ తేజాని, మణికంఠ .. నిఖిల్‌ని, అవినాష్.. మణికంఠని, గౌతమ్.. విష్ణుప్రియ, గంగవ్వ .. పృథ్వీని నామినేట్ చేశారు. అప్పటికే సమయం ముగియడంతో మిగిలిన నామినేషన్ల కార్యక్రమం మంగళవారానికి వాయిదా వేశారు బిగ్‌బాస్.

నబీల్ .. టేస్టీ తేజాని, టేస్టీ తేజా.. యష్మి గౌడని, హరితేజ.. యష్మిగౌడని, విష్ణుప్రియ.. నయని పావనిని, పృథ్వీ.. అవినాష్‌ని నామినేట్ చేశారు. ఎపిసోడ్ చివరిలో అవినాష్ ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో ఉన్న అవినాష్.. తాను రీలోడ్ లాంచ్ ఎపిసోడ్ రోజున గంగవ్వతో కలిసి సాధించిన ఇమ్యూనిటీ షీల్డ్ పవర్‌ని వాడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే నీకు బదులుగా నీ టీమ్‌లో నుంచి మరొకరిని నామినేషన్స్‌లో ఉంచాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు.
దీంతో రాయల్ క్లాన్ మొత్తం డిస్కస్ చేసుకుని స్వాపింగ్ విధానంలో హరితేజని నామినేట్ చేశారు. కిల్లర్ గర్ల్‌గా తన టీమ్ సభ్యులను కాపాడిన హరితేజను సొంత వాళ్లే దెబ్బేశారు. ఆమె కూడా దీనిని అస్సలు ఊహించినట్లుగా లేదు. అవినాష్ మాటలు వినగానే షాక్‌లో ఉండిపోయింది. మొత్తం మీద ఏడో వారం ఏకంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారు హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తే :
నిఖిల్ (19.7 శాతం) వరుసగా రెండో రోజూ ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్తున్నారు. అతనికి నబిల్ (19.6 శాతం) ఓటింగ్‌తో పాయింట్ తేడాతో గట్టి పోటీ ఇస్తున్నారు. నిన్న మూడో స్థానంలో ఉన్న యష్మీ గౌడ (9.1 శాతం) ఇవాళ ఆరో స్థానానికి పడిపోయింది, నాగమణికంఠ (17.5 శాతం) ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు, ప్రేరణ (13.9 శాతం), గౌతమ్ (11.10శాతం), పృథ్వీ (8.7 శాతం)లు సేఫ్ జోన్‌లో నిలిచారు. అనూహ్యంగా నామినేషన్స్‌లోకి వచ్చిన హరితేజ (7.4 శాతం), టేస్టీ తేజ (5.9 శాతం) ఓటింగ్‌తో మాత్రం డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా గడువు ఉండటంతో ఈలోపు ఎలాంటి ఏ ప్లేస్‌లో నిలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











