Toxic: ధురంధర్‌ 2పై టాక్సిక్ డామినేషన్... ఆ లిస్ట్‌లో యష్ హవా, ది ప్యారడైజ్‌తో పోటీలోకి నాని!

సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి నెలలో బాక్సాఫీస్ కళ తప్పింది.. పెద్ద హీరోల సినిమాలు ఇంకా సిద్ధం కాకపోవడం, వరుసపెట్టి వాయిదాపడటంతో సినీ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్చి నెలలో అందరికీ వినోదాన్ని పంచేందుకు భారీ చిత్రాలు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా చిత్రాలు ఈ నెలలో థియేటర్‌ల ముందుకు క్యూకడుతున్నాయి. వీటిలో అందరి చూపు రెండు సినిమాల మీద ఉంది.. అవి ధురంధర్ 2, టాక్సిక్. పాన్ ఇండియా సినిమాలుగా భారీ అంచనాల మధ్య ఒకే రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమాల కోసం ప్రేక్షకుల ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో దంగల్, బాహుబలి 2, పుష్ప 2 తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మార్చి 19న రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు మేకర్స్. దాంతో ధురంధర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1లో కొన్ని సమాధానాలు దొరకని ప్రశ్నలకు.. పార్ట్ 2లో దర్శకుడు క్లారిటీ ఇవ్వనుండటంతో మూవీ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ధురంధర్ 2 టీజర్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయడానికి రణ్‌వీర్ సింగ్ సిద్ధమవుతున్నాడు.

Toxic vs Dhurandhar 2 Yash Leads IMDb Poll as Most Awaited Film of 2026 Beats Ranveer Singh in Popularity Rankings

సరిగ్గా అదే రోజున కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు యష్. ఈ భారీ సినిమాల తర్వాత యష్ నటిస్తోన్న సినిమా కావడంతో టాక్సిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌ ఈ హైప్‌ను పెంచేసింది. కేజీఎఫ్‌కు ఏమాత్రం తగ్గకుండా గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

మార్చి 19న ధురంధర్ 2, టాక్సిక్‌లు ఓకే రోజు రానుండటంతో రెండు సినిమాలు సాధించే ఓపెనింగ్స్, బాక్సాఫీస్ లెక్కలపై అప్పుడే చర్చ మొదలైంది. యష్‌కు సౌత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండగా.. ధురంధర్ సినిమా ఇంపాక్ట్ దక్షిణాది ఆడియన్స్ మీద గట్టిగానే పడింది. ఓటీటీలో ఈ సినిమాకు దక్కుతోన్న ఆదరణ ఇందుకు నిదర్శనం. ధురంధర్‌ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినా చివరి నిమిషంలో పలు కారణాలతో అది వాయిదాపడింది. అయితే ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా ధురంధర్ 2ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ధురంధర్ 2కు భారీ ఓపెనింగ్స్ లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకరకంగా టాక్సిక్‌తో పోలిస్తే ధురంధర్ 2కు ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ ఇటీవల ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ 120 కోట్ల రూపాయలు పలికి టాక్సిక్ సత్తాను చాటింది.

ఇదిలాఉండగా.. టాక్సిక్ VS ధురంధర్‌ పోటీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్‌లో ఈ రెండు చిత్రాలు ఉన్నాయి. అయితే ఆసక్తికరంగా టాక్సిక్ గురించే జనం ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్.. ఐఎండీబీ నిర్వహించిన పోల్‌లో యష్ నటించిన టాక్సిక్ - ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌ అప్స్ చిత్రం.. 2026లో ఐఎండీబీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అగ్రస్థానంలో నిలిచింది. యష్ మూవీ 40.6 శాతం రియల్ టైమ్ పాపులారిటీ రేటింగ్ పాయింట్స్‌ను సాధించి హవా చూపించింది. అటు రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 చిత్రం ఆశ్చర్యకరంగా 22.6 శాతం ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ లిస్ట్‌లో టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్‌‌కు 6.3 శాతం ప్రజాదరణ సాధించి 4వ స్థానంలో నిలిచింది. అయితే రిలీజ్‌కు మరో నెల రోజులకు పైగా టైం ఉండటంతో రేటింగ్ మారే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం టాక్సిక్ దూసుకెళ్తోంది.

More from Filmibeat

Read more about: toxic ranveer singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X