గంగవ్వ కుటుంబంలో విషాదం.. గృహ ప్రవేశం వేళ అపశృతితో..!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న గంగవ్వకు సొంత ఇంటి కల సాకారమైంది. బిగ్‌బాస్ నిర్వాహకులు, నాగార్జున అందించిన చేయూతతో గంగవ్వ మంచి ఇంటిని నిర్మించుకొన్నది. ముహుర్తం బాగా ఉండటంతో నవంబర్ 09వ తేదీ తెల్లవారుజామున గృహ ప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించుకొన్నారు. అయితే ఇలాంటి శుభ సమయంలో గంగవ్వ ఇంటిలో విషాదం చోటుచేసుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..

గృహ ప్రవేశ సంతోషంలో గంగవ్వ
ఇంటి కోసం మై విలేజ్ టీమ్ అందించిన సహకారంపై గంగవ్వ ఆనందం వ్యక్తం చేసింది. నాకు తెలిసిన సెలబ్రిటీలను అందరిని పిలిచాను. కానీ షూటింగుల కారణంగా ఎవరూ రాలేదు. కానీ అఖిల్, సావిత్రమ్మ, కలగూర గంపమ్మ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది అంటూ గంగవ్వ చెప్పారు.

అఖిల్ సార్థక్ డబ్బులిచ్చాడు..
నా జీవితంలో నా బిడ్డల పెళ్లి కూడా ఇంత గ్రాండ్‌గా జరగలేదు. నా ఇండ్లలోకి వెళ్లడం చాలా గ్రాండ్‌గా జరిగింది. అఖిల్ వచ్చాడు. అఖిల్ అంటే నా బిడ్డ కొడుకు లాంటి వాడు. నాకు మనవడు. నాకు బట్టలు పెట్టిండు. కొంత డబ్బులు కూడా ఇచ్చాడు. చాలా సంతోషమేసింది. సావిత్రి భర్తతో కలిసి వచ్చింది. వాళ్లు నాకు గిఫ్టులు ఇచ్చారు. వాళ్లకు బట్టలు పెట్టాను అని గంగవ్వ చెప్పింది.

సంతోష సమయంలో గంగవ్వకు విషాదం
గృహ ప్రవేశం సమయంలో గంగవ్వ కాస్త నిరాశగా కనిపించింది. ముఖంలో బాధ ఉండటంతో ఆమె టీమ్ మెంబర్ అసలు విషయం చెప్పారు. గంగవ్వ తమ్ముడి కొడుకు చనిపోయాడు. ఆత్మహత్య చేసుకోవడంతో గంగవ్వ బాధలో మునిగిపోయింది. ఇలాంటి శుభవేళలో గంగవ్వ కొంచెం బాధలో ఉంది అని మై విలేజ్ షో టీమ్ మెంబర్ చెప్పారు.

నా తమ్ముడి కొడుకు ఆత్మహత్య
ఇక తన కుటుంబంలో జరిగిన విషాదంపై కూడా గంగవ్వ స్పందించింది. తన బాధను చెప్పుకొంటూ నా తమ్ముడి కొడుకు చనిపోయాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి ట్రాక్టర్ కొన్నారు. ఆ తర్వాత చెడు సహవాసం చేసి తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగుడుతో అప్పులు పెరిగిపోయాయి. దాంతో మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు అని గంగవ్వ తెలిపింది.
Recommended Video

నా కుటుంబ సభ్యులు రాలేదంటూ..
విషాదంపై గంగవ్వ స్పందిస్తూ.. నా తమ్ముడి కొడుకు చనిపోయడానే వార్త తెలిసింది. తన ఇంటి శుభకార్యం సమయంలో ఇలాంటి సంఘటన తెలియడంతో కాస్త బాధైంది. నా తమ్ముడి కుటుంబం రాలేదన్న బాధ ఉంది. అంతే తప్ప మరే బాధ లేదు. నా బలగం రాలేదన్న కొంత బాధే ఉంది అని గంగవ్వ తన విషయాలను పంచుకొన్నది. అయితే గంగవ్వ ఇంటిలో జరిగిన ఫంక్షన్‌కు స్థానిక నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











