Bigg Boss 7: బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ ట్రాన్స్‌జెండర్.. అప్పుడు పింకీ.. ఇప్పుడేమో ఈ ‘లేడీ’

దాదాపు ఆరేళ్లుగా తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ అవుతోన్న షోలలో బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాల నడుమ వచ్చినా.. ఈ కార్యక్రమానికి ఇక్కడి ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఇండియాలోనే అత్యధిక రేటింగ్‌ను సాధించి టాప్ షోగా నిలిచింది. ఫలితంగా నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను నడుపుకుంటూ వస్తున్నారు. ఇలా త్వరలోనే ఏడో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులోకి జబర్ధస్త్‌ ద్వారా ఫేమస్ అయిన ఓ 'లేడీ' ఎంటరవుతున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీరే చూడండి!

అవి సక్సెస్.. ఏడో దానికి సిద్ధం:ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్నా తెలుగులో వస్తున్న బిగ్ బాస్‌కు మాత్రమే రికార్డు స్థాయిలో రేటింగ్ దక్కుతోంది. ఇలా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఏడో దానిని కూడా తీసుకు రాబోతుంది. ఇప్పటి వరకూ ఎంతో రంజుగా సాగిన ఈ షో.. త్వరలోనే మరో సీజన్‌ను తీసుకు రాబోతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికోసం చాలా మంది వేచి చూస్తున్నారు.

Transgender Jabardasth Tanmay Entry To Bigg Boss Season 7

అప్పటి నుంచే మొదలు అని:భారీ అంచనాలతో రాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన లోగోనే ఇటీవలే విడుదల చేశారు. ఇది గతంలో కంటే ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది. దీంతో ఈ సీజన్‌పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. అలాగే ప్రోమోను కూడా వదిలారు. ఇక, ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోంది.

Transgender Jabardasth Tanmay Entry To Bigg Boss Season 7

కొత్త కాన్సెప్ట్.. ఆ పనులు స్టార్ట్:చాలా ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గతంలో చూడని విధంగా అత్యంత కలర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇక, ఈ సీజన్‌లో సరికొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నారని నాగార్జున ప్రోమోలో వెల్లడించాడు. ఇక, దీని కోసం నిర్వహకులు పనులను ఈ మధ్యనే మొదలు పెట్టారని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్లను ఉంచే ఇంటి వర్క్‌ను చాలా వరకూ పూర్తి చేశారని టాక్.

Transgender Jabardasth Tanmay Entry To Bigg Boss Season 7

కంటెస్టెంట్ ఫైనల్.. చివరిగా:సెప్టెంబర్‌లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్టును బిగ్ బాస్ టీమ్ రెడీ చేసింది. ఇప్పుడు వాళ్లతో రెమ్యూనరేషన్ డీల్స్ చేసుకుంటున్నారని అంటున్నారు. దీంతో ఈ సారి ఎవరు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Transgender Jabardasth Tanmay Entry To Bigg Boss Season 7

7వ సీజన్‌లో ట్రాన్స్‌జెండర్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఫలానా సెలెబ్రిటీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తరచూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఏడో సీజన్‌లో జబర్ధస్త్ ఫేమ్, ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తన్మయి పాల్గొనబోతున్నట్లు తెలిసింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌ అవుతోంది.

Transgender Jabardasth Tanmay Entry To Bigg Boss Season 7

అప్పుడే రావాల్సి ఉన్నా మిస్:జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ ఫేమస్ అయిన తన్మయ్.. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు ప్రముఖ షోలో ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. వాస్తవానికి ఈమె ఆరో సీజన్‌లోనే పాల్గొనాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పుడు ఎంట్రీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏడో సీజన్ ద్వారా బిగ్ బాస్ ప్రియులను పలకరించబోతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X