పప్పుగా.. పవర్ లేని పప్పుగా అంటూ తమన్నా ఎటాక్.. ఆ ఇద్దరిని వెంటాడుతూ..

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 17,Day 16 Highlights || Filmibeat Telugu

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో తమన్నా సింహాద్రి హల్‌చల్ మంగళవారం కూడా కొనసాగింది. రవికృష్ణ, రాహుల్ సిప్లింగంజ్ మధ్య మాటల దాడి కొనసాగింది. ఇంట్లో తమన్నా చేసిన ఫైర్‌బ్రాండ్ గొడవను ఆపడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
రోజంతా రవికృష్ణను వెంటాడుతూ, మాటలతో తమన్నా హింసించే ప్రయత్నం చేసింది. అసలేం జరిగిందంటే...

రవికృష్ణతో కొనసాగిన గొడవ

రవికృష్ణతో కొనసాగిన గొడవ

ఎలిమినేషన్ కోసం సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తనను నామినేట్ చేయడంతో రవికృష్ణపై తమన్నా సింహాద్రి మండిపడింది. అప్పటి నుంచి రవికృష్ణను టార్కెట్‌గా చేసుకొని హింసించడం మొదలుపెట్టింది. శివజ్యోతి, శ్రీముఖి, మహేష్ విట్ట, బాబా భాస్కర్ సముదాయించేందుకు ప్రయత్నించిన తన మాటల యుద్ధాన్ని తమన్నా యదేచ్చగా కొనసాగించింది.

నేను నరకం చూపిస్తాను

నేను నరకం చూపిస్తాను

నేను సారీ చెప్పడాన్ని హైలెట్ చేస్తాడా? ఇక నుంచి సారీ చెప్పను. ఇక నేనేంటో చూపిస్తాను. ఇంట్లో ఉండే ఐదురోజుల పాటు నరకం చూపిస్తాను అని తమన్నా వార్నింగ్ ఇచ్చింది. రవికృష్ణను పప్పు అంటూ వేధించింది. ఓ దశలో నాకు పప్పు కావాలంటూ బాబా భాస్కర్‌ను అడిగింది. ఏం పప్పు కావాలంటే పవర్ లేని పప్పు కావాలంటూ తమన్నా ప్రతాపం చూపించింది.

మీ అబ్బాయి తప్పు చేశాడని

మీ అబ్బాయి తప్పు చేశాడని

రవికృష్ణను రోజంతా వేధించడంతోపాటు.. ఆయన తల్లిదండ్రులకు తమన్నా ఓ సందేశాన్ని ఇచ్చింది. మీ అబ్బాయి చేసిన తప్పుకు ఇలాంటి పనిష్‌మెంట్ అవసరమే. మీ అబ్బాయి గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నన్ను ఈ విషయంలో తప్పుపట్టవద్దు అంటూ కెమెరా ముందు చెప్పింది.

తమన్నాకు రాహుల్ సిప్లిగంజ్ కౌంటర్

తమన్నాకు రాహుల్ సిప్లిగంజ్ కౌంటర్

ఇక రవికృష్ణకు అండగా నిలిచిన రాహుల్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడవాళ్లను మీరు అవమాన పరుస్తారా? అంటూ రాహుల్ ఎదురుదాడి చేశారు. దాంతో రాహుల్‌పై కూడా తమన్నా విరుచుకుపడింది. ఇంట్లోనే కాదు.. బయటకు వెళ్లినా నేను చూసుకొంటాను. అంటే బయట చూసుకునేందుకు నేను కూడా రెడీ అంటూ రాహుల్ సవాల్ విసిరాడు.

కెప్టెన్సీ టాస్క్ కోసం దొంగలుగా

కెప్టెన్సీ టాస్క్ కోసం దొంగలుగా

చివర్లో కెప్టెన్సీ టాస్క్‌కు బిగ్‌బాస్ తెర తీశాడు. దొంగలు బాబోయ్ దొంగలు అనే ఎపిసోడ్ ప్రారంభమైంది. బద్దకపు పోలీస్ ఆఫీసర్‌గా బాబా భాస్కర్, చురుకైన కానిస్టేబుల్‌గా శివజ్యోతి, ఊరి పెద్దగా వరుణ్ సందేశ్, ఆయన భార్యగా తమన్నా, దొంగలుగా రవికృష్ణ, శ్రీముఖి, అషురెడ్డి పాత్రలు పోషించారు. ఈ ఎపిసోడ్ బుధవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X