బిగ్‌బాస్ నుంచి హేమ అవుట్.. తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ
Recommended Video
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తొలి ఎలిమినేషన్ ఉత్కంఠగా సాగింది. శనివారం ఎపిసోడ్‌లో ఇద్దరు సేఫ్ కాగా, ఆదివారం షోలో నలుగురు అంటే వితిక, రాహుల్, జాఫర్, హేమ మిగిలారు. వీరిలో ఒకరిని బయటికి పంపించేందుకు రంగం సిద్ధం చేశారు హోస్ట్ నాగార్జున. ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే రెండు రకాల గేమ్స్ ఆడించాడు బిగ్ బాస్. చివరకు ఆదివారం ఎవరు ఇంటి నుంచి నిష్క్రమించారంటే..

గుడ్, యావరేజ్, బ్యాడ్ గేమ్
నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా వేదికపై మెరిసారు. నాగ్ డ్రెస్సింగ్ గురించి ఇంటి సభ్యులు ఫిదా అయ్యారు. నాగ్ కూడా అందర్నీ వారి డ్రస్పింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఎలిమినేషన్‌కు ముందు ఓ గేమ్ ఆడించారు. మూడు రకాల కలర్స్ ఉన్న స్లిప్స్ ఇచ్చి వారిలో గుడ్, యావరేజ్, బ్యాడ్ ఎవరు అనే పేర్లను రాయమన్నారు. తమకు ఇష్టమైన వ్యక్తిని గుడ్‌గా, ఇంటిలో యావరేజ్ ఎవరు? బ్యాడ్ ఎవరు అనే పేర్లను రాయమని చెప్పారు. గుడ్‌గా బాబా భాస్కర్, యావరేజ్‌గా జాఫర్, బ్యాడ్‌గా హేమ నిలిచారు.

రాహుల్ సేఫ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన నలుగురిలో రాహుల్ సిప్లిగంజ్ మొదట సేఫ్ అయ్యారు. నాగార్జున సేఫ్ అని చెప్పగానే రాహుల్ హ్యాపీగా ఫీలయ్యారు. అందరూ రాహుల్‌ను వాటేసుకొన్నారు. ఆ తర్వాత డంబ్ చెరేడ్ గేమ్ గేమ్‌ను కంటిన్యూ చేశారు. స్లిప్‌లో ఉండే పాట పేరును బయటకు చెప్పకుండా డ్యాన్స్ చేసి చూపిస్తే పాట పేరు చెప్పాలి. 15 మందిని ఐదుగురు జట్టుగా మూడు టీమ్‌లుగా విభజించారు.

వితిక సేఫ్
డంబ్ చెరేడ్ గేమ్ ఆటను కొనసాగిస్తూనే ఇంటిలో ఉండే వ్యక్తిని నాగార్జున ప్రకటించారు. వరుణ్ సందేశ్ భార్య వితికను ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారని చెప్పగానే సంతోషంలో మునిగిపోయారు. వెంటనే వెళ్లి వరుణ్ సందేశ్‌ను కౌగిలించుకొని ముద్దులతో ముంచేసింది. ఆ తర్వాత డంబ్ చెరేడ్ ఆటను కొనసాగించారు. ఈ గేమ్‌లో టీమ్ ఏ విజయం సాధించింది.

కోటి 30 లక్షల ఓట్లు
బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ కోసం మొదటి వారం కోటి 30 లక్షల ఓట్లు పోలయ్యాయని నాగార్జున చెప్పారు. గుడ్ యావరేజ్, బ్యాడ్ గేమ్ ప్రకారం ఓట్లు వచ్చాయని చెప్పగానే హేమ ముఖంలో ఆందోళన మొదలైంది. ఓ వైపు జాఫర్ అవుటా? లేదా హేమ అవుటా అనే కంగారు ఇంటి సభ్యుల్లో కనిపించింది.

ఇంటి నుంచి హేమ అవుట్
చివరగా నాగార్జున ఇంటి నుంచి హేమ అవుట్ అయిందని ప్రకటించారు. వెంటనే ప్యాక్ ది బ్యాగ్ అంటూ నాగ్ ఆదేశాలివ్వడంతో ఇంటి సభ్యుల్లో బాధ కనిపించింది. ఓపో ఫోన్‌తో సెల్ఫీ తీసుకొని హేమ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నాగ్‌తో కలిసి ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను హేమ తెలిపింది. బిగ్‌బాస్‌లో వారం రోజుల తన జర్నీని చూసి బయటకు నిష్క్రమించింది.

తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ
ఇంటిలోకి హేమ అవుట్ కాగానే, ఆమె స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇచ్చారు. ఆమెను నాగార్జున సాదరంగా ఆహ్వానించారు. తనకు తాను నిరూపించుకోవడానికి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొంటాను అని చెప్పారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను, ఇంటి సభ్యులను తన కుటుంబంగా మార్చుకొంటానని ఇంటిలోకి ప్రవేశించడానికి సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











