పవిత్ర.. నీవులేని జీవితం శూన్యం.. నీకోసం వస్తున్నా.. ఆత్మహత్యకు ముందు చందు చివరి మెసేజ్!
తన ప్రాణం కన్నా ఇష్టంగా ప్రేమించిన పవిత్ర జయరాం మృతిని జీర్ణించుకోలేకపోయిన టెలివిజన్ నటుడు చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని రోజుల కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న త్రినయిని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
అయితే అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆయన చివరకు ఆ విషాదం నుంచి బయటకు రాలేక సూసైడ్ చేసుకోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆయన తన మరణానికి ముందు తన స్నేహితులు, సన్నిహితులతో చెప్పిన చివరి మాట వైరల్ అవుతున్నది. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..

చందు మరణానికి ముందు ఆయన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనను మానసిక క్షోభ నుంచి బయటకు తీసుకు రావాలని శతవిధాల ప్రయత్నించారు. పవిత్ర జయరాం దూరమైనప్పటి నుంచి ఆయన ఒంటరిగా తన ఇంటిలోనే ఉంటూ వేదనకు గురయ్యారు అని స్నేహితులు చెబుతున్నారు.
తన మొదటి భార్య శిల్ప ఉన్నప్పటికీ.. చందుకు ఆరేళ్లుగా పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నారు. అయితే తామిద్దరం చట్టబద్దంగా పెళ్లి చేసుకొన్నామని ఆయన చెప్పారు. అయితే వాట్సప్ చాటింగ్ సందర్బంగా.. ఇక ఈ జన్మకు చాలూ.. నేను ఈ లోకంలో ఉండలేను. నా పవిత్ర దగ్గరికి వెళ్లిపోతాను. ఈ విషయం ఎవరికి చెప్పలేను అనే వాట్సప్ మేసేజ్ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

పవిత్రతోనే నా జీవితం. ఆమె లేని జీవితం నాకొద్దు. ఆమె ఆత్మ నా చుట్టు తిరుగుతున్నది. ఆమె నాతో మాట్లాడుతున్నది. పవిత్ర వద్దకే నేను వెళ్తున్నాను. ఆమెతోని మాట్లాడుతున్నాను అని తన స్నేహితులుతో చెప్పినట్టు వాట్సప్ ఆధారాలు వెల్లడించాయి.
అయితే తన సూసైడ్‌కు ముందు పవిత్ర మరణ విషాదం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాను. నాకు కౌన్సిలింగ్ అవసరం. మంచి డాక్టర్‌ను చూడండి. నేను మూమూలు మనిషిని కావడానికి ప్రయత్నిస్తానని కూడా తన స్నేహితులతో చెప్పినట్టు సమాచారం. అయితే అనూహ్యంగా అందర్నీ విషాదంలోకి నెడుతూ.. శుక్రవారం రాత్రి నార్సింగిలోని అల్కాపూర్‌లోని పవిత్ర నివాసంలో ఉరి వేసుకొని మరణించారు.

నటుడు చందు తెలుగులో త్రినయిని సీరియల్ ద్వారా పాపులారిటిని సంపాదించుకొన్నారు. గతంలో కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడిప్పుడే అనేక కష్టాలు, సమస్యల నుంచి బయటపడి.. ఆనందంగా జీవితం గడుపుతున్న సమయంలోనే ఇలాంటి విషాదం జరగడంపై సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.
50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!


Click it and Unblock the Notifications











