For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Episode 373 నయని కాళ్ళు పట్టుకున్న విశాల్.. బలవంతం చేసిన సుమన?

  |

  తెలుగులో జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ సీరియల్ లో తాజా ఎపిసోడ్ ప్రకారం ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  photos courtesy : zee telugu+ zee5 app

  అసలు ఏమైందంటే

  అసలు ఏమైందంటే

  నిన్నటి ఎపిసోడ్ లో విశాల్ ఫ్యామిలీ నుంచి జాస్మిన్, నయని, సుమన ముగ్గురు బోనాలు తీసుకుని అమ్మవారికి సమర్పించేందుకు వెళుతూ ఉంటారు. అయితే జాస్మిన్ ప్లాన్ ప్రకారం నయని కాళ్ళకు గాజు పెంకులు గుచ్చుకుని రక్తం వస్తూ ఉంటుంది.. అయితే తన భార్య కష్టం చూసి తాను బోనాలు సమర్పిస్తానని కుండ ఎత్తుకుని లోపలికి వెళ్తాడు విశాల్. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో హాసిని అమ్మవారు పూనినట్లుగా నటిస్తూ కొరడా తీసుకుని జాస్మిన్ పంబ రేగకొడుతుంది. దీంతో ఒక పక్క నయని మరోపక్క జాస్మిన్ ఇద్దరూ కూడా గాయాలపాలు అవుతారు. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు.

  నయని కాళ్ళు పట్టుకున్న విశాల్

  నయని కాళ్ళు పట్టుకున్న విశాల్

  ఇక ఈ రోజు ఎపిసోడ్ లో తన కాళ్లకు గాయాలు కావడంతో నయని కాళ్ళకు పసుపు పూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన విశాల్ భార్య కాళ్ళకు పసుపు రాయడానికి సిద్ధమవుతాడు. మీరేంటి నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ? ఇదంతా ఏమి వద్దు అని చెబుతున్నా వినకుండా విశాల్ తన భార్యనే అనే ఉద్దేశంతో ఆమెకు సేవలు చేస్తాడు. తానేమీ అమ్మ వారి కాళ్లు పట్టుకోవడం లేదని తన భార్య కాళ్ళు పట్టుకుంటా అని చెబుతూ ఆమె కాళ్ళకు పసుపు కాస్త ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తాడు. అంతేకాక తనకు తన భార్య అంటే అంత ప్రేమ ఉందని విషయాన్ని వెల్లడిస్తాడు.

  పూనకం నాటకం

  పూనకం నాటకం

  తనకు దేవుడంటే కోపమే కానీ అసహ్యం కాదని, తన తల్లి చనిపోయినా సరే తను ఎన్ని కోరికలు కోరి నా దేవుడు ఒక్క దాన్ని కూడా పట్టించుకోలేదు కాబట్టి తనకు దేవుడంటే కోపం అంతే తప్ప మీ అందరినీ బాధపెట్టే ఉద్దేశం లేదని చెబుతాడు. ఇక మరోపక్క గంగయ్య దగ్గరకు ప్రసాదం తీసుకుని వెళ్ళి ఇస్తుంది హాసిని. ఇంతలో గంగయ్య ఏం జరిగింది అని అడుగుతాడు. శివ కూడా రావడంతో అసలు నయనికి ఎవరు అలా చేశారు ? అనే విషయం మీకు తెలియలేదా ? అమ్మవారు పూనితే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అని ప్రశ్నిస్తాడు. అయితే తనకు అమ్మ వారి పూనలేదని చెల్లి అలా బాధపడుతుంటే చూడలేక జాస్మిన్ ఇలా చేసి ఉంటుందని భావించి పూనకం వచ్చినట్లు నాటకమాడి ఆమె పని పట్టాను అని చెబుతుంది.

  బలవంతం చేసిన సుమన

  బలవంతం చేసిన సుమన

  ఇక మరోపక్క నయని విశాల్ దగ్గరకు వెళ్లి నల్లటి బొట్టు పెడుతుంది. ఈ నల్లని బొట్టు ఏమిటి అన్ని విశాల్ ప్రశ్నించగా దానికి సంబంధించిన వివరాలను అంతా చెప్పుకొస్తోంది ఆమె. తాను కూడా దిష్టి బొట్టు పెడతానని చెప్పి నయనిని దగ్గరకు తీసుకుని విశాల్ ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదంతా ఇలా ఆసక్తికరంగా సాగుతూ ఉండగా సుమన వేప కాయ జ్యూస్ తీసుకువెళ్లి విక్రాంత్ చేత బలవంతంగా తాగిస్తుంది. తాను వద్దు అని చెప్పినా వినకుండా బలవంతం చేసి మరీ పట్టిస్తుంది.

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
   ఏం జరగబోతోంది

  ఏం జరగబోతోంది

  ఇక మరో పక్క గంగయ్య తో విశాల్ తండ్రి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు యుద్ధం చేస్తున్నది ఒక రాక్షసితో అని చెబుతూ ఉంటే తాను యుద్ధం చేసేది తన భార్యతోనే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ విషయాలు బయట పెట్టలేకపోయాను ఇప్పుడు అసలు బయటపడలేక పోతున్నా అని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

  షష్టి పూర్తికి గాయత్రి ఎంట్రీ

  షష్టి పూర్తికి గాయత్రి ఎంట్రీ

  అయితే రాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో మాత్రం ఆసక్తికరం ఎలిమెంట్స్ చూపించారు. ఇంట్లో అందరూ భోజనం చేస్తున్న సమయంలో జగదీష్ షష్టిపూర్తి కి సంబంధించిన విషయం చర్చకు వస్తుంది.. అయితే ఈ విషయంలో ఆనందం పట్టలేని నయని జగదీష్ బాబు షష్టి పూర్తికి గాయత్రి అమ్మగారు వస్తాను అన్నారని, ఈ విషయం తనతో చెప్పారు అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. విశాల్ కూడా అనుమానంగా చూస్తూ ఉండగా మిగతా వాళ్ళందరూ లైట్ తీసుకోమన్నట్లు సూచిస్తూ తిలోత్తమ అన్ని సవ్యంగా జరుగుతాయని ఎవరు ఏర్పాట్లు వారు చేయాలని అంటుంది.

  ఏం జరగబోతోంది

  ఏం జరగబోతోంది

  అయితే ఆ సమయంలో పీటల మీద కూడా మీరు కూర్చోవాల్సిన అవసరం లేదని పీటల మీద కూడా గాయత్రి అమ్మగారే కూర్చుంటారు అని చెప్పి పెద్ద బాంబు పేల్చింది త్రినయని. మొత్తం మీద తర్వాత ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా సాగే లోనే కనిపిస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేయగా ఈ ప్రోమో కూడా వైరల్ అయింది. అయితే గాయత్రీ వస్తోంది అనే విషయం తెలుసుకున్న విశాల్ కూడా ఆనందపడతాడు. అయితే తన భార్య ఈ విషయాలు చెప్పడం విని కాస్త షాక్ అవుతాడు. చూడాలి తదుపరి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Trinayani Episode ( 373 ): Vishal applies turmeric to the wounds on Nayani’s feet. Hasini tells Gangayya why she hit Jasmine with a whip. Nayani wards off the evil eye on Vishal. Sumana forces Vikrant to drink neem juice.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X