For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani 6th August Episode : తిలోత్తమ పెర్ఫ్యూమ్ స్కెచ్.. బుట్టలో పడిన సుమన.. ఏమైందంటే?

  |

  తెలుగు సీరియల్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. మంచి టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకోవడంతో ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండే లాగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే విధంగా తెలుగులో త్రినయని సీరియల్ కూడా జీ తెలుగు చానల్లో ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ కూడా అత్యధిక రేటింగ్స్ తెచ్చుకుంటూ టాప్ లిస్టులో చోటు సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో ఏం జరుగుతోంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  photos courtesy : zee telugu+ zee5 app

  షష్టిపూర్తి పనుల్లో

  షష్టిపూర్తి పనుల్లో

  నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే జగదీష్ షష్టిపూర్తికి గాయత్రి అమ్మగారి ఆత్మ వస్తోందని చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా కలకలం రేగుతోంది. కొంతమంది నయని చెప్పిన మాటలు నమ్ముతూ ఉంటే కొంతమంది మాత్రం ఇదంతా ఒట్టి ట్రాష్ అన్నట్లు భావిస్తూ ఉంటారు.. అయితే విశాల్ మాత్రం ఈ విషయంలో ఆనంద పడుతూ ఉంటాడు.

  మరో పక్క తిలోత్తమ మాత్రం నయని జాతకం చూస్తే ఆమెకు ఇలా ఎన్ని శక్తులు ఎందుకు వచ్చాయి అనే విషయం తెలుస్తుంది అని భావించి ఆ జాతకం సంపాదించే పనిలో పడుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా చూపించారు. అయితే అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది.

  పర్ ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్ గా

  పర్ ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్ గా

  ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం సుమన తన గదిలో మేకప్ వేసుకుంటూ పెదాలకు రంగు పూసుకుని తనను తానే అద్దంలో చూసుకుంటూ మురిసిపోతోంది. విక్రాంత్ బావతో తన పెళ్లి ఎప్పుడు అవుతుందో ? ఎప్పుడు ఆనందంగా గడుపుతానో అంటూ ఊహల్లో తేలిపోతూ ఉన్న సమయంలో తిలోత్తమా సుమన దగ్గరకు వచ్చి కాస్త ప్రేమ ఒలకబోస్తూ నయని జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

  అయితే ఆ జాతకం ప్రస్తుతానికి తన దగ్గర లేదని ఊర్లో ఉందని సుమన చెబుతుంది. అయితే అక్కడ వరకి వెళ్లి తీసుకురావాలా అంటే అవసరం లేదని ఆమె జాతకం తనకు కంఠస్థం వచ్చని చెబుతుంది. సుమన. అయితే తమ పని జరుగుతోంది అన్న ఆనందంలో ఆమె కోసం ఒక పర్ ఫ్యూమ్ బాటిల్ కూడా గిఫ్ట్ గా ఇస్తుంది తిలోత్తమ అతి త్వరలోనే మీ కోడల్ని కాబోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

  తల్లి నీ కడుపున

  తల్లి నీ కడుపున

  మరోపక్క విశాల్ కి నయని కాఫీ తీసుకు వస్తుంది. ఈ లోపు విశాల్ ఏదో రాసుకుంటూ ఉంటాడు. ఏం రాసుకుంటున్నారు ? అంటే షష్టిపూర్తికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నా అని అంటాడు. అయితే తల్లి వస్తుందన్న విషయం నిజమేనా అని మళ్ళీ అడుగుతాడు. అలా ఎందుకు అడుగుతున్నారు నా మాట మీద నమ్మకం లేదా అంటే కచ్చితంగా నమ్ముతున్నానని అయితే ఈ సారి తల్లి రావడం రాకపోవడం అనే విషయం మీద చాలా ఆసక్తి గా ఉన్నాను అని అంటాడు..

  ఎందుకంటే తనకు తల్లి ని చూడాలని లేదని కానీ నీ మాట పోకూడదు అనే విషయం మాత్రం గట్టిగా అనిపిస్తోంది అని అన్నాడు. అంతేకాక ఇక తనకు తన తల్లి నీ కడుపులో పుట్టించాలి ఉందని నువ్వు ఒక అమ్మాయికి జన్మనిస్తే చూడాలని ఉంది అని అంటాడు.

  గంగయ్య సీక్రెట్

  గంగయ్య సీక్రెట్

  ఇక మరోపక్క గంగయ్య నడుచుకుంటూ వెళ్తుంటే జగదీష్ వెళ్లి నువ్వు ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేయవద్దని ఆ ప్రయత్నాలు చేస్తూ దొరికిపోతే ఇంకా ఎక్కడా కనబడకుండా చేస్తారు అని హెచ్చరిస్తాడు. అయితే తప్పు చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటే తాను మాత్రం ఇబ్బందులు పడాలా అని ప్రశ్నిస్తాడు. అంతేకాక తాను ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటాడు.

  అయితే తన మాట విని కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉండాలని జగదీష్ కోరతాడు. అయితే వీళ్లిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం మరోపక్క హాసిని వింటూ ఉంటుంది. అయితే ఈ విషయం తనకు మాత్రమే కాక వీళ్ళిద్దరికీ కూడా తెలుసని, దూకుడు సినిమాలో బ్రహ్మానందం నటించినట్టు ఎవరికి వాళ్లు నటిస్తున్నారని అంటుంది. ఈ తంతు ముగిసిన తర్వాత షష్టిపూర్తికి కావలసిన విషయాలను రాసుకుంటూ ఉంటుంది.

  జాస్మిన్ వేసిన ప్లాన్ ఏంటి ?

  జాస్మిన్ వేసిన ప్లాన్ ఏంటి ?

  ఇంతలో శివ వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉండగా దురంధర రావడంతో శివ కోపం వచ్చి ఈ వయసులో నీకు తలకి రంగు, ముఖానికి మేకప్ కావాలా ఇలా తిప్పుకుంటూ తిరిగితే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అందరూ అనుకుంటారు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. ఆమె లేచి దాడి చేయకపోతే హాసిని ఆపడంతో వెనక్కి వెళ్లి పోతుంది. మరోపక్క నయని పనిలో ఉండగా జాస్మిన్ అక్కడికి వెళ్లి ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

  మామూలుగా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నువ్వు గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండీవి అని ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ పని మనిషి అని ఇలా మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.. అయితే నయని మాత్రం ఏమాత్రం సంయమనం కోల్పోకుండా తన పని తాను చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ జాస్మిన్ ఏదో ప్లాన్ లోనే వచ్చి ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి జాస్మిన్ వేసిన ప్లాన్ ఏంటి ? ఎందుకు అలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది ? అనే విషయాలు తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగక తప్పదు.

  English summary
  Trinayani Episode 376 : Tilottama asks Sumana for Nayani’s horoscope in an effort to know her secret power. Vishal tells Nayani that he wants them to have a daughter. Hasini listens to Gangayya and Jagadish’s conversation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X