పవిత్ర మా కాపురంలో చిచ్చు.. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండానుకొన్నా.. కానీ అంటూ కన్నీరుమున్నీరైన చందు భార్య
త్రినయిని సీరియల్ నటులు పవిత్ర జయరాం, చందు మరణాలు టెలివిజన్ ఇండస్ట్రీని కుదిపేసింది. పవిత్ర జయరాంతో ఆరేళ్ల సహజీవనం చందు మొదటి భార్యకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పవిత్ర జయరాం మరణం తర్వాత తాను మారుతాడని అనుకొన్నాను. కానీ ఆయన ఇలా చేసుకొంటాడని అనుకోలేదు అని మొదటి భార్య శిల్ప ఆవేదన చెందింది. సీరియల్ యాక్టర్ చందు శుక్రవారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకొని మరణించడం తెలిసింది. ఈ విషాద సమయంలో భార్య శిల్ప మాట్లాడుతూ..
మాది 11 ఏళ్ల అఫైర్ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకొన్నాం. చాలా సంవత్సరాలు మా మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కన్నయ్య.. కన్నా అంటూ పిలిచేవాడు. షూట్ అయిపోయిన తర్వాత కూడా స్టార్ట్ అవుతూ.. 20 నిమిషాల్లో వచ్చేస్తా.. ఫోన్‌లో లైన్‌లో పెట్టి మాట్లాడుతూ వచ్చేవాడు. అలాంటి వ్యక్తి మాకు అందనంత దూరంగా వెళ్లిపోయాడు అని శిల్ప చెప్పింది.

పవిత్ర జయరాంతో ఇలాంటి అఫైర్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. నేనే లోకమని భావించే నా భర్త చందు నా ముఖం చూడటం కూడా అసహ్యం అనేంతగా మారిపోయాడు. పవిత్ర కారణంగానే ఇది జరిగింది. ఆమెతో పరిచయం వల్లే మా మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. ఆమె కారణంగానే చందు నాకు దూరమయ్యాడు అని చందు భార్య శిల్ప కంటతడి పెట్టింది.
పవిత్ర జయరాంతో అఫైర్ తర్వాత ఆయనను నేను చాలా మారాలని ప్రయత్నం చేశాను. నా జీవితాన్ని ఇలా చేస్తావా? అని ఆయనను కూడా ప్రశ్నించాను. మాకు ఎనిమిదేళ్ల ఒక కూతురు, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. నాతో ఉండలేని నా ముఖం మీదే చెప్పారు. దాంతో చేసేదేమీ లేక ఇక్కడ ఉండకపోయినా.. అక్కడైనా హ్యాపీగా ఉండు. ఆరోగ్యంగా ఉండమని చెప్పాను అని శిల్ప తెలిపారు.
ఒకవేళ అక్కడ సంతోషంగా ఉండలేకపోతే.. ఆమెను వదిలేసి మా వద్దకు రమ్మని చెప్పాను. కానీ మా సూచనను పట్టించుకోలేదు. మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. చివరికి ఆయన జీవితం ఇలా ముగిసిపోయింది అని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు.

పవిత్ర జయరాంతో నీ బంధం ముగిసిపోయింది. జరిగినదేదో జరిగిపోయింది. ఇక దాని గురించి నేను మాట్లాడనని పెద్దల మధ్య కూర్చోబెట్టి మాట్లాడాను. ఇక ఆ కథను వదిలేద్దాం. పిల్లల కోసమైనా ఉండు. నాకు తల్లి లేదు. నా కోసం ఉండు అంటే.. నేను ఎందుకు చస్తాను. నా పిల్లల్ని చూసుకొంటానని అన్నాడు. కానీ ఆ మాట చెప్పిన 24 గంటల లోపే ఆయన సూసైడ్ చేసుకొన్నారని శిల్ప కన్నీరుమున్నీరైంది.


Click it and Unblock the Notifications











