అలాంటి నరకం అనుభవించా.. అలా చేయడం వల్లే ఛాన్సులు.. టెలివిజన్ నటి ఆవేదన
ఇటీవల కాలంలో బుల్లితెరపై కూడా ఫేవరెటిజం, కమిట్మెంట్లు ఉంటాయనే రూమర్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్రినయని సీరియల్ తో పాపులర్ అయిన నటి పవిత్ర జయరామ్ తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నటి పవిత్ర ఇండస్ట్రీలోని పరిస్థితులను వివరించారు. కమిట్మెంట్లు, అవకాశాలు ఎలా వస్తాయి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఆమెకు తలెత్తిన ఇబ్బందులేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.
సీరియల్స్ లోకి వస్తున్నప్పుడు కూడా ఒక నెగిటివ్ టాక్ ఉంటుంది? అంటే వెనక ఎక్కువగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు లేదా కమిట్మెంట్ లాంటివి ఉండడం వల్లే అవకాశాలు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమైనా మీకు ఎదురయ్యాయా అనే ప్రశ్న ఎదురైంది పవిత్రకు.

ఆమె స్పందిస్తూ చెప్పలేకపోతున్నాను గాని చాలా ఫేస్ చేశాను. ఇండస్ట్రీ అంటే అదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నావ్ ఏం చేస్తున్నాం అనేది ఎవరికీ కనిపించదు. మాది కలర్ ఫుల్ లైఫ్ కాబట్టి వీళ్ళు ఏదో చేసి సంపాదిస్తున్నారు అని అంటారు. అలా సంపాదించిన వారు కూడా ఉన్నారు అనేది కాదనలేని నిజం అని క్లారిటీ ఇచ్చారు పవిత్ర.
మరి మీరు ఇండస్ట్రీలోకి రావడానికి ఇలా కమిట్మెంట్ వంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ముందుగా కన్నడలో తను వన్ డే ఆర్టిస్ట్ గా చేసినట్టుగా గుర్తు చేసుకున్నారు. ఆ వన్డే ఆర్టిస్టులకు సాలరీ ఏమీ ఇవ్వరని, కేవలం ఫుడ్ పెట్టి పంపిస్తారని వెల్లడించారు. ఆ తరువాత నెమ్మదిగా పవిత్ర జయరాం బాగా నటిస్తారనే పేరు రావడంతో రోజుకు రెండు మూడు సీరియల్స్ చేసేదాన్ని అని, అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా తనకు ఎక్కడా ఒక్కసారి కూడా అలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు పవిత్ర జయరాం.
అలాగే తను పేమెంట్ అస్సలు డిమాండ్ చేయనని, యాక్ట్ చేశాను మీకు నచ్చినంత ఇవ్వండి అని అంటానని వివరించారు పవిత్ర. వాళ్లకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఎక్కువగా అవకాశాలు వచ్చేవని, ఆ తర్వాత పేరు కూడా వచ్చిందని చెప్పుకొచ్చారు ఆమె. కానీ ఇండస్ట్రీలో మాత్రం అలాంటి పరిస్థితులు ఉన్నాయని ఒప్పుకున్నారు.

ఎవరైనా తెలిసిన అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తాను అంటే వద్దని చెప్తానని కామెంట్ చేశారు పవిత్ర. ఒకవేళ ఏం జరిగినా ఫేస్ చేసే ధైర్యం ఉంటేనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని, లేదంటే ఇండస్ట్రీకి దూరంగా వేరే పని చేసుకుని బ్రతకాలని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. తాను ధైర్యంగా ఫేస్ చేశాను కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అన్నారామె.
ఇక కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైనా ఉందని, కాకపోతే ఇండస్ట్రీలో మాత్రమే అది కనిపిస్తోందని, వేరే చోట్లలో కనిపించట్లేదని చెప్పుకొచ్చారు పవిత్ర. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయిందని, అయితే దానికి వాళ్ళకున్న పరిస్థితులు కూడా కారణం కావచ్చు కాబట్టి ఏమీ అనలేమని టెలివిజన్ ఇండస్ట్రీలోని పరిస్థితులను వివరించారు పవిత్ర జయరాం.


Click it and Unblock the Notifications











