For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్: యాంకర్ ప్రదీప్ పరువు తీసేసిన సీరియల్ నటి

  |

  తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో గ్లామర్ క్వీన్ల హవా కనిపిస్తోంది. ఇందులోకి ఎంతో మంది సుందరాంగులు ఎంట్రీ ఇస్తోన్న తరుణంలో క్రమంగా పోటీ పెరిగిపోయింది. ఫలితంగా ఏమాత్రం వెనుకబడినా అవకాశాలను కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతూ.. ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్ల హవా ఉన్నా.. తన ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఫలితంగా ఎన్నో షోలను ముందుండి నడిపిస్తున్నాడు. తద్వారా బుల్లితెరపై రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ సీరియల్ నటి అమ్మాయిలతో ఎఫైర్ గురించి మాట్లాడుతూ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరువు తీసేసింది. ఆ సంగతులు మీకోసం!

  అలా ఎంట్రీ ఇచ్చాడు.. ఫుల్‌గా పాపులరిటీ

  అలా ఎంట్రీ ఇచ్చాడు.. ఫుల్‌గా పాపులరిటీ

  ప్రదీప్ మాచిరాజు.. ముందుగా రేడియో జాకీగా తన కెరీర్‌ను ఆరంభించాడు. అక్కడ తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే తన అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ గాయ్.. వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. అదే సమయంలో 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ప్రదీప్.. తన హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నాడు.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

  సినిమాల్లోనూ సత్తా.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ

  సినిమాల్లోనూ సత్తా.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే వెండితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోగా మారి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ విజయవంతమైన చిత్రంలో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ దక్కింది. దీంతో మరిన్ని సినిమాలు చేయబోతున్నాడు.

  బుల్లితెరపై హవా... అన్నింట్లోనూ భాగంగా

  బుల్లితెరపై హవా... అన్నింట్లోనూ భాగంగా

  హోస్టుగా మారిన తర్వాత నుంచి ప్రదీప్ ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ఇలా అన్ని ఛానెళ్లలోనూ ఏక కాలంలో పని చేస్తున్నాడు. అన్నింట్లోనూ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 13', 'డ్రామా జూనియర్స్', 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తున్నాడు. వీటితో పాటు ఫంక్షన్లకు యాంకర్‌గా చేస్తున్నాడు.

  చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

  సీరియళ్ల మధ్య పోరాటం.. రాఖీ స్పెషల్‌గా

  సీరియళ్ల మధ్య పోరాటం.. రాఖీ స్పెషల్‌గా

  యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఆదివారం ఎలిమినేటర్ 1 ఎపిసోడ్ జరిగింది. ఇందులో ఎనిమిది టీమ్‌లు పోటీ పడబోతున్నట్లు ప్రదీప్ వెల్లడించాడు. అందుకు అనుగుణంగానే ఇందులో పలు గేమ్ షోలు నిర్వహించారు. ఇక, అదే రోజు రాఖీ పండుగ కావడంతో ఈ ఎపిసోడ్‌ను మరింత స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఇందుకోసం కొంత మంది నటీనటుల సోదర సోదరీమణులను స్టేజ్ పైకి తీసుకుని వచ్చారు. వాళ్లతో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

  హెల్ప్ చేస్తుంది కదా అంటూ ప్రదీప్ ప్రశ్న

  హెల్ప్ చేస్తుంది కదా అంటూ ప్రదీప్ ప్రశ్న

  రాఖీ స్పెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా ఓ సీరియల్ నటితో రాఖీ కట్టించుకునేందుకు వాళ్ల సోదరుడు స్టేజ్ పైకి వచ్చాడు. అప్పుడు అతడితో ప్రదీప్ 'తమ్ముడైతే అక్క హెల్ప్ చేస్తుంది కదా. నీకు ఎలా సహాయం చేస్తుంది' అని అడిగాడు. అప్పుడతను 'ప్రాజెక్ట్ వర్క్స్‌, అసైన్‌మెంట్స్ అవే కదా' అన్నాడు. దీనికి ప్రదీప్ 'అవి కాదు.. గర్ల్‌ఫ్రెండ్స్ గురించి' అని అన్నాడు. అప్పుడతను 'అవును అవును.. గర్ల్‌తో సెట్ చేయడం అలాంటివే కదా. అలాంటి మేటర్లలో మా అక్క చాలా సహాయం చేస్తుంది. అందులో కొన్ని వర్కౌట్ అయ్యేవి' అంటూ షాకింగ్ మేటర్స్ లీక్ చేశాడు.

  Aishwarya Rai Bachchan పర్సనల్ ఫొటోలు: చాలా కాలం తర్వాత ఇంత హాట్‌ ఫోజులతో రచ్చ

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్

  ఆ సీరియల్ నటి తమ్ముడు అమ్మాయిలతో ఎఫైర్స్‌కు తన అక్క సహాయం చేసేది అని చెప్పగానే యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో సహా అక్కడున్న వాళ్లంతో పగలబడి నవ్వేశారు. ఆ తర్వాత ప్రదీప్ 'ఇప్పటికీ కొన్ని ఎఫైర్స్ నడుస్తున్నాయా' అని అతడిని అడుగుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆ సీరియల్ నటి కలుగజేసుకుని 'ఒక్కొక్కరిని మెయింటేన్ చేయడం కాదు.. ఒకేసారి చాలా మందిని సమాంతరంగా మెయింటేన్ చేయాలి' అని ఎవరూ ఊహించని విధంగా మాట్లాడింది. ప్రదీప్‌కు ఒక్క ఎఫైర్ కూడా లేకపోవడంతో ఆమె అతడి పరువు తీసేసినట్లైంది.

  ప్రదీప్ పరువు గోవిందా.. జీడిపప్పు ఉందా?

  ప్రదీప్ పరువు గోవిందా.. జీడిపప్పు ఉందా?

  ఆ సీరియల్ మాట్లాడిన మాటలకు యాంకర్ ప్రదీప్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఒకటికే టికానా లేక లడ్డులో జీడిపప్పులు ఏరుకుని తింటుంటే.. ఈమె ఒకేసారి అంతమంది.. ఇంతమందిని మెయింటేన్ చేయాలని చెబుతోంది. ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలి' అంటూ ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేశాడు. అంతేకాదు, ఇంకో లడ్డులో జీడిపప్పు ఉందా అంటూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది. మొత్తానికి ప్రదీప్ తనకు గర్ల్‌ఫ్రెండ్స్ ఎవరూ లేదని ఈ షో ద్వారా పరోక్షంగా వెల్లడించాడు.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing Super Serial Championship Season 3 Show. Trinayani Actress Did Shocking Comments Love Affairs in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X