70 ఏళ్ల బామ్మలా విష్ణుప్రియ .. ఆ గెటప్ వెనుక సీక్రెట్ ఏమిటంటే?
తాము ప్రాణాలతో ఉన్నంతకాలం యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో ఇందుకోసం ఖర్చు చేసేందుకు కూడా జనం వెనుకాడటం లేదు. తెల్ల వెంట్రుకలు వచ్చినా, ముఖంపై మడతలు కనిపించినా భూకంపం వచ్చినంత పనిచేస్తున్నారు. ఇక ఏఐ టెక్నాలజీ రాకతో ప్రతి ఒక్కరూ తాము వృద్ధాప్యంలోకి వెళితే ఎలా ఉంటామో టెస్ట్ చేసి చూసుకుంటున్నారు. తాజాగా బుల్లితెర నటి విష్ణుప్రియ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విష్ణుప్రియ అంటే యాంకర్ విష్ణుప్రియ అనుకోవద్దు.. ఈమె వేరు, ఆమె వేరు . దక్షిణాదిలో సీరియల్స్, సినిమాలతో దూసుకెళ్తున్నారు విష్ణుప్రియ. అమాయకంగా, క్యూట్‌గా కనిపిస్తూ తన నటనతోనూ ఆకట్టుకుంటున్నారు విష్ణు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన విష్ణుప్రియ సినిమాలపై ఆసక్తితో చెన్నై రైలేక్కి అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేశారు. ఈ క్రమంలో 2012లో కొంజుమ్ మెయినాక్కలేలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా ఆమెకు తమిళనాడులో మంచి పేరు తీసుకొచ్చింది.

ఆ తర్వాత తెలుగులో ఈ రోజుల్లో సినిమాలో ఛాన్స్ దక్కింది. అనంతరం నేను నా ఫ్రెండ్స్, ప్రేమ కథా చిత్రం, ప్యార్ మే పడిపోయానే, బలుపు, మిస్టర్ పెళ్లి కొడుకు, పండగ చేస్కో, రొమాన్స్, పిల్లా నువ్వులేని జీవితం, రభస, రామయ్య వస్తావయ్యా తదితర చిత్రాల్లో నటించారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపైనా తన లక్ పరీక్షించుకున్న ఆమె అనుకున్నట్లుగానే ఎంట్రీ ఇచ్చారు విష్ణుప్రియ. ఈటీవీలో సుదీర్ఘకాలం ప్రసారమైన అభిషేకంలో నటించిన ఆమె తర్వాత కుంకుమ పువ్వు, ఇద్దరమ్మాయిలు, నువ్వేకావలి తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ప్రస్తుతం తెలుగు టాప్ సీరియల్స్‌లో ఒకటైన త్రినయనిలో విష్ణుప్రియ దుమ్మరేపుతున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ బుల్లితెరను కూడా ఓ చూపు చూసిన విష్ణుప్రియ.. అక్కడ ఫేమస్ ధారావాహిక నిరమ్ మారత పొక్కల్‌లో కీలకపాత్ర పోషించారు. బుల్లితెర నటుడు సిద్ధార్ధ్ వర్మతో అభిషేకం సీరియల్ సమయంలో పరిచయం ప్రేమగా మారింది. అనంతరం 2017, ఫిబ్రవరి 11న పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు అయాన్ష్ వర్మ సంతానం.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తన సీరియల్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. రెండ్రోజుల క్రితం తన 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త సిద్ధార్ధ్ వర్మతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తమ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి సందర్భాన్ని, సంఘటనను గుర్తుచేసే ఫోటోలను వదిలారు. అందులో వీరి నిశ్చితార్ధం, పెళ్లి, శ్రీమంతం , భర్త అయ్యప్పమాల వేసుకోవడం వంటి విశేషాలు ఉన్నాయి. చివరిలో మాత్రం ఓ 70 ఏళ్ల వృద్ధ జంటలా జుట్టు నెరిసిపోయి, తెల్లటి బట్టల్లో కనిపించి షాకిచ్చారు విష్ణుప్రియ - సిద్ధార్ధ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











