కుందనపు బొమ్మలా విష్ణుప్రియ .. క్లాస్ టచ్‌తో కట్టిపడేస్తోన్న బుల్లితెర బ్యూటీ
ప్రస్తుతం భారతీయ టెలివిజన్ రంగం రోజు రోజుకు వృద్ధి చెందుతోంది. సినిమాలకు మించి ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తోంది బుల్లితెర. సీరియల్స్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలతో ఏడాది మొత్తం పని కల్పిస్తూ ఎంతో మందిని కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. ఇక సీరియల్స్ కూడా గతంలో మాదిరిగా డల్‌గా ఉండకుండా చాలా సినిమాలకు మాదిరిగానే గ్రాండీయర్ లుక్‌తో, హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతూ ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంటున్నాయి.
ధారావాహికల్లో హీరోయిన్లు, ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించే ముద్దుగుమ్మల అంద చందాల ముందు సినిమా హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటారు విశ్లేషకులు. అంతలా తమ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటీలు. బుల్లితెరపై క్రేజ్ రాగానే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు ఈ భామలు. ఈ కోవలకే వస్తారు తెలుగు బుల్లితెర నటి విష్ణుప్రియ. ఈ పేరు వినగానే యాంకర్ విష్ణుప్రియ అనుకుని పప్పులో కాలు వేయొద్దు. ఈమె వేరు, ఆమె వేరు.

19 ఆగస్ట్, 1993న కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌లో పుట్టిన విష్ణుప్రియ స్థానికంగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సినిమాలపై ఆసక్తితో తొలుత చెన్నై వెళ్లి అవకాశాల కోసం ట్రై చేయగా 2012లో కొంజుమ్ మెయినాక్కలేలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమపై ఫోకస్ చేసిన విష్ణుప్రియకు ఈ రోజుల్లో సినిమాలో ఛాన్స్ దక్కింది. తర్వాత నేను నా ఫ్రెండ్స్, ప్రేమ కథా చిత్రం, ప్యార్ మే పడిపోయానే, బలుపు, మిస్టర్ పెళ్లి కొడుకు, పండగ చేస్కో, రొమాన్స్, పిల్లా నువ్వులేని జీవితం, రభస, రామయ్య వస్తావయ్యా తదితర చిత్రాల్లో నటించారు.
సినిమాలు చేస్తూనే ఆశ్చర్యకరంగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు విష్ణుప్రియ. ఈటీవీలో ప్రసారమైన అభిషేకంలో నటించిన ఆమె తర్వాత కుంకుమ పువ్వు, ఇద్దరమ్మాయిలు, నువ్వేకావలి తదితర సీరియల్స్‌లో ఆమె నటించారు. ప్రస్తుతం తెలుగు టాప్ సీరియల్స్‌లో ఒకటైన త్రినయనిలో విష్ణుప్రియ నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లోనూ ఆమె టనించారు. అక్కడ ఫేమస్ ధారావాహిక నిరమ్ మారత పొక్కల్‌లో విష్ణుప్రియ కీలకపాత్ర పోషించారు.
కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న దశలో బుల్లితెర నటుడు సిద్ధార్ధ్ వర్మతో అభిషేకం సీరియల్ సమయంలో పరిచయం ప్రేమగా మారింది. అనంతరం 2017, ఫిబ్రవరి 11న పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు అయాన్ష్ వర్మ సంతానం. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు , సీరియల్స్ గురించి అభిమానులతో పంచుకుంటారు. ఇక ఫోటో షూట్‌లతోనూ విష్ణుప్రియ కవ్విస్తుంటారు. తాజాగా రథసప్తమిని పురస్కరించుకుని తెలుపు రంగు పట్టుచీరలో నగలు పెట్టుకుని మహాలక్ష్మీలా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విష్ణుప్రియ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











