ఇక్కడేమో పద్ధతికి చీరకట్టినట్టు.. అక్కడేమో బికినీలతో రచ్చ.. ఈ సీరియల్ హీరోయిన్‌ను గుర్తించారా?
ఈ మధ్య కాలంలో ఇన్ స్టాలో రీల్స్ చేసే వాళ్లు, యూట్యూబర్స్ వంటి వాుళ్లంతా చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. గ్లామర్ పై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎలాంటి బట్టలు అయినా వేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఓసారి పద్ధతిగానే కనిపిస్తూ మరోసారి పొట్టి బట్టలతో విపరీతమై షో చేస్తున్నారు. వీళ్లే ఇలా చేస్తున్నారంటే.. ఇక సినిమాలు, సీరియల్స్ చేసే వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సీరియల్ లో క్యారెక్టర్ ను బట్టి చీరల్లో మెరిసే అనేక మంది ముద్దుగుమ్మ రియల్ లైఫ్ లో చాలా ట్రెండీగా కనిపిస్తుంటారు. అలాంటి వాళ్లలో ఒకరే త్రినయని సీరియల్ హీరోయిన్ అషిక గోపాల్ పదుకొనె. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ సీరియల్ లో పద్ధతికి చీరకట్టినట్లుగా కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అన్ని రాకల డ్రెస్ లు ధరిస్తూ షో చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ వేసుకుని మరీ బీచ్ లో రచ్చ చేసింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఆషిక గోపాల్ పదుకొనె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి ఈ సీరియల్ తోనే తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టినా.. త్రినయని సీరియల్ తోనే ఈమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. అచ్చమైన తెలుగు, పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ రచ్చ చేసింది. భవిష్యత్తు గురించే ముందే తెలిసే క్యారెక్టర్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. అయితే ఎప్పుడూ సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. మఖ్యంగా సీరియల్ లో చాలా పద్దతిగా కనిపించే ఈమె బయట మాత్రం గ్లామర్ షో చేస్తుంటుంది. ట్రెండీ వేర్ లు ధరిస్తూ.. ఎప్పుడూ కుర్రకారుకు హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో బికినీ వేసుకుని మరీ రచ్చ చేసింది.
బికినీ వేసుకున్న ఈమె పైనుంచి వైట్ షర్టు కూడా వేసుకుని.. నీళ్లలో తెగ ఆడిపాడుతూ కనిపించింది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇంత చక్కగా, గ్లామరస్ గా ఉన్న నీవు సీరియల్ లో మాత్రం ఏజ్డ్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరిలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి అయింది. గోపాల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమెకు ప్రస్తుతం 29 ఏళ్ల వయసు.


Click it and Unblock the Notifications











