For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani : విక్రాంత్ దగ్గర సుమన వయ్యారాలు..మరదలు అడిగితే కాదంటానా?, మరో స్కెచ్ రెడీ చేసిన జాస్మిన్!

  |

  జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. మొదలయ్యి ఏడాది కావస్తున్నా ఈ సీరియల్ ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించింది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  బోనాలు స్పెషల్

  బోనాలు స్పెషల్

  ఇక నిన్నటి ఎపిసోడ్ లో తన భార్య నయని మీద హత్య ప్రయత్నం జరిగిందని త్వరలోనే హత్యాప్రయత్నం చేసినవారి పట్టుకుంటానని విశాల్ హెచ్చరిస్తాడు. అయితే చంపడానికి ప్లాన్ చేయించింది జాస్మిన్ కావడంతో తిలోత్తమ, పరశురాం కాస్త రిలాక్స్ అవుతారు. అయితే జాస్మిన్ కూడా జాగ్రత్త పడి తాను పురమాయించిన యజ్ఞ, యజ్ఞ పురమాయించిన రౌడీ అందరినీ అజ్ఞాతంలోకి వమని అందుకు తగ్గ డబ్బులు నేను ఇస్తాను అని చెబుతోంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లోనే బోనాల పండుగ రావడంతో బోనాలు సమర్పించడానికి ఎవరెవరు వెళ్లాలి ?అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  మరదలు అడిగితే కాదంటానా?

  మరదలు అడిగితే కాదంటానా?

  ఇక ఈరోజు ఎపిసోడ్ లో బోనాలు సమర్పించడానికి త్రినయని ఒక్కటే వెళితే బాగోదని ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నామని చెప్పడంతో ముగ్గురు లేదా ఐదుగురు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎంతమందైనా వెళ్లండని కాకపోతే వెళ్లే వాళ్ళు ముందుగా తనకు చెబితే వాళ్ళు వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అని విశాల్ చెబుతాడు. త్రినయని చెల్లి సుమన తాను కూడా వెళతానని మంచి డ్రెస్ ఒకటి కొని పెట్టమని బావ విశాల్ ను అడుగుతుంది. అలా అడగడం తప్పు అని త్రినయని వారించే లోపు విశాల్ కల్పించుకుని మరదలు నోరు తెరిచి అడిగితే కొన్ని పెట్టకుండా ఉంటానా ? కొనిపెడతాను అని అంటాడు.

  విక్రాంత్ దగ్గర సుమన వయ్యారాలు

  విక్రాంత్ దగ్గర సుమన వయ్యారాలు

  సుమన అక్కడినుంచి విక్రాంత్ దగ్గరకు వెళ్లి నాకు చీర కొనిపెట్టమని అంటుంది. ఎందుకు ఇప్పుడు చీర అంటే బోనాల పండుగ కాబట్టి మీరు కొని పెడితే ఆనంద పడతాను అని అంటుంది. అయితే తనకు ఆడవాళ్ళ చీరలు సెలక్షన్ తెలియదని మన డ్రైవర్ లేదా ఆఫీస్ లో వ్యక్తులను పంపిస్తే వాళ్ళు తెచ్చే పెడతారని అంటాడు. మీకు ఏమీ తెలియదని బోనాల పండుగ రోజున తాను కట్టుకునే బట్టలు చూసి మీరు పడిపోతారని చాలెంజ్ చేసి వెళుతుంది. మరో పక్క జాస్మిన్ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈసారి నయనిని ఎలా దెబ్బ కొట్టాలి అనే దానిమీద స్కెచ్ వేస్తూ ఉంటుంది. ఏం స్కెచ్ వేస్తున్నాడని దురంధర అడిగితే నయని కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నా అని అంటుంది.

  తప్పుకున్న దురంధర

  తప్పుకున్న దురంధర

  నీ ప్లాన్ లు ఏవీ వర్క్ ఔట్ అవ్వడం లేదని అనవసరంగా ఎందుకు బొక్క బోర్లా పడి ఇబ్బందులు పడతావని దురంధర హెచ్చరిస్తుంది. తాను మాత్రం ఈ ప్లాన్ లో భాగంగా అయ్యేది లేదని తేల్చి చెబుతోంది. ఇక ఇది ఇలా జరుగుతుంటే మరోపక్క నయని బోనాల పండుగకు కావాల్సిన సామాన్ల లిస్టు రాస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన విశాల్ -నయని మధ్య కాస్త ఘాటు సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. పట్టపగలు అనే విషయం కూడా చూడకుండా ఈ ఇద్దరూ రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉంటారు.

  మనం చూస్తూ ఉండాలి అంతే

  మనం చూస్తూ ఉండాలి అంతే

  ఇక మరో పక్క తిలోత్తమకు ఎలా అయినా దెబ్బలు తగిలేలా చేయాలని భావించి గంగాధర్ అలియాస్ గంగయ్య ఆమె మంచం నట్లు తీయడానికి మంచం కింద దూరతాడు. అదే సమయంలో తిలోత్తమ కూడా వస్తూ ఉంటుంది. ఈసారి ఎలాగైనా నయని మీద దెబ్బ కొట్టాలని పరశురామ్ అంటూ ఉంటే మన చేతులకు మట్టి అంటకుండా జాస్మిన్ ప్లాన్ చేస్తోందని ఆ ప్లాన్ ఏమిటి అనేది మనం చూస్తూ ఉంటామని, తిలోత్తమ అంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది తెలియాలంటే రేపటి దాకా వేచి చూడాల్సిందే.

  English summary
  Trinayani Episode ( 370 ): Vishal decides to let the ladies perform ‘Bonalu’ with grandeur. Sumana asks Vikrant to give her a sari. Jasmine devises a plan to injure Nayani’s feet. Vishal and Nayani spend some romantic moments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X