For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial Today Episode august 10 : తిలోత్తమకి మరణగండం.. కాకోలా స్వామి ఎంట్రీతో నయనికి స్కెచ్!

  |

  బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా జీ తెలుగు చానల్లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. ఈ సీరియల్ లోని అంశాలు అన్నీ ఆత్మకు సంబంధించిన అంశాలు కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సీరియల్ లో త్రినయని పాత్రలో ఆషిక గోపాల్ నటిస్తుండగా విశాల్ పాత్రలో చందు గౌడ నటిస్తున్నాడు.

  జగదీష్ షష్టిపూర్తి వ్యవహారం పనుల్లో కుటుంబమంతా బిజీగా ఉంది ఈ సమయంలో నయని గుట్టు రట్టు చేసేందుకు ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనే అంశం మీద ఇప్పుడు హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆమె ఒక స్వామీజీ వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే

  Photos Courtesy: ZeeTelugu and Zee5

  కాకోలా స్వామి ఎంట్రీ

  కాకోలా స్వామి ఎంట్రీ

  అయితే ఆ స్వామీజీ తాను స్వయంగా ఆమెను చూడాలని చెప్పడంతో ఆమెను ఇక్కడ తీసుకురాలేము అని చెబుతుంది. మీరే మా ఇంటికి రావాలి అని కూడా చెబుతోంది. అయితే మీ ఇంటికి వచ్చి నేరుగా ఆమెను ప్రశ్నిస్తే మిగతా వాళ్ళు చూడరా అని ఆ స్వామీజీ ప్రశ్నిస్తాడు. ఇంతలో తన భర్త షష్టి పూర్తి వ్యవహారం గుర్తు రావడంతో వెంటనే ఇలా ఒక షష్టి పూర్తి మహోత్సవం జరుగుతుంది.

  మీరు ఆ షష్టి పూర్తి మహోత్సవానికి రావాలని ఆహ్వానిస్తుంది. ఇక ఈ దెబ్బతో త్రినయని ఆట కట్టించవచ్చు అని ఆమె భావిస్తూ ఉంటుంది. మరో పక్క విశాల్ నానమ్మ షష్టిపూర్తి కి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయా అని అడగడంతో అందరూ ఆ పనులన్నీ పూర్తయ్యాయని చెబుతారు. అయితే ఇంతకీ తంతు పూర్తి చేసే పంతులు పిలిచారా అంటే ఎవరికి వాళ్ళు మేం పిలవలేదు అంటే మేం పిలవలేదు అంటారు.

  ఇదంతా ఆపేయాలి

  ఇదంతా ఆపేయాలి

  ఈ దెబ్బతో ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తుంటే ఇదే అదునుగా భావించిన తిలోత్తమ తాను ఒక స్వామీజీని ఈ తంతు పూర్తి చేయమని పిలిచానని ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతోమంది వేచి ఉంటారు అని అలాంటిది ఆయన మన ఇంటికి వచ్చి ఈ తంతు పూర్తి చేస్తానని చెప్పడంతో తాను ఎంతో సంతోషించాను అని చెబుతోంది.

  అంతకు ముందు దురంధర, నయని కుటుంబాన్ని మళ్లీ అవమానించే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులందరూ ముక్తకంఠంతో ఎదుర్కొంటారు. మరోపక్క గంగయ్య గా మారిన గంగాధర్ తిలోత్తమ ని ఎలా చంపాలని ఒక నాటు తుపాకీ లాంటిది సిద్ధం చేస్తూ ఉంటాడు. చాలాసేపు కష్టపడి దానిని పూర్తి చేసిన తర్వాత తిలోత్తమ కు ఫోన్ చేసి ఇప్పటికైనా ఇదంతా ఆపేయాలని కోరుతాడు. అయితే మామ మామ అంటూనే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది తిలోత్తమ.. అయితే ఇంకా సేపు మాట్లాడితే అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అనే విషయం తెలుస్తుంది కదా అని పరశురామ్ అంటే ఈ ఇంట్లో నుంచి మాట్లాడినా ఒకవేళ తనను చంపడానికి ఎదురుగా రావాల్సిందే కదా అప్పుడు నేనే అతన్ని చంపేస్తాను అని అంటుంది.

  ముహూర్తబలం

  ముహూర్తబలం

  ఈ లోపు నయని దగ్గరకు ఆమె అత్తగారు గాయత్రి దేవి వస్తుంది. గాయత్రీ దేవిని చూసి ఆనందపడుతూ షష్టి పూర్తి రోజు గండం ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరగబోతోంది అని ప్రశ్నిస్తే తనకు కూడా తెలియదని ముహూర్తబలం మంచిది కాకపోవడంతో ఆ రోజు కచ్చితంగా గండం ఏర్పడే అవకాశం ఉందని అంటోంది.

  అయితే ఆ గండం ఏర్పడేది తన భర్తకెనా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే గండం ఎవరికి ఏర్పడుతుంది అనే విషయం మీద తనకు అవగాహన లేదని గాయత్రీ దేవి చెబుతుంది. ఇంతలో విశాల్ ఇచ్చిన చీర తీసుకువచ్చి గాయత్రి దేవికి ఇవ్వబోతుంది. అయితే నేను ఆత్మను అలా చీర ఎలా కట్టుకోవాలి అని ప్రశ్నిస్తుంది.

  అలా చేయమని

  అలా చేయమని

  ఇక తన ఫోటో దగ్గర ఈ చీర పెట్టి నువ్వు మనసులో గట్టిగా సంకల్పిస్తే తాను నీకు ఆ చీరలోనే కనపడతారని అప్పుడు అందరికీ నేను ఆ చీరలోనే వచ్చానని చెప్పమని అంటుంది. అలా వెల్లడించి కాసేపటికి ఆమె మాయమవుతుంది. మరో పక్క షష్టి పూర్తికి సంబంధించిన అన్ని పనులు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులు షష్టిపూర్తి మహోత్సవం మొదలయ్యే నాటికి గంగాధర్ కూడా తన పొజిషన్ సరి చేసుకుని తిలోత్తమ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

  అయితే కాకోలా స్వామి వస్తున్న విషయం తెలుసుకున్న నయనికి ఆ స్వామి ఇంటి ఆవరణలో అడుగుపెట్టగానే దుష్ట శక్తులు సమీపిస్తున్న భావన కలుగుతుంది.

  Recommended Video

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  ఆసక్తికరంగా

  ఆసక్తికరంగా

  అది ఎవరు అని చూడగా కాకోలా స్వామి అని తెలుస్తుంది అయితే నయనికి అలా ఎందుకు అనిపించింది అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద తిలోత్తమ స్కెచ్ వర్క్ ఔట్ అయినట్లు కనిపిస్తోంది. కాకోల స్వామి నయనికి మధ్య యుద్ధం జరగబోతోందని అంటున్నారు. ఇక తరువాత ఎపిసోడ్లో మొత్తం మీద ఆసక్తికరంగా సాగి పోతుందని మాత్రం చెప్పక తప్పదు.

  English summary
  Trinayani Episode (episode no 379): Tilottama invites the swami to perform the puja in the pretext of finding out Nayani’s truth. Nayani tells Gayatri’s spirit about her vision and gives her the sari. Later, swami arrives at the house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X