For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial Today Episode august 7: బాంబు పేల్చిన నయని.. టెన్షన్ లో తిలోత్తమ అండ్ కో!

  |

  తెలుగు ప్రేక్షకులలో క్రమంగా పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్స్ లో ఒకటిగా త్రినయని సీరియల్ ముందు వరుసలో నిలుస్తోంది. బెంగాలీ లో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఒక రాయల్ ఫ్యామిలీలో పనిమనిషిగా అడుగుపెట్టిన నయని ఆ రాయల్ ఫ్యామిలీకి కోడలిగా ఎలా మారింది ? ఆ కుటుంబం మొత్తానికి ఉన్న కంపెనీలకు అధిపతిగా ఎలా మారింది ? ఆమె అంత ఎదగడం నచ్చని ఆ కుటుంబ సభ్యులు కొందరు, ఆమెను అంతం చేయడానికి చూస్తున్నారు అనే కోణంలో సీరియల్ రూపొందించారు.. ప్రస్తుతం ఆమె మీద హత్యాయత్నం సహా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇతర కుటుంబ సభ్యులు. ఈ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: ZeeTelugu and Zee5 , ఫొటోస్ కర్టసీ : జీ తెలుగు అండ్ జీ5

  ఆసక్తికరంగా షష్టి పూర్తీ

  ఆసక్తికరంగా షష్టి పూర్తీ

  జగదీష్ షష్టి పూర్తికి గాయత్రి అమ్మ గారు వస్తున్నారు అని నయని చెప్పడంతో నమ్మి వాళ్ళందరూ టెన్షన్లో, నమ్మని వాళ్ళు అందరూ ఇదే ఏంట్రా బాబు అని అనుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఒకసారి విశాల్ వీడియో తీస్తూ ఉండగా ఆ వీడియోలో గాయత్రి దేవి కనపడటంతో జాస్మిన్ అయితే భయపడుతూ ఉంటుంది. నయని రెచ్చగొట్టి ఆమె నిజంగా వస్తుందా ? లేదా ? అని తెలుసుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటుంది.. అందులో భాగంగా ఆమె పని చేసుకుంటూ ఉంటే జాస్మిన్ వెళ్లి ఆమెను కావాలనే రెచ్చగొట్టి మళ్లీ ఆవిడ వస్తుందా లేదా అని ప్రశ్నిస్తుంది. ఆవిడ రావడం అయితే పక్కా అని, అయినా వస్తే నీకేంటి ? రాకపోతే నీకేంటి ? ఏదో ఇంత అన్నం తిని మూల కూర్చుని ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి అన్నట్లుగా వార్నింగ్ ఇస్తుంది. ముందు కాస్త షాక్ తిన్నా సరే తర్వాత కోలుకుని సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుంటుంది జాస్మిన్.

  సుమన మీద స్కెచ్

  సుమన మీద స్కెచ్

  ఇక మరో పక్క నయని జాతకం తెలుసుకుని ఏదైనా ప్లాన్ చేయాలని భావిస్తున్న తిలోత్తమా సుమనకి ఒక పెర్ఫ్యూమ్ ఆశ చూపి త్రినయని జాతకం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా సుమన జాతకం రాస్తూంటే విక్రాంత్ అక్కడికి వెళ్లి చూసాడు. తాను అక్క జాతకం రాస్తున్నానని మీ అమ్మ జాతకం అడిగితే రాస్తున్నానని ఆమె చెబుతుంది. వదిన జాతకం ఎందుకు అడిగింది ? మళ్ళీ వదిన మీద ఏమైనా ప్లాన్ చేస్తోందా అని అనుమానంతో విక్రాంత్ సుమనని మాటల్లో పెట్టి ఆ జాతకం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తానే స్వయంగా తల్లికి ఇస్తానని చెప్పడంతో సుమన కూడా పెద్దగా ఫీల్ అవ్వదు. ఎప్పటిలాగే వీరిద్దరి మధ్య కాస్త సరదా సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. నేను పెళ్లి చేసుకోబోయేది నిన్నే అని లోపల అనుకుంటూ ఉంటే దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ వాడు అయిపోతాడు అని అనుకుంటూ ఉంటాడు.

   అందరికీ చీరలు

  అందరికీ చీరలు

  ఇది జరిగిన తర్వాత కుటుంబంలో ఉన్న అందరిని ఒక చోట సమావేశ పరుస్తాడు విశాల్. అలాగే ఇంట్లో అందరికీ కొత్త చీరలు తీసుకు వచ్చాను అని చెబుతూ షష్టిపూర్తి రోజు ఆ చీరలు కట్టుకోవాలని కూడా చెబుతాడు.. ఒక్కొక్కరికి ఒక్కో పట్టుచీర ఇస్తూ తన భార్యకి కూడా తన తల్లి కి ఇష్టమైన రంగు చీర ప్రజెంట్ చేస్తాడు. చీర నచ్చిందా అని ఆమెను అడిగితే మీరు ఏది ఇచ్చినా తనకు నచ్చుతుందని ఆమె చెబుతుంది. ఇక ఇంతలో తనకు ఇచ్చిన చీర కట్టుకొని వచ్చే గాయత్రి దేవి గారికి ఇస్తానని ఆవిడే స్వయంగా చీర కట్టుకుని వస్తోందని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

   బాంబు పేల్చిన నయని

  బాంబు పేల్చిన నయని


  మరీ ముఖ్యంగా తిలోత్తమ, దురంధర అయితే ఇదంతా బూటకం అని కావాలని నయని ఇలా మాట్లాడుతుంది అన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే తిలోత్తమా ఏకంగా అసలు తనకి ఈ పద్ధతి నచ్చలేదు అని అంటుంది అంతేకాక ఆ ప్లేస్లో కూర్చునేది నేనే కాబట్టి ఆ చీర నాకు ఇవ్వాలని కూడా అంటుంది. కానీ మీరు అలా చేయడం భావ్యం కాదని గాయత్రీ దేవి గారు వస్తారు అనేది తన నమ్మకం అని నా నమ్మకం మీద మీరు దయచేసి ఎలాంటి కామెంట్లు చేయొద్దు అని నాయని కోరుతుంది..

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
  అక్క మీద సుమన కోపం

  అక్క మీద సుమన కోపం

  అయితే తిలోత్తమా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సుమన తిలోత్తమ బాధపడింది అనే ఉద్దేశంతో ఎందుకలా మాట్లాడుతున్నావ్ అక్క అంటే నేను నిజమే చెబుతున్నాను అని ఏం జరుగుతుందో వేచి చూడాలని అంటుంది. అయితే సుమన అక్క మీద కోప్పడటం చూసి విశాక్ సుమన మీద కోప్పడతాడు. దయచేసి అలా మాట్లాడవద్దని ఏం చెబితే అది జరుగుతుందని అంటూ ఉంటాడు. ఎలా వస్తుందో ? ఎలా కట్టుకుంటుంది అనేది తనకు తెలియదు కానీ గాయత్రి గారు రావడం ఖాయం అని నా మనసు ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పదు అని నయని తేల్చి చెబుతోంది. మరి గాయత్రీదేవి వస్తుందని అంతా నమ్మకంతో నయని చెప్పడంతో తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే దాని మీద ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. మరి చూడాల్సి ఉంది లో ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Trinayani Episode (episode no 377): When Sumana writes down Nayani’s horoscope, Vikrant takes it from her. Later, Vishal gives new saris to all the ladies. Nayani wishes to give her sari to Gayatri as it’s her favourite colour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X