Trinayani Serial Today Episode august 9 : నయని గుట్టురట్టుకి ప్లాన్.. సుమన సాయంతో తిలోత్తమ స్కెచ్!

తెలుగులో సీరియల్స్ మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలు పెద్దగా ఆసక్తికరమైనవి రాక పోవడంతో ఇళ్లకే పరిమితమైన తెలుగు ప్రేక్షకులందరూ సీరియల్స్ మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే త్రినయని అనే సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతూ ఉండగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. ఒక రాచ కుటుంబం నేపథ్యంలో దేవి దేవతలు, ఆత్మలతో మాట్లాడే శక్తులు ఉన్న ఒక సామాన్య యువతి ఎలా కోట్ల అధిపతి అయింది అనే అంశంతో సీరియల్ రూపొందిస్తున్నారు. సీరియల్ కి సంబంధించిన తాజా ఎపిసోడ్ లో నయని తన అత్త గాయత్రీ దేవి షష్టిపూర్తి మహోత్సవానికి ఆత్మ రూపంలో వస్తోందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

Photos Courtesy: ZeeTelugu and Zee5 , ఫొటోస్ కర్టసీ : జీ తెలుగు అండ్ జీ5

జాతకం అయినా

జాతకం అయినా

అయితే ఇంట్లో అందరూ ఆమెను ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తారు. సొంత చెల్లెలు కూడా ఇంట్లో అందరికీ కోపం తెప్పించకు అక్క, ఎందుకు ఇలా చేస్తున్నావు ? అంటూ అనడంతో భర్త ఆమెకు ధైర్యం చెబుతాడు.. ఇక అక్కడితో మొన్నటి ఎపిసోడ్ పూర్తి కాగా నేటి ఎపిసోడ్ లో సుమన రాస్తున్న జాతకం తీసుకున్న విక్రాంత్ ఆ జాతకం ఎందుకు రాయించారు ? ఎందుకు వదిన ని మళ్లీ మళ్లీ టార్గెట్ చేస్తున్నారు అని తల్లితోనూ తన మామతో గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ముందు కొడుకుని భయ పెడదామనుకున్న తిలోత్తమ, కొడుకు భయపడకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? తనకి ఎదురు చెబుతున్నాడు ఏమిటి ? అని ఆలోచనలో పడుతుంది.

 తెగేదాకా లాగడం కరెక్ట్ కాదు

తెగేదాకా లాగడం కరెక్ట్ కాదు

వెంటనే సుమన వ్యవహారం గుర్తొచ్చి మీరిద్దరూ రాసుకుపూసుకు తిరుగుతున్నారు ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ?అన్నట్లు మాట్లాడడంతో విక్రాంత్ వెనకడుగు వేస్తాడు. తనకు సుమన మీద ఎలాంటి ఉద్దేశాలు లేకపోయినా ఇలా ఇవన్నీ తీసుకు వెళ్ళి ఆమెను అడిగితే ఆమె బాధ పడుతోందని, ఏడుస్తుంది అని విషయమంతా ఇంట్లో పెద్ద అవుతుందని భావిస్తాడు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ జాతకం అసలు ఎందుకు అని అడుగుతాడు. ఆమె జాతకం తో పూజలు చేయించాలని అందుకే జాతకం తీసుకున్నామని తిలోత్తమ కొడుకుకు చెబుతుంది. దీంతో తెగేదాకా లాగడం కరెక్ట్ కాదని భావించి విక్రం అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటాడు.

 ఆరునూరైనా వచ్చితీరుతుందని

ఆరునూరైనా వచ్చితీరుతుందని

ఇక మరో పక్క హాసిని, జాస్మిన్, దురంధర మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. షష్టిపూర్తికి కచ్చితంగా గాయత్రి దేవి వస్తుందా అని అడిగితే ఆరునూరైనా వచ్చితీరుతుందని అని హాసిని చెబుతోంది. అలాగే విశాల్ మూడు కోట్ల రూపాయల సరుకు తెప్పించాము కదా మరో రెండు కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఎందుకు సరుకు తెప్పించావు అని భార్యను అడుగుతాడు. అయితే విషయం అంత క్లారిటీ గా చెప్పిన భార్య రాబోయేది వర్షాకాలం కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అని అందుకే ముందు స్టాక్ తెచ్చి పెట్టుకుంటే, ఎంత భారీ వర్షాలు కురిసినా ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవచ్చు అని ఆమె చెబుతుంది. అలాగే వర్కర్లకు ఎందుకు బోనస్లు ఇచ్చావు అని అడిగితే దానికి కూడా కారణం చెప్పి విశాల్ కి స్వీట్ షాక్ ఇస్తుంది. తన భార్య ఇంత బాగా ఆలోచిస్తుందని ఆయన మురిసిపోతూ ఉంటాడు.

ముందే గండం

ముందే గండం

మరోపక్క ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే ఆమెకు షష్టిపూర్తి రోజు ఏదో గండం ఉన్నట్లు భవిష్యత్ వాణి వినిపిస్తుంది. ఏమైంది అని భర్త అడిగితే భర్త కంగారు పడతానని ఎలాంటి విషయాలు బయట పెట్టదు. అయితే విశాల్ కు మాత్రం ఏదో జరిగింది అనే అనుమానం రావడం మనకు కనిపిస్తుంది. ఇక జాతకం తీసుకు వెళ్ళిన తిలోత్తమ-పరశు రామ్ లు ఒక జ్యోతిష్యుడు దగ్గర కూర్చుని ఆమె జాతకాన్ని పరిశీలించిన మని కోరతారు. ఆ జాతకాన్ని ఎంతోసేపు పరిశీలించిన జ్యోతిష్యుడు ఇది బంగారు జాతక మరి ఇలాంటి జాతకం కోట్లల్లో ఒక్కరు ఉంటుంది అని చెబుతాడు. అయితే అసలు ఈ జాతకం ఎందుకు తీసుకువచ్చారు ? అని ప్రశ్నిస్తే ఈ జాతకంలో ఉన్న వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పాలని ఇద్దరూ కోరతారు.

Recommended Video

Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
నయని గుట్టు రట్టు

నయని గుట్టు రట్టు

అయితే ఆమెకు భవిష్యత్తు విషయాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి అని అది ఎలా జరుగుతుందో తమకు అర్థం కావడం లేదని అంటారు. అయితే తాను మనిషిని చూస్తేనే గాని చెప్పలేం అని చెప్పడంతో పాటుగా ఆమెను మీరు ఇక్కడికి తీసుకు రావాలని కోరాడు. అయితే ఆమెను ఇక్కడికి తీసుకు వస్తే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుందని అలా కాకుండా మీరే మా ఇంటికి వస్తే పెద్దగా ఎవరికీ అనుమానం రాదని తిలోత్తమ అంటుంది. అయితే తాను మీ ఇంటికి వచ్చి ఇంట్లో అందరి ముందు అడిగినా అదే అనుమానం వస్తుంది కదా అని జ్యోతిష్యుడు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ మాటలు విన్న తిలోత్తమ పరశురాం కూడా ఆలోచనలో పడతారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే ఆలోచనలో ఇద్దరూ పడినట్లుగా చూపించారు. ఇది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తోంది కానీ త్రినయని కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X