Trinayani Serial Today Episode July 17: ఆత్మతో మాట్లాడుతున్న నయని.. టెన్షన్ లో తిలోత్తమ అండ్ కో!

తెలుగు లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో త్రినయని కూడా ఇప్పుడు ముందు వరుసలో ఉంటుంది. బెంగాలీ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన త్రినయని సీరియల్ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.. చందు గౌడ, ఆషికా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ లో నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: ZeeTelugu and Zee5

నిన్న ఏమైందంటే

నిన్న ఏమైందంటే

నిన్నటి ఎపిసోడ్ ప్రకారం నయని - విశాల్ శోభనం కోసం సిద్ధం చేస్తారు. శోభనం గదిలో ఉండగా అనుకోకుండా విశాల్ కాలికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి. దీంతో శోభనం అంతా అప్ సెట్ అవుతుంది.. హాసిని బాధపడుతూ విశాల్ ని చూడడానికి వెళ్లబోతే దురంధర, జాస్మిన్ ఇద్దరూ అడ్డుకుని ఇప్పుడు చూడాల్సింది విశాల్ ముఖం కాదని బాధపడుతున్న నయని ముఖం చూడాలని అంటారు. దీంతో వాళ్ళ అందరి నోళ్ళు మూయించే లాగా నయని తలుచుకుంటే మనం ఎవరినీ ఇక్కడ ఉంచదు అని ఆమె మంచితనం వల్లే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని హాసిని చెబుతుంది.

తిలోత్తమ ఆఫీస్ ప్లాన్

తిలోత్తమ ఆఫీస్ ప్లాన్


ఇక నేటి ఎపిసోడ్ లోకి వచ్చేటప్పటికి విశాల్ కాలికి గాయం కావడంతో పొద్దున్నే అందరూ విశాల్ ను పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశాల్ ఆఫీస్కి వెళ్లడం లేదు కాబట్టి తాను ఆఫీసుకు వెళ్లి అన్ని చూసుకుంటానని తిలోత్తమ చెబుతుంది.. అయితే ఒకసారి బయటికి గెంటేశాక కూడా తిలోత్తమ వెళ్లడానికి ప్రయత్నిస్తుందని తాను అనుకోవడం లేదని విశాల్ తండ్రి చెబుతాడు. అయితే విశాల్ ఆరోగ్యం బాలేదు కాబట్టే తాను వెళ్లి చూసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడటం లేదని తాను వెళతానని ఉంటుంది.

నయనికి కొత్త బాధ్యతలు

నయనికి కొత్త బాధ్యతలు


ఇంతలో విశాల్ అనూహ్యంగా మీరు వెళ్లాల్సిన అవసరం లేదని ఆఫీస్ కి వెళ్లి నయని మేనేజ్ చేస్తుందని చెప్పడంతో అందరూ షాక్ కి గురి అవుతారు. నాకేమీ తెలియదని తిలోత్తమ అమ్మగారు వెళ్లడమే కరెక్ట్ అని నయని చెబుతూ ఉండగా అది ఏమీ కాదని నువ్వు కూడా పని నేర్చుకోవాలని ఎన్నాళ్లు అమ్మా నాన్నలని ఇబ్బంది పెడతామని విశాల్ అంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా హాసిని కూడా నువ్వు ఆఫీస్ కి వెళితే తిలోత్తమ ఇంట్లో పనులన్నీ చూసుకుంటుందని విశాక్ కి కాఫీ కావాలంటే కాఫీ, అన్నం అయితే తినిపించి మరి జాగ్రత్తగా చూసుకుంటుంది అని అంటుంది.

సుమ హనీమూన్ శారద

సుమ హనీమూన్ శారద


అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో సుమ బుల్లిబావతో మళ్లీ మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. అతనికి కాఫీ తీసుకు వెళ్లి ఇచ్చి మాట కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మాటల మధ్య లో నీకు హనీమూన్ కి సమయం దగ్గర పడిందని ఆమె ఆట పట్టిస్తాడు. దీంతో హనీమూన్ అంటే ఏమిటో చెప్పాలని పట్టుబడుతుంది. ఇక వీరిద్దరి మధ్య ఈ సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. ఈ సంభాషణ ముగిసేటప్పటికీ నయని తిలోతమకి మరో షాక్ ఇస్తుంది

విషం కలిపారని

విషం కలిపారని


మీ దృష్టికి తీసుకురావాలని చెబుతున్నాను అంటూ శోభనం రోజు రాత్రి పాలల్లో విషం కలిసిందని అదృష్టవశాత్తు ఆ పాలు నేలపాలయ్యాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడలేదు అని అంటుంది. మీకెలా తెలుసు అని అడిగితే తనకు తెలిసిందని ఎలా అయితే తాను ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు ఆయన మీద విష ప్రయోగం జరిగిందో అలాగే మళ్ళీ విషప్రయోగం జరిగిందని అంటుంది.

విషం కాదది

విషం కాదది

దీంతో ఇదంతా జాస్మిన్ పని అని భావించి వెళ్లి ఆమె చెంప పగలగొడటుంది తిలోత్తమ. అయితే తాను విషం కలపలేదని కేవలం మత్తు ముందు మాత్రమే కలిపానని చెబుతుంది. అయితే అసలు ఈ విషయం అంతా ఎలా తెలిసిందా అని ఆలోచిస్తే గాయత్రి ఆత్మ ఆమెతో మాట్లాడుతుందని అనుమానం వ్యక్తమవుతోంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది తెలియాలంటే సోమవారం బాగా దాకా ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X