For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial Today Episode July 19: నయనికి పెను గండం.. అనుమానం విశాల్.. తిలోత్తమకి కొత్త టెన్షన్!

  |

  తెలుగు లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో త్రినయని కూడా ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. బెంగాలీ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన త్రినయని సీరియల్ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. చందు గౌడ, ఆషికా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ లో నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  Photos Courtesy: ZeeTelugu and Zee5

  చివరి ఎపిసోడ్ లో

  చివరి ఎపిసోడ్ లో

  శనివారం ఎపిసోడ్ ప్రకారం నయని - విశాల్ శోభనం ఫెయిల్ అవుతుంది. దీంతో ఇంట్లో అందరూ విషాదంలో మునిగి పోతారు. అయితే ఇదే అదునుగా భావించి తిలోత్తమ ఆఫీస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తే విశాల్ అందుకు అడ్డుపడి నయని ఆఫీస్‌కి వెళుతుందని ఆమె ఆశల మీద నీళ్లు చల్లుతాడు.

  ఇక విశాల్ రెస్ట్ తీసుకుంటుండగా మిగతా ఫ్యామిలీ అంతా త్రినయని ఏం చేయబోతోంది అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాక త్రివేణి తమ మీద విష ప్రయోగం జరిగినట్లు తిలోత్తమకి కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన తిలోత్తమ వెంటనే వెళ్ళి జాస్మిన్ చెంప పగలగొడుతుంది.ఇక్కడితో శనివారం ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

  సుధ ఆత్మ హెచ్చరికలు

  సుధ ఆత్మ హెచ్చరికలు

  ఇక నేటి ఎపిసోడ్ లోకి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా జరిగిందని త్రినయని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సుధా ఆత్మ నయనికి కనిపించి కొన్ని తీవ్ర హెచ్చరికలు చేస్తుంది. ఈ యింట్లో విశాల్ సహా ఎవరికి ఏం జరిగినా నా వెంటనే రెస్పాండ్ అయ్యి కాపాడుకోవడానికి నువ్వు ఉంటావని వాళ్ళందరి గురించి ముందే నీకు తెలుస్తుంది అని చెబుతుంది.

  అయితే ఒకవేళ నీకు ఏదైనా ఆపద వస్తే అది, ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా వస్తుందో ఎవరు ఊహించలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సుధా ఆత్మ నయనిని హెచ్చరిస్తుంది. ఇక నయని కూడా తనకు ఆపద వస్తే ఎలా వస్తుందో చెప్పాలని సుధను బతిమిలాడితే కేవలం హెచ్చరించడం వరకే తన శక్తి అని తర్వాత ఎలా తప్పించుకుంటారు అనేది నీ యుక్తి అని చెప్పి అంతర్ధానం అవుతుంది.

  తిలోత్తమకి విశాల్ మొర

  తిలోత్తమకి విశాల్ మొర

  ఇక ఇది ముగిసిన వెంటనే విశాల్ తిలోత్తమ గదికి వెళ్లి నయని గురించి కొన్ని విషయాలు పంచుకుంటాడు.. ఆమె తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని ఇంటి పని వంట పని అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకున్నా ఎందుకు తామిద్దరం కలిసే విషయానికి వస్తే ఆమె మనసు మారిపోతుందని ఏదో ఒక వంకతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందని అనుమానం వ్యక్తం చేస్తాడు. మొదటి రాజు రాత్రి కూడా అలా జరిగిన తర్వాతే తన కకాలలో గాజు పెంకులు దిగాయని అంటాడు.

  అచ్చంకాయల్లో

  అచ్చంకాయల్లో


  అయితే అసలు విషయం ఏమిటో తను కనుక్కుంటాను అని తిలోత్తమ అంటుంది. అయితే నయనిని నేరుగా అడగవద్దని నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందామని విశాల్ అంటాడు. ఇక మరోపక్క హాసిని నయనిని తీసుకువెళ్లి అచ్చం కాయలు ఆడే పనిలో పడుతుంది.. అలా ఆడుతున్న క్రమంలో విశాల్ సహా కుటుంబం అంతా వచ్చి చేరుతుంది..

  కితాబులు

  కితాబులు

  నయని బాగా ఆడుతుందని విశాల్ మెచ్చుకుంటుంటే మిగతా కుటుంబ సభ్యులు మాత్రం ఇలా పల్లెటూరి లాగా ఇంట్లో ఆడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పెద్దమ్మ కూడా అలా ఆడడం తప్పేమీ కాదని అలా ఆడితే ఒంటికి వ్యాయామం అయినట్లు ఉంటుందని చెబుతోంది.. అయితే ఇలా జరుగుతున్న క్రమంలోనే జాస్మిన్ కూడా అక్కడికి వస్తుంది.

  పోటీ

  పోటీ


  అయితే జాస్మిన్ కి నయనికి మధ్య పోటీ పెట్టాలనే వాదన నెలకుంటుంది. హాసిని ఆసక్తికరమైన పందెం ఒక దానిని జాస్మిన్ నయని మధ్య ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. అదేమిటంటే జాస్మిన్ నయనిని ఎత్త గలిగితే నయని ఓడిపోయినట్లే అని హాసిని పందెం కడుతుంది ఇంట్లో వారందరూ కూడా జాస్మిన్ ఈ పందెంలో పాల్గొనాలని పట్టుబడతారు. అలా ఈరోజు ఆసక్తికరంగా ఎపిసోడ్ సాగింది..

  English summary
  Trinayani Episode (episode no 360): Tilottama pretends to be concerned about Vishal’s injury. Vishal gives Nayani the responsibility of the new project. Later, Nayani tells Tilottama that the milk was poisoned. Tilottama slaps Jasmine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X