For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial Today Episode July 20: తెగించిన తిలోత్తమ, బలపం పట్టి బావ ఒళ్ళో నాయని పాఠాలు

  |

  తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ మొదలయిన నాటి నుండి నేటి వరకూ అందరిలో ఆసక్తి రేకత్తించే విధంగా ఉంది. బెంగాలీలో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ నీ అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఇక ఈ తెలుగు రీమేక్ ని కన్నడ లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: ZeeTelugu and Zee5

   నిన్న ఏమైంది అంటే

  నిన్న ఏమైంది అంటే

  నిన్నటి ఎపిసోడ్ ప్రకారం త్రినయనికి సుధ ఆత్మ కనిపించి నీకు ఆపద ఉందని చిక్కుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత హాసిని నయని ఆడుకుంటున్న సమయంలో దురంధర, జాస్మిన్ అక్కడికి వచ్చి చేరుతారు. ఈ సందర్భంగా జాస్మిన్ నయని మధ్య బలానికి సంబంధించి నిన్న ఎపిసోడ్ లో పోటీకి సిద్ధమవుతున్నట్లుగా చూపించారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన పోటీ కూడా జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.

  పోటీలో నయని దెబ్బ

  పోటీలో నయని దెబ్బ


  ముందు నుంచి తాను బలవంతురాలునని, జిమ్ బాడీ, వెయిట్ లిఫ్టర్ ని అంటూ బిల్డప్ ఇచ్చిన జాస్మిన్ నయనిని ఎత్తడానికి అనేక తంటాలు పడుతుంది. అనేక ప్రయత్నాల తరువాత కూడా ఆమె నయనినీ ఎత్తలేక పోతుంది. ఇక ఇది సరి కాదు తాను ఓడిపోయానని ఒక నాలుగు ప్రయత్నాల తర్వాత చెప్పేస్తుంది. దీంతో అందరూ నయనిని మెచ్చుకుంటారు. ఇక జాస్మిన్ ని ఎత్తాలని కోరితే ముందు ఎందుకులే వద్దు అంటుంది. అయితే విశాల్ సహా కుటుంబ సభ్యులు అందరూ లేదు ఎత్తి చూపించాల్సిందే అనడంతో చాలా సులభంగా ఎత్తేస్తుంది.

  Trinayani Serial Today Episode July 19: నయనికి పెను గండం.. అనుమానం విశాల్.. తిలోత్తమకి కొత్త టెన్షన్!

  చిన్న పిల్ల

  చిన్న పిల్ల


  ఇదంతా జరుగుతున్న సమయంలో అలా అంత సులభంగా ఎలా ఎత్తావు ? ఆ సీక్రెట్ ఏదో చెబితే వాళ్లకు కూడా తెలుస్తుంది కదా అని కుటుంబ సభ్యులు కోరతారు. అయితే తాను జాస్మిన్ ను పాపం చిన్న పిల్ల అని జాలి పడ్డానని అలా జాలి పడటంతోనే ఆమెను ఈజీగా ఎత్తగలిగానని చెబుతోంది.. అయితే తాను చిన్న పిల్లను కాదని పెద్ద పిల్లనే అని ఓటర్ కార్డు వచ్చి మూడేళ్లు అయిందని జాస్మిన్ అంటుంది. ఓటర్ కార్డు వచ్చినా పెన్షన్ కార్డు వచ్చినా విలువలు లేకుండా చిల్లర పనులు చేసే అందరినీ చిన్నపిల్లలలానే తాను చూస్తానని నయని చెబుతుంది.

  తెగించిన తిలోత్తమ

  తెగించిన తిలోత్తమ


  ఇక తరువాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు. గంగాధర్ తోలోత్తమకి ఫోన్ చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. గాయత్రి దేవి మీ బండారం బయటపడుతుందని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. అయితే ఈ విషయంలో చాలా క్లారిటీ గా ఉన్న తిలోత్తమ తమకు ఏమీ కాదని ఆ మెమరీ కార్డు ఓపెన్ కావాలి అంటే చనిపోయిన గాయత్రీదేవి చేతి వేలిముద్రలతో అవుతుందని ఆమె తిరిగి రాలేదు కాబట్టి తమకు ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది. ఈ విషయం అంతా పరిశీలించిన గంగాధర్ కూడా మీరు ఇంకా మారరు హెచ్చరించి కాల్ కట్ చేస్తాడు.

  Trinayani Serial Today Episode July 17: ఆత్మతో మాట్లాడుతున్న నయని.. టెన్షన్ లో తిలోత్తమ అండ్ కో!

  బలపం పట్టి బావ ఒళ్లో

  బలపం పట్టి బావ ఒళ్లో


  ఇక మరోపక్క నయనికి విశాల్ ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒళ్లో కూర్చోబెట్టుకుని పలక మీద అక్షరాలు రాయిస్తూ ఆమెకు ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు.. ముందుగా ఐ లవ్ యూ అని రాయించి ఐ అంటే నేను యు అంటే నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ప్రేమపాఠాలు వల్లించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో తిలోత్తమ విశాల్ ను రమ్మని కేక వేస్తుంది. దీంతో అప్పటికప్పుడు విశాల్ సర్దుకుని నయనిని వెళ్లి పని చూసుకో అని చెబుతాడు తాను కూడా అమ్మ పిలిచిన వైపుకు వెళతాడు.

   మళ్లీ శోభనం ముహూర్తం..

  మళ్లీ శోభనం ముహూర్తం..


  ఇక తిలోత్తమ నయని విశాల్ ఇద్దరికీ శోభనం ముహూర్తం పెట్టించడానికి మళ్ళీ పంతులుని పిలిపిస్తుంది. శోభనం ముహూర్తం పెట్టించమని అడిగిన వెంటనే ఒక రోజు రాత్రి ముహూర్తం పెట్టించామని, కానీ అది ఫెయిల్ కావడంతో ఆ రోజు గాజు పెంకులు పగిలి విశాల్ కాలికి గాయం అయిందని చెప్పుకొస్తుంది. దీంతో ఇప్పుడైనా జాగ్రత్తగా ఒక ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉండగా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తర్వాతి ఎపిసోడ్ ఆసక్తికరంగా aఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Trinayani Serial Today Episode July 16: తెల్లటి చీర మీద రక్తం..ప్లాన్ ఫెయిల్ అయినా ఆనందంలో జాస్మిన్

  English summary
  Trinayani Episode (episode no 361): nayani defeats Jasmine in a battle of strength and then gangadhar called tilottama who remains unafraid of his threats. the next day tilottama calls a priest home to fix Vishal and nayanis nupital night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X