twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Trinayani Serial Today Episode July 21: తిలోత్తమ మర్డర్ ప్లాన్, నయనిని చంపేందుకు సుమనకి గిఫ్ట్?

    |

    తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ మొదలయిన నాటి నుండి నేటి వరకూ అందరిలో ఆసక్తి రేకత్తించే విధంగా ఉంది. బెంగాలీలో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ నీ అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఇక ఈ తెలుగు రీమేక్ ని కన్నడ లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    Photos Courtesy: ZeeTelugu and Zee5

    ముహూర్తం సిద్దం

    ముహూర్తం సిద్దం

    ఈ రోజు ఎపిసోడ్ లో నయని విశాల్ శోభనం ముహూర్తం ఫిక్స్ చేస్తాడు ఇంటికి వచ్చిన సోమనాథ శాస్త్రి. ఇప్పట్లో ముహూర్తాలు లేవని చెబుతూ మరో నెల తర్వాత అయితే దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయని అదే ఖాయం చేయమంటారా అని అడుగుతారు. అయితే ఈ సంవత్సరం ఆగిన వారు మరో నెల రోజుల ఆగరా అని ప్రశ్నించిన దురంధర అదే ఖాయం చేయమని చెబుతుంది, తిలోత్తమ సహా కుటుంబం అంతా ఓకే అని చెప్పడంతో ఆ ముహూర్తానికి ఖాయం చేస్తాడు.

    శంకుస్థాపన

    శంకుస్థాపన

    ఇక ఆ తరువాత తాము ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అని మరి ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చెయ్యవచ్చా లేక ముహూర్తాలు మార్చుకోవాలా ? అని అడిగితే వ్యాపారానికి సంబంధించిన అయితే బాగానే ఉన్నాయి అని దివ్యంగా ఎల్లుండి ఆ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించుకోవచ్చు అని చెబుతారు.. అయితే విశాల్ కాలు బాగోలేదు కదా మరి ఆయన శంకుస్థాపన చేయవచ్చా అని అడిగితే తనకు సెంటిమెంట్ లు లేవని కానీ మీరు ఫాలో అవుతున్న కారణంగా అది నయని చేత చేయిస్తాను అని చెప్తాడు.

    విశాల్ చెప్పడంతో నయని కూడా దానికి సరే అని ఓకే చెబుతుంది.. ఇదంతా జరిగిన తర్వాత తిలోత్తమ రూమ్ కి వెళ్లిన జాస్మిన్ వాళ్ళిద్దరి ముహూర్తం పెట్టించడం ఏమిటని ప్రశ్నిస్తుంది. అయితే ముహూర్తం నెలరోజుల తర్వాత అని ఈలోపు ఆమెను చంపేస్తానని తిలోత్తమ చెబుతోంది.

    నయనిని చంపే ప్లాన్

    నయనిని చంపే ప్లాన్

    అలా ఎలా చంపేస్తారు అని అడగగా శంకుస్థాపన రోజు వీళ్ళందరూ ఇంట్లో ఉంటే మనం మాత్రమే వెళ్దామని, నయని శంకుస్థాపన చేస్తున్న సమయంలో మనం వెనక్కు వెళితే ఆ సమయంలో పైనుంచి సిమెంట్ బస్తానో లేక పెద్ద రాడ్దో లేక పెద్ద రాయో వచ్చి తల మీద పడుతుందని, కన్స్ట్రక్షన్ సైట్ కావడంతో అది ప్రమాదమే అని అందరూ భావిస్తారని అలా ఆమెను చంపేస్తాం అని చెబుతోంది.

    అయితే ఆమె చనిపోతే ఆమె చెల్లి సుమన ఏమీ అనుమానం వ్యక్తం చేయదా అని అడిగితే ఆమె కోసం కూడా ఒక ప్లాన్ సిద్ధం చేశానని చెబుతోంది. ఆ ప్లాన్ ఏంటి అంటే అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు పెట్టి అక్క చనిపోయినా పర్వాలేదు అని చెల్లి మనసులో ఒక భావన తీసుకురావడమే.

    Trinayani Serial Today Episode July 20: తెగించిన తిలోత్తమ, బలపం పట్టి బావ ఒళ్ళో నాయని పాఠాలుTrinayani Serial Today Episode July 20: తెగించిన తిలోత్తమ, బలపం పట్టి బావ ఒళ్ళో నాయని పాఠాలు

    తిలోత్తమ ప్లాన్

    తిలోత్తమ ప్లాన్

    దానికోసం సుమనకి ఒక మోడరన్ డ్రెస్ తీసుకు వస్తుంది తిలోత్తమ. అది కేవలం మోకాళ్ళ పైదాకా గానే ఉంటుంది.. ముందు సుమన ఆ డ్రెస్ వేసుకొను అని చెబితే అనేక మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అడ్రస్ వేయించేస్తారు. అ డ్రస్ చూపించడానికి సుమన వస్తున్న సమయానికి మేనేజర్ పాతిక లక్షల డబ్బు తీసుకొచ్చి విశాల్ కి ఇస్తాడు. ఆ డబ్బు తీసుకువెళ్లి లోపల దాచి పెట్టమని నయనికి ఇస్తాడు. ఇంతలో సుమన వచ్చి ఆ డ్రస్ చూపించగానే ఆమెకు కోపం వచ్చి ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నాను ప్రశ్నిస్తుంది.

    చెంప పగలకొట్టిన నయని

    చెంప పగలకొట్టిన నయని

    ఇలా వేసుకుంటే తప్పేంటి అని అడుగుతున్న క్రమంలో జాస్మిన్ కూడా ఎంట్రీ ఇచ్చి అందరికీ నీతి వాక్యాలు చెబుతుంది గాని ఇలాంటి బట్టలు కొనుక్కొమని డబ్బులు ఇచ్చి పంపుతుంది అంటూ నిందించే ప్రయత్నం చేయగా సంయమనం కోల్పోయిన త్రినయని వెంటనే సుమన చంప పగల పడుతుంది.. అందరూ ఆశ్చర్య పోయి ఇలా ఎందుకు చేసిందా అని ఆలోచిస్తున్న క్రమంలో మరో సారి కొట్టబోతుంటే తిలోత్తమ ఎంట్రీ ఇచ్చి అలా చేయడం తప్పేమీ కాదని అంటుంది.

    డబ్బు చోరీ

    డబ్బు చోరీ

    దీంతో త్రివేణి చెల్లి మధ్య చిచ్చు పెట్టినట్లు అని అర్థమవుతోంది. కాసేపు ఈ వాగ్వాదం జరిగాక విషయాన్ని తేలిక పరచడానికి విశాల్ డబ్బు తీసుకెళ్లి దాచమని గుర్తు చేస్తాడు. ఆ డబ్బు తీసుకెళ్లి గాయత్రి దేవి పటం కింద దాచి పెడితే దానిని పరశురామ్ దొంగతనంగా చూస్తూ ఉంటాడు. నయని వెళ్లిపోయిన వెంటనే వెళ్లి ఆ డబ్బు తీసుకుని మరో రెండేళ్లపాటు ఇబ్బంది లేకుండా బతికేస్తానాని చెబుతూ అక్కడి నుంచి చెక్కేస్తాడు.

    English summary
    Trinayani Episode (episode no 362): tilottama calls a priest home to fix Vishal and nayanis nupital night. and plans to murder nayani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X