Trinayani Serial Today Episode July 22: తిలోత్తమ నూకలు చెల్లినట్టే, గంగాధర్ ఎంట్రీతో, సర్వత్రా టెన్షన్?
తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ మొదలయిన నాటి నుండి నేటి వరకూ అందరిలో ఆసక్తి రేకత్తించే విధంగా ఉంది. బెంగాలీలో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ నీ అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఇక ఈ తెలుగు రీమేక్ ని కన్నడ లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: ZeeTelugu and Zee5

పరశురామ్ దొంగ తనం
నిన్నటి ఎపిసోడ్ లో సుమన మోడరన్ డ్రెస్ వేసుకుని మోకాళ్ళపై దాకా ఎలాంటి ఆచ్చాదన లేకుండా బయటకు రావడంతో కోపగించుకున్న నయని ఆమె చెంప పగల కొడుతుంది. ఇంతలో తిలోత్తమ ఎంట్రీ ఇచ్చి అలా కొట్టడం సరికాదని ఈడొచ్చిన పిల్లని అలా కొట్టకూడదు అంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. దీంతో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం చూస్తే ఆ డబ్బును పరశురామ్ దొంగ తనం చేస్తాడు.

సుమనని టార్గెట్
పరశురాం దొంగతనం చేసిన పాతిక లక్షల సూట్ కేస్ తీసుకువెళ్లి తిలోత్తమకు ఇవ్వడంతో తిలోత్తమ పెద్ద స్కెచ్ వేస్తుంది.. ఈ డబ్బు దొంగతనం చేసింది సుమన అని భ్రమ కల్పిస్తామని దీంతో ఆమెను ఇంట్లో నుంచి పంపే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగానే మనం అనుకున్నది అనుకున్నట్టుగా త్రినయని మీద హత్యా ప్రయత్నం చేయించాలని చెబుతుంది. అలా ఇద్దరూ వెళ్లి సుమనని ఓదారుస్తూన్నట్టుగా నటించి, డబ్బు సూట్ కేసు అక్కడ పెట్టి వస్తారు.

దురంధర మేకప్
ఇదంతా ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో దురంధర మేకప్ వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖం మొత్తానికి మేకప్ వేసుకుంటే హాసిని వచ్చి పరిహాసం ఆడుతోంది.. ఇప్పటికే నిన్ను చూడలేకపోతున్న మళ్లీ ముఖానికి మేకప్ అవసరమా అని ప్రశ్నిస్తే నన్ను టెన్షన్ పెట్టకు ఇక్కడినుంచి వెళ్లిపోమని అంటుంది. మాటల మధ్యలో తగలబెట్టు అనే ఒక మాట వాడడంతో వెంటనే జుట్టు తగలబెట్టే ప్రయత్నం చేస్తుంది హాసిని.

తింగరి వాళ్ళకి పని చెప్పద్దు
అయితే అదంతా పట్టించుకోకుండా దురంధర తన ముఖానికి క్రీములు పూసుకునే పని లో పడుతుంది. జాస్మిన్ ఎంట్రీ ఇవ్వడంతో జుట్టులో నుంచి పొగలు వస్తున్నాయని హెచ్చరిస్తుంది. దీంతో జాస్మిన్ సాయంతో ముందుగా ఆ పోగలను ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఇలా చేసావు అంటే ఆవిడ తగల బెట్ట మంది కాబట్టే తగలబెట్టానని హాసిని చెబుతుంది. దీంతో ఇక మీదట తెలివి గల వాళ్లకు చెప్పాలి కానీ తింగరి వాళ్ళకి పని చెప్పద్దు అనే విషయం గుర్తుంచుకోవాలని జాస్మిన్ దురంధరుకు చెబుతుంది.

తిలోత్తమ నూకలు చెల్లినట్టే
దురంధర అలాగే అని అంటూ వెనక్కు వెళుతుంది. అయితే గంగాధర్ తిలోత్తమ ని చంపడానికి సిద్ధమవుతాడు. కానీ గంగయ్య గా చంపితే బాగోదు అని భావించి గంగాధర్ గా ఆమె భర్త గానే చంపుతానని గంగయ్య గెటప్ తీసేసి గడ్డాలు మీసాలు జుట్టు అన్నీ తీసి సంచిలో పెడతాడు.. గంగాధర్ గా మారి కత్తి తీసుకుని తిలోత్తమ గదిలోకి వెళ్ళినట్లుగా చూపించారు.
ఇంతలో ఆయనకు ఒక స్వీట్ చేసి తినిపించాలని అక్కడికి వెళ్ళిన హాసినికి సంచిలో మీసాలు, గడ్డాలు, జుట్టు అన్నీ కనిపించడంతో ఆమెకు అనుమానం మొదలవుతుంది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, గంగయ్య ఇక్కడ లేడు అంటే ఏదో జరగబోతోంది అని ఉహిస్తుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











