For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial July 24 Episode: గంగాధర్ విషయంలో హాసిని షాక్.. నయనితో అవినాభావ సంబంధం ఉందంటూ?

  |

  తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో త్రినయని సీరియల్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. బెంగాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఇక తెలుగులో రీమేక్ చేసిన దాన్ని కన్నడ భాషలో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  విశాల్ పోలీస్ కంప్లైంట్

  విశాల్ పోలీస్ కంప్లైంట్

  తిలోత్తమని చంపాలని గంగాధరం ప్రయత్నిస్తూ దొరికిపోతాడు. విశాల్ అడ్డుకోవడంతో గంగాధరం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అయితే నయని అతనికి ఆశ్రయం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియదు. అలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం ముగిసింది. నేటి ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ముందుగా ఎపిసోడ్ ప్రారంభంలో విశాల్ గంగాధర్ మీద పోలీస్ కంప్లైంట్ రాస్తూ ఉంటాడు.. అసలు ఏం రాస్తున్నాడు అని తెలుసుకోవడానికి హాసిని వెళ్లి అడగ్గా తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పడంతో ముందు షాక్ అవుతుంది.

  హాసిని షాక్

  హాసిని షాక్

  విశాల్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు విషయం ఏమిటో కనుక్కోవడానికి కుదరదని ఈ విషయం తానే కనుక్కోవాలని హాసిని భావిస్తుంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆమెకు ఒక అద్భుతమైన ఐడియా తడుతుంది వెంటనే ఇంట్లో అందరిని రమ్మని పిలుస్తుంది. ఎందుకు అలా అందరిని పిలుస్తున్నారు అంటే ఈ విషయం అందరికీ తెలియాలని అంటుంది.

  అసలు విషయం ఏంటంటే?

  అసలు విషయం ఏంటంటే?

  అలా ఇంట్లో అందరూ వచ్చాక గంగాధరానికి నయనికి ఒక సంబంధం ఉందని అది కూడా ఒక అవినాభావ సంబంధం అని చెప్పి అందరికీ షాక్ ఇస్తోంది. దీంతో దురంధర, తిలోత్తమ, జాస్మిన్ తదితరులు ఇక నయని పని అయిపోయిందని స్వయంగా హాసిని నయని మీద ఇలా చెప్పడంతో ఇక ఆమె ఇంటి నుంచి గెంటి వేస్తారని ఆనంద పడుతూ ఉంటారు. ఇంతలో విశాల్ తండ్రి నానమ్మ అసలు ఏమైందో చెప్పాలని కోరగా హాసిని అప్పుడు అసలు విషయం బయట పెడుతుంది.

  ప్లాన్ ఫెయిల్

  ప్లాన్ ఫెయిల్

  గాయత్రీ అమ్మ గారి దగ్గర అ పని చేసిన గంగాధర్ ఇప్పుడు తిలోత్తమను చంపడానికి వచ్చాడు అని అప్పట్లో గాయత్రి అమ్మగారిని కూడా చంపడంతో అతను నయనికి కూడా ఒక శత్రువు లాంటివాడిని, వారిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఆహే అని అంటుంది. దీంతో వీళ్ళందరూ మళ్ళీ షాక్ అవుతారు బయటకు పంపాలనే ప్లాన్ బెడిసి కొట్టినట్లు ఫీలవుతుంటారు. అయితే ఇంతలో అందరికీ షాక్ ఇచ్చే లాగా నయని విశాల్ రాస్తున్న పోలీస్ కంప్లైంట్ తీసుకుని చింపేస్తుంది.

  పోలీసుల దగ్గరకి వెళితే కష్టమే

  పోలీసుల దగ్గరకి వెళితే కష్టమే

  అలా ఎందుకు చేసావు అని ప్రశ్నించగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అసలు సంగతి అంతా వెలికి తీసే ప్రయత్నం చేస్తారని, అప్పుడు గాయత్రి - గంగాధర్, గాయత్రీ - తిలోత్తమా, తిలోత్తమ - గంగాధర్ మధ్య ఉన్న సంబంధాలు వెలికితీయడానికి చూస్తారని చెబుతుంది. అసలు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చంపడానికి చూస్తాడు ? అనే విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఇలా అల్లరి అవ్వడం కంటే మనమే తెలుసుకోవడం బెటర్ అని చెబుతోంది.

  పరువే ముఖ్యం

  పరువే ముఖ్యం

  తిలోత్తమ కూడా ఇంకా ఎక్కువ చేస్తే తన విషయం ఎక్కడ బయటపడుతుందో అని కాస్త జాగ్రత్త పడుతుంది. అందుకే తనకు పరువే ముఖ్యం అని కంప్లైంట్ ఇవ్వద్దని అంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతున్న సమయంలో గంగాధరం మళ్ళీ వెళ్ళి తన విగ్గు కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఇంతలో హాసిని ఎంట్రీ ఇచ్చి నీ సంగతి నాకు తెలుసు అని అంటుంది. ముందు అంతా తెలుసేమో అని భయపడిన గంగాధరం తర్వాత హాసిని మాటలను బట్టి ఇంకా తనకు ఏమీ తెలియదని ఆ విషయం అర్థం చేసుకుంటాడు.

  త్వరలోనే అన్ని విషయాలు

  త్వరలోనే అన్ని విషయాలు

  ఇక త్వరలోనే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అని చెప్పగా నువ్వు చెప్పొద్దు నేనే తెలుసుకుంటాను అంటూ హాసిని అమాయకత్వంతో చెప్పుకొస్తుంది. దీంతో నీలాంటి అమకమైన కోడలు దొరకడం తన అదృష్టం అని భావిస్తూ ఉంటాడు గంగాధరం. ఇక ఇక్కడితో నీటి ఎపిసోడ్ ముగిసినట్లైంది ఇక తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Trinayani Episode ( 365 ): Vishal writes a complaint letter against Gangadhar. Hasini says that Nayani and Gangadhar are acquainted, shocking everyone. Nayani then tears the complaint letter. Later, Hasini questions Gangadhar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X