మరీ ఇంత దిగజారుడుతనం వద్దు: కామెడీషోపై విమర్శలు, రేటింగ్స్ డౌన్...
హిందీ టెలివిజన్ రంగంలో కపిల్ శర్మ కామెడీ షోకు మంచి ఆరదరణ ఉంది. పలు కారణాలతో కొన్ని నెలల పాటు ఈ షో ఆగిపోయినప్పటికీ... నెల రోజుల క్రితం మళ్లీ పున: ప్రారంభమైంది. షో మొదలైన మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్ సరికొత్త బెంచ్ మార్కును టచ్ చేశాయి. అయితే రాను రాను ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ పడిపోతూ వస్తున్నాయి.
ఈ షోలో కపిల్ శర్మ మాట్లాడుతున్న తీరు, షోకు హాజరైన మహిళా అతిథులపై అతడు చేసే కామెంట్స్ వల్ల వారు ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అతడి వ్యవహార శైలిపై ప్రేక్షకుల్లో సైతం అంతృప్తి వ్యక్తమవుతోంది.

సల్మాన్ ఖాన్‌కు ఫిర్యాదు
కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న ఈ షోకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కపిల్ శర్మ షోను స్క్రిప్టు ప్రకారం కాకుండా తన ఇష్టం వచ్చినట్లు నడిపిస్తుండటంతో నిర్వాహకులు ఈ విషయమై సల్మాన్ ఖాన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట.
కేన్సర్ పేషెంటు మీద జోకులా? దిగజారుడు తనమే...
మరో ఎపిసోడ్లో కపిల్ శర్మ, కృష్ణ అభిషేక్ కలిసి... 2009లో నోటి కేన్సర్‌తో మరణించిన యాంటీ టొబాకో కాంపెయిన్లో పాల్గొన్న ముఖేష్ హరానె మీద జోకులు వేయడం కూడా ఈ షో ఇబ్బందుల్లో పడేలా చేసింది. ఇలా చేయడం దిగజారుడు తనమే అంటూ పలువురు నెటిజన్లు ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
ఆరోగ్యకరమైన కామెడీ లోపించింది
కపిల్ శర్మ షోలో ఆరోగ్యకరమైన కామెడీ లోపించిందని, ఫ్యామిలీతో కలిసి ఈ షో చూసే ప్రేక్షకులు ఇబ్బంది ఫీలయ్యే విధంగా జోక్స్ ఉంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ షోకు ఆదరణ తగ్గడాకి ఇవన్నీ కారణం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తగిన చర్యలు
కపిల్ శర్మ షో మీద ఆడియన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న నిర్వాహకులు... తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆరోగ్యకరమైన కామెడీతో షోను రక్తికట్టించి టీఆర్పీ రేటింగ్స్ పెంచే ప్రయత్నంలో ఉన్నారట.


Click it and Unblock the Notifications











